భక్తి కథలు

చిత్తం మార్చే చిత్రం (ఆంధ్రగాథాలహరి-3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృత మూలం
దుగ్గ అకుంటుంబ అట్ఠీ కహంణు మఏ ధో ఇఏణ సోఢవ్వా
దసి ఓ సరంత సలిలేణ ఉ అహ రుణ్ణం పడఏణ (సిరిధమ్మియుడు)

సంస్కృత ఛాయ
దుర్గత కుటుంబా కృష్టిః కథం నుమాయా ధౌతేన సోఢవ్యా
దశాప సరత్సలిలేన పశ్యత రుదిత మివ పటకేన
తెలుగు
దారిన పోతున్న బాటసారికి ఒక ఇంటిముందు ఆరవేసి వున్న చివికి చిరుగులు పడ్డ దుప్పటి ఒకటి కనిపించింది. అతనికిలా అనిపించింది.
తే.గీ పేదరాలుతికి బయట వేసినట్టి
చివికి చిరిగిన దుప్పటి చివరనుండి
జారిపడు నీటి బొట్టుల తీరు జూడ
‘అలసి సొలసితి మేనిలో బలము లేదు
విడువుడికనైన నన్నని’ వేడుకొనుచు
కార్చు కన్నీటిబొట్లుగా కానిపించు!!
-ఆరవేసిన దుప్పటి కొసలనుండి బొట్లు బొట్లుగా నీరు కారుతోంది!
‘చాలా ఏళ్ళనుంచి మీకు సేవ చేస్తూనే ఉన్నాను. ఇకనైనా నన్నువదిలిపెట్టండి’ అని దుప్పటి కన్నీరు కారుస్తూ ఆ కుటుంబాన్ని వేడుకుంటోందా! అన్నట్టుగా ఉందట ఆ దృశ్యం.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com