Others

యాజ్ఞసేని-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హే! కృష్ణా! వాసుదేవా! ధర్మమూర్తివి. నీదే భారము’’ అని వాపోయింది ద్రౌపది.
మరునాడు అనుకోకుండా కృష్ణద్వైపాయనుడు, సాత్యవతేయుడు అయిన వేదవ్యాస మహర్షి వారి వద్దకు వచ్చాడు.
ద్రుపదుడు, పాండవులు, కుంతీదేవి కలిసి ఎదురేగి వ్యాసభగవానునికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. వ్యాసుడు వారందరినీ కుశల ప్రశ్నలడిగి ఉచితాసనాన్ని అలంకరించాడు.
అందరూ తమ తమ పీఠాలలో ఆసీనులయ్యారు. కొంత తడవుగా తరువాత ద్రుపదుడు ‘‘మహాత్మా! భగవస్వరూపా! సాంకర్య దోషం లేకుండా ఒక స్ర్తి ఒకనికంటె ఎక్కువమందికి భార్య ఎలా కాగలదు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి’’ అని చేతులు జోడించి ప్రార్థించాడు.
ఆ మాటలు విన్న మహర్షి ‘లోకవిరుద్ధంగా కన్పట్టే ఈ విషయంలో మీమీ అభిప్రాయాలను వినాలనుకుంటున్నాను’’ అని అన్నాడు.
‘‘విప్రోత్తమా! నాకిది అధర్మమని అనిపిస్తున్నది. అంతేగాక ఇది లోకవేదాలకు విరుద్దమే. ఒకనికంటే ఎక్కువమంది భర్తలను పొందటం లోకంలో వుండదు. పూర్వులైన మహాత్ములీ ధర్మాన్ని పాటించలేదు. ఇది నాకు లోకవిరుద్ధమనిపిస్తున్నది’’ అని అన్నాడు ద్రుపదుడు.
‘‘ఈ వివాహాన్ని నా మనసు అంగీకరిస్తున్నది. నా మాటలెన్నడూ అసత్యంగావు. అధర్మంపై నా బుద్ధి ప్రవర్తించదు. కాబట్టి ఇది ఎన్నడునూ అధర్మంగాదు.
పురాణాలలో ‘కండు మహర్షి’ పుత్రికయైన ‘వార్షి’ (దాక్షాయణి) తపస్సులచే పవిత్రులైన అంతఃకరణాలుగల ‘ప్రచేత ప్రచేతసుని’ ఒకే పేరుగల పదిమందిని వివాహమాడిందనీ, ‘‘నితంతుడు అనే రాజర్షి కుమారులు, అతి బలవంతులైన సాల్వేయుడు, శూరసేనుడు, శ్రుతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అనే వారు ఔశీనరపతి (ఉశీనరపతి) కుమార్తె అయిన ‘అజిత’ అనే ఆమెను స్వయంవరంలో పొంది అందరూ కలిసి వివాహమాడారు.
అంతేగాక పూర్వం గౌతమ వంశంలో పుట్టిన ‘జటిల’ అనే ఋషికూతురు తన తపఃప్రభావము చేత ఏడుగురు ఋషులకు ఒక్కతే భార్య అయిందని కధలలో వినబడుచున్నది.
‘‘మా తల్లి మీరందరూ భిక్షవలె అనుభవించండి అని పలికింది. అందువలన మా అయిదుగురితో ఈ ద్రౌపది వివాహం ధర్మయుక్తమే’’ అని పలికాడు ధర్మరాజు.
‘‘్ధర్మాచారపరుడైన ధర్మరాజు పలికినది సత్యమే. నేను అట్లే నిర్దేశించాను. నాకు అసత్యంవలన భయమేర్పడింది. ఈ అసత్యదోషం నుండి దూరం చేసే ఉపాయం చెప్పండి’’ అని పలికింది కుంతీదేవి.
‘‘నీకు అసత్యం అంటదు. ఇది సనాతనమైన ధర్మమే. కానీ అందరికీ వర్తిస్తుందని చెప్పను’’ అని పాంచాలరాజా! నీవు ఏకాంతంగా వచ్చి తెలిసికో. ధర్మజుడు పలికినట్లే ఇది ధర్మబద్ధం’’ అని అన్నాడు వ్యాస మహర్షి.
తరువాత ఆసనం నుండి లేచి ద్రుపదుని చేయి పట్టుకొని రాజవనంలోనికి ప్రవేశించాడు మహర్షి. ఏకాంతంగా ద్రుపదునితో ఒక స్ర్తి ఒకనికంటే ఎక్కువమంది భర్తలను ఎలా పొందవచ్చునో, అది ఎలా ధర్మమవుతుందో వివరించాడు మహర్షి.
ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం తెలిపి, కుంతీ పుత్రుల పూర్వపు దివ్య రూపాలను చూచే దివ్యదృష్టిని ప్రసాదించాడు ద్రుపదునికి. దివ్య చక్షవులనిచ్చాడు.
ద్రుపదుడు పూర్వపు ఇంద్రులు నలుగురిని చూస్తాడు. నలుగురు పాండవుల స్వరూపాలనూ చూస్తాడు. తదుపరి ‘ఇంద్రుని’ కుమారుడైన అర్జునుని రూపాన్నీ చూస్తాడు. ప్రసన్నుడౌతాడవు. ఆశ్చర్యపోతాడు. ద్రౌపది అన్ని విధాలా పాండవులకు తగినదానిగా భావిస్తాడు.
‘‘మహర్షీ! మీలోని ఈ అద్భుత శక్తికి ఆశ్చర్యపడుతున్నాను’’ అని ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచిన ద్రుపదుడు వ్యాస మహర్షి పాదాలపైబడి నమస్కరించాడు.
‘‘మహారాజా! పూర్వం గొప్ప సౌందర్యరాశి అయిన ఒక ఋషి కుమార్తెకు వివాహం కుదరలేదు. ఆమె పరమశివుని గురించి ఘోర తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకొమ్మనగా ఆమె అయిదుసార్లు పతిభిక్ష పెట్టమని అడుగుతుంది. శంకరుడు నీవు మరుజన్మలో పొందుతావు అని వరమిచ్చాడు. ఆ ఋషికుమార్తెయే నీకు కూతురు అయింది. ఆ స్వర్గలక్ష్మి నీ యాజ్ఞశాలలో పాండవపత్నిగా జన్మించింది. ఇది గ్రహించి నీవు నీ యిచ్చవచ్చినట్లు చేయుము’’ అని అన్నాడు వ్యాసమహర్షి.
ద్రౌపది పూర్వ జన్మలో ‘నాలాయని’ అనే ఇంద్రసేన వౌద్గల్య మహర్షికి భార్యగా అయింది. మహాపతివ్రత. వౌద్గల్యుడు తపఃశక్తితో కోరిన రూపాన్ని పొంది ఐదు దేహాలు ధరించి మేరు కైలాస పర్వత ప్రాంతాలలో క్రీడిస్తూ అనేక సంవత్సరాలు నాలాయనిని అనుభవించి తృప్తి చెంది ఆమెను విడిచి తపస్సుకై బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. కానీ నాలాయనికి కామభోగాలలోన తృప్తిపడక శరీరాన్ని విడిచి కాశీరాజు అనే రాజర్షికి కూతురుగా పుట్టింది.
- ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము