భక్తి కథలు

యాజ్ఞసేని ( కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాం పిల్యము కురు సామ్రాజ్యానికి చుట్టూ వున్న జనపదాలలో పేరెన్నికగన్న ఒక జనపదము. భారతావనికి ఉత్తరాన పవిత్ర గంగానదికి ఇరుప్రక్కల వ్యాపించియున్న రాజ్యము. పృషతుడు పాలించిన అవిభక్త పాంచాల రాజ్యము.
కౌరవ పాండవులకు అస్తవ్రిద్యా గురువైన ద్రోణాచార్యుడి కోపానికి విడదీయబడి దక్షిణ పాంచాలానికి రాజధాని అయింది.
‘అహిచ్ఛత్రము’ ఉత్తర పాంచాలానికి ముఖ్యపట్టణమిది.
మహాభారత ఇతిహాసంలో పాండవులు రెండుసార్లు మారువేషాలలో కాలం గడుపవలసి వచ్చింది.
లాక్షగృహం నుండి ప్రాణాలతో బయటపడి అందు మొదటిసారి మారువేషంలో కొంత కాలం తలదాచుకొన్నది ఈ కాంపిల్యంలోనే. రెండవసారి పాండవులు మత్స్యదేశంలోని విరాట నగరంలో విరటుని కొలువులో మారువేషాలలో ‘అజ్ఞాతవాసాన్ని’ ఒక సంవత్సరకాలం గడిపారు. ఈ కాంపిల్య నగరం నుండి పాండవులు హస్తినకు చేరారు. ధర్మరాజు యువరాజ పట్ట్భాషిక్తుయ్యాడు. అంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ కాంపిల్య నగరము సప్తరాజ్యాంగాలలో వివరించబడిన విధంగా అతి ముఖ్యమైన ప్రాకారాలతో శత్రు దుర్భేధ్యమై విలసిల్లుచున్నది. ఈ నగరానికి ఒక ప్రక్క గంగానది అల్లంత దూరంలో పెట్టని కందకంగా ఏర్పడింది. లోపలి భాగంలోగల మూడు ప్రాకారాలు ఐష్టికం, దారవం, మానుషం అనేవి. మానుష ప్రకారానే్న (నర) గర్భం అని అంటారు. ఇది లోపల వుంటుంది. ప్రాకారకర్తలు దీన్ని శ్రేష్ఠమైన ప్రాకారమని తలుస్తారు. అట్టి ఈ నగరం తెల్లని నరగర్భంతో ప్రకాశిస్తున్నది.
ఎన్నో తాటిచెట్ల ప్రమాణంగల సాలవృక్షాలతో సంరక్షింపబడి యున్నది.
నగరం గోపురాలతో, అట్టాలకాలతో చుట్టూ నీటితో సంరక్షింపబడి యున్నది.
నాలుగు వైపులా గడ్డి, ధాన్యం, ఔషధాలు, తలుపులు, రథాలు, యంత్రాలు, ద్రవ్యాంగారాలు, ఊక మొదలైన వాటితో నింపబడి యున్నది.
భయంకరాలైన చక్రాలతో పెద్ద పెద్ద అట్టాలకాలతో, దృఢమైన చీలలు, ఘడియలు శతఘు్నలతో కూడి చొరరానిదై యున్నది.
దృఢమైన ప్రాకారాలతో నిర్మితమైన ఆ కోటలో సమృద్ధిగా ఆహార ధాన్యాలను గిడ్డంగులలో నిల్వచేసి ఉంచారు.
కొన్ని ప్రాకారాలలో కార్మికులు యుద్ధ పరికరాలను తయారుచేస్తున్నారు. అలాతములు, శరములు, చక్రాలు తమరములు, పరశువులు, అంకుశములు, చిల్లకోలలు, త్రాళ్ళు, చిరుకత్తుల్లాంటి మొనలుదేలిన బాణాలు, అర్థచంద్రాకార బాణాలు, పరిగలలాగా ఉండే బాణాలు, కరవాలాలు, గనెరాకమ్ములు, కుప్పెకోలలు, కూర్మనఖరం, చక్రమార్గణం, చిపయమ్ము, వత్నదంతిశరాలు, శిలాశితశరాలు, గదలు, పరిఘలు, పాశములు, ముద్గరములు, ముసలములు, శక్తాయుధాలు, శూలములు, బళ్ళెములు, శతఘ్నిలు మొదలైన వివిధాయుధాలను ఉత్పత్తి చేస్తున్నారు.
మరొక ప్రాకారంలో కొంతమంది కార్మికులు యుద్ధాలో పనికివచ్చే రక్షణ కవచాలైన కత్తులు, శిరస్త్రాణాలు, తనుత్రాణాలు (కవచములు) ప్రయోగానంతరం తిరిగి వచ్చి చేరే ముక్తాలు తయారుచేస్తున్నారు.
నగరం అనేక ఉద్యానవనాలతో శోభాయమానంగా వున్నది.
కాలంగాని కాలంలో పుష్పించి ఫలాలనొసగే విధంగా ఉద్యానవనాలలోని రక్షకులు పెట్టే ధూప ధూమములు పైకెగసి తెల్లని మేఘాలవలె పైపైకి పోతున్నాయి.
అట్లా ఎంతో ఎత్తుకు పైగెసిపోతున్న మేఘాలు ఇంకా పైకెగరలేక క్రిందికివంగి నీటికోసమై గంగానదిని చుంబిస్తున్నట్లుగా ఉన్నాయి.
నగరంలో పురవీధులు అతివిశాలంగా ఉన్నాయి. వీధులకిరువైపులాయున్న ఆకాశ హర్మ్యాలు వినువీధులను తాకుతున్నట్లున్నాయి. కొన్ని ప్రాకారాలలో కర్షకులు తాము పండించిన వివిధ అపరాలను, కూరగాయలను, నగరంలో విక్రయిస్తున్నారు.
వివిధ వృత్తులవారలు వారి వారి వృత్తినైపుణ్యంతో తయారుచేసిన వస్తువులను రాజధాని అంగళ్లలో విక్రయిస్తున్నారు.
ప్రాకారాలలో మధ్య మధ్య నిర్మింపబడిన వలయాకార బురుజుల లోపలి భాగాలలో రాతి వేదికలను నిర్మింపజేశారు.
- ఇంకాఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము