భక్తి కథలు

యాజ్ఞసేని-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయా వేదికలపై గట్టి కప్పులను నిర్మించారు. వాటిపై మణికవర్యులు రత్నాలను, ముత్యాలను, అలంకరణ వస్తువులను విక్రయిస్తున్నారు.
కొన్ని వేదికలపై వృత్తిపనివారు హస్తకళాప్రావీణ్యం ఉట్టిపడేటట్లుగా మగ్గాలపై నేసిన స్ర్తి పురుషులు ధరించే చేనేత వస్త్రాలను మరి రాజభటులు, రాజప్రముఖులు, వారి వారి అర్హతకు తగినట్లుగా ధరించే వివిధాలంకృతమైన కుట్టిన వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు.
దాసదాసీ జనాలు ఏవేవో వస్తువులను చేతబట్టి హడావుడిగా వీధులలో అటునుండి ఇటూ ఇటునుంటి అటూ తిరుగుతున్నారు.
రాజప్రాకారాలనంటుకొనియున్న ఒక దేవాలయంలో ‘ఈశ్వరాభిషేకం’ చేస్తున్నారు. ‘నమస్తే అస్తు భగన్విశే్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ..శ్రీమన్మహాదేవాయ నమః’’ అని అంతరిక్షం ఘోషించినట్లు నమక చమకాలు చదువుతున్నారు.
వేరొక కోవెలనుండి ‘నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్నో విష్ణుః ప్రచోదయాత్’ అనే మంత్రపుష్పసహిత సూక్తులు వినిపిస్తున్నాయి.
పాంచాలురు దేవీభక్తులు. అందువల్ల ఒక గుడి నుండి దేవీస్తుతులు వినబడుతున్నాయి.
రాజభటులు హడావిడిగా వీధులలో తిరుగుతూ కనిపిస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా కూడళ్ళవద్ద చేరి నిలబడియుండటం కనిపిస్తున్నది.
ఆ గుంపునుండి ఒక పెద్దమనిషి అడిగాడు ‘‘ఏమిటీ విశేషం. ఎందుకిలా ప్రజలు గుమికూడారు’’ అని.
వారిలో ఒకడు అన్నాడు- ‘‘ద్రుపద రాజకుమారి స్వయంవరమట. చాటింపు అదే’ అని.
ఇంతలో ఒకచోట రాజభటులు దండోరాచేపట్టి ఎతె్తైన వేదికపై నిలబడి చెపుతున్నారు.
‘‘ఇందుమూలముగా సమస్త ప్రజానీకానికి తెలియపరచడమేమనగా పాంచాల దేశాధీశుడు, మహారాజాధిరాజు ద్రుపద మహారాజులవారు తమ ముద్దుల పట్టి, రాజకుమారి అయిన ‘ద్రౌపదిదేవికి’ స్వయంవరాన్ని ప్రకటించ నిర్ణయించారు. వివిధ దేశాధి రాజులకు ఆహ్వానాలు పంపుచున్నారు. వచ్చే పుష్య శుక్ల అష్టమినాడు స్వయంవరం జరుగుతుందహో! ఇది రాజాజ్ఞ. తెలియగలరహో!’’ అని ఒక కూడలి నుంచి మరొక కూడలికి తరలి వెళుతున్నారు.
ప్రతి కూడలివద్దా అలా దండోరాను విన్న ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు.

2
పాంచాలము. ఇది ప్రాచీన భారతదేశంలోని ఒక జనపదం. ఈ పాంచాల రాజ్యం ఉత్తరాన హిమాలయ ప్రాంతం వరకు, పశ్చిమాన చర్మణ్వతీ నది, కురు, శూరసేన మరియు మత్స్యదేశాల వరకు, తూర్పున నైమిశారణ్య ప్రాంతంవరకు విస్తరించి ఉండేది. తదుపరి పాంచాల రాజ్యం రెండుగా విభజించబడి గంగానదికి దక్షిణాన (మాకందములోని) ‘కాంపిల్య నగరము’ రాజధానిగా దక్షిణ పాంచాలముగానూ, ఉత్తర ‘అహిచ్ఛత్త్రం’ రాజధానిగా ఉత్తర పాంచాలముగానూ ఏర్పడ్డాయి.
భరద్వాజుడు ఒక ముని. గొప్ప తపోనిష్ఠాగరిష్ఠుడు. ఒకనాడు భరద్వాజ ముని స్నానానికై గంగానదికి వెళతాడు. అప్పుడు తనకెదురుగా మహావిలాసంతో జలక్రీడలాడుచున్న ఘృతాచి అనే అప్సరసను చూస్తాడు. ఒక పెనుగాలి చేత ఘృ తాఛి చీర తొలగిపోగా నిర్మలమయిన ఆమె దేహము కనిపిస్తుంది. భరద్వాజుడు అది జూచి ఆమెను కామించాడు. ఆ మన్మథ రాగాతిశయం చేత ఆ క్షణంలోనే మునికి వీర్యస్ఖలనంకాగా, ఆ వీర్యాన్ని తెచ్చి ఒక కలశంలో భద్రపరచగా దానినుండి ‘శుక్రుని’ అంశతో (బృహస్పతి అంశతో కూడా కూడా కలదు) ద్రోణుడు జన్మించాడు. ద్రోణమునుండి పుట్టినవాడు కాబట్టి ద్రోణుడు అనీ, కలశం నుండి జన్మించినవాడు కాబట్టి ‘కలశజుడు’ ‘కలశభవుడు’, ‘కుంభసంభవుడు’ అనే నామాలతో పిలువబడ్డాడు.
భరద్వాజమునికి పాంచాలదేశ రాజైన ‘వృషతుడు’ మంచి స్నేహితుడు. ఘోర తపస్సు చేస్తున్న పృషతుడు సమీపంలో ఒక రోజు వసంత కుసుమాలను కోస్తున్న ‘మేనక’ అనే అప్సరసను చూస్తాడు. వెంటనే పృషతుడికి మన్మధరాగంచేత వీర్యస్ఖలనం కాగా ఆ వీర్యాన్ని పృషతుడు తన పాదంతో కప్పివేస్తాడు. అందుండి మరుత్తుని అంశతో ‘ద్రుపదుడు’ అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడిని పృషతుడు భరద్వాజ ముని ఆశ్రమంలోనే వదలి తాను పాంచాల దేశానికి వెళ్లి రాజ్యాన్ని పాలిస్తుంటాడు.
భరద్వాజ కుమారుడైన ‘ద్రోణుడు, పృషతుని కుమారుడైన ద్రుపదుడు ఇద్దరూ కలిసి వేదాలు చదివి, విలువిద్యలు నేరుస్తారు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము