భక్తి కథలు

యాజ్ఞసేని-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యదువృష్ణిలో భోజకుకురాంధక వీరులందరూ, నేనూ బలరాముడూ కూడా స్వయంవరానికి వస్తాము. మా శక్తివంచన లేకుండా మీకు సహాయపడగలవారము. మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు.
ద్రుపదుడు అమితానందాన్ని పొందాడు. వాసుదేవుని ఆలింగనం చేసికొన్నాడు. మనసు కుదుటపడింది.
10
అది రాజభవనము
ద్రౌపది అభ్యంతర మందిరము
ద్రౌపది తన మందిరంలో హంసతూలికా పాన్పుపై శయనించి ఉన్నది. మనసులో ఆవేదన ఎక్కువౌతున్నది. తనకు తెలియకుండానే కళ్ళవెంట అశ్రుధారలు వాటంతటవే ధారగా చెక్కిళ్ళమీదపడి క్రిందికి జారుచున్నాయి. ఏ ఆలోచనా మనసును సంతృప్తిపరచుటలేదు.
విధి వక్రించిందా. తన జన్మకు కారణభూతుడైన విధాత నిర్ణయం ఫలితాన్ని ఇస్తుందా! అని ఆలోచిస్తూ మగత నిద్రలోనికి జారుకుంది.
కలత నిద్రలోనున్న ఆమెకు ఒక్కసారిగా పెద్ద వెలుగొకటి వచ్చి మేల్కొలిపినట్టయింది. కళ్ళు తెరిచింది. కానీ అమిత తేజోమయమైన ఆ వెలుగును చూడలేక కళ్ళు మూసుకుంది.
మళ్లీ నయనాలను గట్టిగా నులిమి తెరిచి చూచింది. తన ఎదుట ఒక నీలిమేఘ వర్ణపువాడు, పట్టు పీతాంబరాలు ధరించినవాడు, నెమిలి పింఛంపైకి కనపడేటట్లుగా కాంతిలీనుచున్న రత్నఖచితమైన కిరీటాన్ని ధరించినవాడు, పెదవిపై చిరునవ్వు తొణికిసలాడుచుండ నిలబడి యున్నాడు.
పొడుగాటి చేలం క్రిందికి వ్రేలాడుచుండగా, గొప్ప మణిహారం వక్షస్థలం మీద ప్రకాశిస్తుండగా చేత వేణువు ధరించినవాడు తనవైపే చూస్తుండటంతో భయకంపితురాలైంది.
ఇంతకు పూర్వం తాను అలాంటి పురుషుడిని చూచియుండలేదు. ఇది కలయా లేక నిజమా అని అనిపిస్తున్నది. కళ్ళప్పగించి ఆ మూర్తిని చూస్తూ నిశేష్ఠురాలై ఒక శిల్పింగా నిలబడింది.
నిశబ్దాన్ని చీలుస్తూ ‘యాజ్ఞసేని!’ అని అప్యాయంగా ఒక పిలుపు వినబడింది.
అచేతనంగా ఉన్న ఆమె ఉలిక్కిపడి తనకు తెలియకుండానే చేతులు జోడించి నమస్కరించింది.
‘‘కృష్ణా! భయపడకుము. నా పేరు కృష్ణవాసుదేవుడు. వినే ఉంటావు. అవునా? అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక కొంతసేపు ఊరకుండింది. ‘‘కృష్ణా! మరొకసారి’’ అదే పిలుపు.
స్వామీ! అని అన్నది చిన్నగా.
అందరూ నన్ను వాసుదేవుడు అని పిలుస్తారు. నేనూ నీలాంటి మనిషినే. భయపడకుము అని అన్నాడు.
మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అని అడిగింది తడబడుతూ.
చెల్లెలివైన నిన్ను మనసారా చూడాలనీ, నీ ఆవేదనలో పాలు పంచుకోవాలనే కోరికే నన్ను ఇక్కడికి రప్పించింది. నీవు దేని గురించి ఆవేదన పడుతున్నావో తెలుసు. నీ అభీష్టం నెరవేరవచ్చును.
ఇదివరలో ఈ పేరు చాలా పర్యాయాలు విన్నది. తన తండ్రి ఇతడి గురించి గొప్పగా చెప్పటం కూడా విన్నది. ఇతడిపై చర్చ కూడా జరిగింది. ధైర్యం తెచ్చుకుంది. నోరు విప్పింది.
‘‘కృష్ణా! వాసుదేవా! నీ గురించి గత రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నాము. నీ సహాయం కోసం నా తండ్రి, నా సోదరులు పరితపిస్తున్నాము’’ అని ధైర్యంగా అన్నది.
‘‘మీరు సహాయార్థం ననే్న ఎందుకు ఎంచుకున్నారు? ఏమి కారణం?’’ అని అన్నాడు.
‘‘మీరు పరోపకారి అనీ, ధర్మపక్షపా అనీ, సహాయకారి అనీ’’ అని అన్నది ద్రౌపది.
‘‘యాదవులమైన మేము చాలా దూరంలో ఉన్నాము. సౌరాష్ట్రంలోనివారు గొప్ప యోధులు కారు, పైగా నేను రాజునుగాను’’ అన్నాడు వాసుదేవుడు.
ఈ వాసుదేవుడు రాజులకంటే గొప్పవాడు. భగవంతుడివనీ వదంతి. అందరూ మెచ్చి పరిగణించే గొప్ప యోధుడివి. ఎంతో గౌరవంతో చూస్తారు. అని కొంచెం పెంచిన గళంతో అన్నది ద్రౌపది.
ద్రౌపది అన్న మాటలకు శ్రీకృష్ణుడు మనసులో సంతోషించాడు. నిర్మొహమాటంగా అన్న ఆమె మాటలకు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. తండ్రి కోసమై ఆమె వేదనను అర్థం చేసుకున్నాడు. మళ్లీ అన్నది ద్రౌపది.
గురుదేవుడు సందీపాణివారు తమ గురించి అన్నీ వివరంగా తెలియపరిచారు. వాసుదేవా జరాసంధుడు కూడా నువ్వంటే భయపడతాడని చెప్పాడు.
అది గురుదేవులకు నాపైనున్న ప్రేమ అలాంటిది. నన్ను ఎప్పుడూ ఆదరంతోనే చూస్తాడు. అయితే నేను మీ తండ్రి ద్రుపదుడు కోరిన విధంగా అటు ద్రోణుడితోనూ, ఇటు కౌరవులతోనూ పోట్లాడలేను గదా! - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము