భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను నమ్ము’అని చెప్పాడు మహిల్సాపతి.
మహిల్సాపతి చెప్పిన మాటలను విన్నతరువాత బాలక్‌రామ్ లో కొద్దిగా మార్పు వచ్చింది. సరే నేను నా పనిని చేస్తాను. అనుకొని తన రోజువారి పనుల్లో పడ్డాడు. ఒకరోజు ఆయనకు ముంబాయికి వెళ్లవలసి వచ్చింది. సాయికి నమస్కరించుకొని ముంబాయి వెళ్లడానికి రైల్వేస్టేషన్ కు వెళ్లాడు. అక్కడ టికెట్ల దగ్గర జనం కిక్కిరిసి ఉన్నారు. తనకు టికెట్టు దొరుకుతుందని అనిపించలేదు. ఎలా చేయాలో ఏమిటో అక్కడ తప్పనిసరిగా నేను హాజరు కావాలి కదా. బాబా నీవే దిక్కు అని మనసులో అనుకొన్నాడు. కొద్దిసేపటికి ఒక ముసలాయన రగ్గుకప్పుకుని తన దగ్గరకు వచ్చాడు.అతడు అడుక్కోవడానికి వచ్చాడేమో అనుకొన్నాడు బాలక్‌రామ్. అందుకే అతడి వైపు చూశాడు. అతడు ‘బాబూ నీవు ముంబాయి వెళ్లదలిచావా. నేను వెళ్లాలని టికెట్టు తీసుకొన్నాను. కాని నాకు వేరే పని పడింది. నేను వెళ్లడం కుదరడం లేదు. నీకు అవసరమైతే ఈ టికెట్టు తీసుకొంటావా ’ అని అడిగాడు.
బాలక్‌రామ్ కు ఎక్కడ లేని సంతో షం వేసింది. ‘తీసుకొంటాను తాతా. నీకు డబ్బులు ఇస్తాను’ అంటూ టికెట్టు తీసుకొన్నాడు. ‘నాకు డబ్బు అక్కర్లేదు కాని బాబూ ముంబయిలో అనాథ పిల్లలు నీ దగ్గరకు వస్తారు. నీవు విసుగు కొనక వారికి నీకు తోచినసాయం చేయి చాలు’అన్నారు.
‘అదికాదు ఇదిగో’ అంటూ జేబులోంచి డబ్బు లు తీసి లెక్కపెట్టి ఎదురుగా చూసేసరికి దూరంగా పోతూ ఆ ముసలాయన కనిపించాడు. ఇంతలో అంత దూరం ఎలా వెళ్లాడా అని మళ్లీ చూసేలోపు దూరంగా నుంచి సాయి బాబా నవ్వుతూ కనిపించారు. కళ్లు నులిమి మళ్లీ చూస్తుంటే దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి ‘బాలక్‌రామ్ సంశయాలను వదిలిపెట్టు.
నీవు చేయాల్సిన పనిని చేయి పనే దేవుడయ్యా. నిన్ను విడిచి నేను ఎక్కడికీ పోను.నీతోనే ఉన్నాను కదా’అన్నారు. బాబా చేతిస్పర్శకు పులకిస్తూ కారుతున్న కన్నీళ్లను తుడుచుకొంటూ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు.
ఇదంతా బాబా మహిమ నే అనుకొని బాలక్‌రామ్ ముందుకు వెళ్లాడు. బాబా ఇచ్చిన టికెట్టుతో ముంబయి బయలుదేరాడు. ముంబయిలో దిగి దిగగానే ఓ పదిమంది పిల్లలు చుట్టుముట్టి అనాథ బాలలకు సాయం చేయమని అడిగారు. బాలక్‌రామ్ అక్కడ తాను చేయవలసిన పని గురించి ఆలోచిస్తూ ‘్ఛ ఛీ .. ఎందుకింతమంది.. జరగండి జరగండి’ అంటూ వారిని తప్పించుకొని ముందుకు వెళ్లాడు.
అంతే అక్కడే బాబా కనిపించి నాకు ఇచ్చిన మాటను మరిచావు. ముంబయి వచ్చేశావు కదా. అన్నారు. అదేంటి అని చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. వెంటనే బాలక్‌రామ్‌కు తాను రైలు ఎక్కుతున్నపుడు జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది. ఎంత మతిమరుపువాడిని. నిన్ననే కదా బాబాకు మాటిచ్చాను. అనుకొంటూ జేబులో డబ్బులు చేతిలో పట్టుకొని ఆ పిల్లలు న్న దగ్గరకు పరుగెత్తి వెళ్లి వారికి ఇచ్చి ఇందాక తన ప్రవర్తనను మన్నించమని వారిని అడిగాడు. తిరిగి చూసేసరికి బాబా నవ్వుతూ వెళ్లుతున్నట్లు అనిపించింది. మళ్లీ చూస్తే అక్కడ ఎవరూలేరు. బాలక్‌రామ్ నిజమే. బాబా నాతో ఉన్నారు. నేను తప్పు చేసినపుడు, ఒప్పు చేసినపుడు కనిపించారు. నాతో నాలో ఉండేబాబాను నేను సదా గుర్తుంచుకోవాలి. బాబా చూపిన దారిలో నడవాలి అనుకొన్నాడు. బాలక్‌రామ్ మనసు ఎంతోప్రశాంతి పొందింది. కొంతమంది కి సాయ నామస్మరణ చేస్తే వారికి వారి కష్టాలు దూరమయ్యేవి. మరికొంత మంది సాయ జీవిత చరిత్ర చదివితే మనశ్శాంతి దొరికేది. ఇలా ఎంతో మంది బాబాకరుణను పొందినవారు ఉన్నారు.
ఇలా ఎంతోమంది సాయి నామస్మరణతోను, సాయి జీవిత చరిత్ర, సాయిమహిమలు, సాయి లీలామృతాన్ని అనుభవించినవారు చెప్పగా విని సాయి భక్తులుగామారి తమ తమ జీవితాలను ధన్యం చేసుకొన్నవారు ఉన్నారు. సాయతత్త్వాన్ని అర్ధం చేసుకొన్నవారు ఎదుటివారిని దూషించరు. వారికష్టాలను తమ కష్టాలుగా భావించి వారి కష్టాల నుంచి బయటవేయడానికి చేతనైనంత కృషి చేస్తారు. ఇంకా ఎంతోమంది బాబా కృపకై ప్రతిరోజువారిని స్మరించేవారున్నారు. మనమూ ఆ సాయినాథుని అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతిరోజు సాయి నామస్మరణ చేసుకొందాం. సాయి చూపిన దారిలో నడుద్దాం.
జై సాయరాం.
*
సమాప్తం

- జంగం శ్రీనివాసులు 837 489 4743