భక్తి కథలు

హిందూ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాపురుషుల జయంతులు జరుపుకోవడం సర్వసాధారణం. అలాకాక, యావద్భారత దేశాన్ని ఒకే ఛత్రం క్రిందకు తెచ్చి పట్ట్భాషిక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినాడు రాయగఢ్‌లో సమర్ధ రామదాస్ ఆశీస్సులతో శివాజీ మహారాజ్ ‘్ఛత్రపతి’గా విద్యారణ్యులు హరిహర, బుక్కరాయలు రాజ్యాధినేతలు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి, పలు కారణాలతో 300 ఏళ్ళు అప్రతిహతంగా కొనసాగిన విజయనగర సాప్రాజ్యం తిరిగి మహమ్మదీయుల చేతికి చిక్కడంతో, సమర్ధరామదాసు చాణక్యనీతితో ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠ చేసాడు. అందువల్ల ఈ రోజు- జ్యేష్ఠశుద్ధ త్రయోదశి- హిందువులకు మహాపర్వదినమైంది. విజయనగర సామ్రాజ్య పతనంతో బహమనీ రాజ్యం, అహ్మద్‌నగర్ కేంద్రంగా నిజాం షాహీ, గోల్కొండలో కుతుబ్‌షాహీ, బీజాపూర్‌లో ఆదిర్‌షాహీలు స్వతంత్రంగా రాజ్యాలను ఏర్పరుచుకుని ప్రధానంగా దక్షిణ భాతదేశంలో హిందూ స్ర్తిల మానభంగాలను, మత మార్పిడులను, అడ్డువచ్చిన వారిని హత్య చేయడం వంటి దురాగతాలకు పాల్పడ్డారు. వీరికి తోడు మత దౌష్ట్యానికి, అసహనానికి మారుపేరైన మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు అకృత్యాలకు అంతేలేదు. సమస్త భారతావనిలో హిందూజాతి నిరాశా నిస్పృహలకు నెలవై దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఆ సమయంలో శివాజీ జననం జాతికి వేగుచుక్కగా ఆకాశాన పొడిచింది. నాటి చరిత్రకారులు కూడ ‘క్రూరమైన మొగలారుూల పరిపాలనలో, షాహీల దుష్ప్రవర్తనలతో, హిందూ సమాజం మ్రగ్గుతున్నవేళ, గో, బ్రాహ్మణులకు రక్షణ కరువైన వేళ, పవిత్రమాతృమూర్తుల కన్నీళ్ళు మహానదులై ప్రవహిస్తున్నవేళ స్వతంత్ర హైందవ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించి, ఈ దేశంలో హిందువులు సగర్వంగా తలెత్తుకుని జీవించే స్థితిని నిర్మాణం చేసిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ’ అన్నారు.
శివాజీని వీర శివాజీగా తీర్చిదిద్దినవారు ముగ్గురు. షాహీల కొలువులోనున్న శహాజీ భార్య శివాజీ తల్లి జిజియాబాయి; బాల్యంలోనే శివాజీకి ఇతిహాసాలు, వీరగాథలు, భవానీ మాతపై భక్తిని రంగరించి దేశభక్తిని నింపింది. రెండవ వ్యక్తి కులగురువైన దాదాజీ కొండదేవ్. బాల్యంలోనే అస్తశ్రస్త్ర విద్యలు నేర్పి సుశిక్షితుడైన వీరయోధునిగా నిలిపాడు. దేశంలో హిందూ ధర్మం పునఃప్రతిష్ఠించడానికి మార్గనిర్దేశనం చేసింది. రాజగురువైన సమర్ధరామదాసు మూడవ వ్యక్తి. పదహారేళ్ళ వయస్సులో తోరణ దుర్గాన్ని ఆక్రమించి తన జైత్రయాత్ర ప్రారంభించాడు. తన జీవిత కాలంలో ముప్పది యుద్ధాలు చేసి అసమాన పరాక్రమంతో తురుష్క ముష్కరులకు సింహస్వప్నంగా మారాడు. ‘శివాజీ ప్రదర్శించిన ధైర్యము, సాహసము, పరాక్రమము, సమయస్ఫూర్తి, నేర్పరితనము అసమానమైనవ’’ని నాటి చరిత్రకారులు అభిప్రాయం.
శివాజీ యుద్ధాలలో కాని, పరిపాలనలో కాని సంయమనాన్ని కోల్పోలేదు. హిందూ ధర్మానికి వ్యతిరిక్తంగా ప్రవర్తించలేదు. ముస్లిం పాలకులవలె గాక ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాల జోలికి పోలేదు. వారి మహిళల మానప్రాణాలకు హాని తలపెట్టలేదు. తుల్జ్భావానీ మందిరాన్నీ, పాండురంగని దేవాలయాన్ని ధ్వంసం చేసిన అఫ్జల్‌ఖాన్ మోసంతో శివాజీని అంతమొందించడానికి ప్రయత్నించగా కుట్రను కుట్రతోనే ఎదుర్కొని మట్టుపెట్టాడు. ఒకసారి తన దళపతి అబ్బాజీసోమ్‌దేవ్ కల్యాణ దుర్గాన్ని వశపర్చుకుని, ఆ కోటను రక్షిస్తున్న సుబేదారి కోడల్ని నిర్బంధించి శివాజీకి కానుకగా సమర్పించబోగా, సోమ్‌దేవ్ చర్యకు ఆగ్రహించిన శివాజీ అతన్ని మందలించాడు. సుబేదారి కోడలితో ‘‘అమ్మా! నా దళపతి చర్యకు నన్ను మన్నించు.’’ నా తల్లే కానుక నీ అంత అందంగా ఉంటే నేను ఎంతో అందంగా జన్మించేవాణ్ణి.’’ అంటూ శివాజీ ఆమెను హిందూ సంస్కృతి ప్రకారం ఒక వివాహితయైన స్ర్తి పుట్టింటినుండి మెట్టింటికి వెళ్ళేటప్పుడు అనుసరించే విధివిధానంగా చీర సారె నిచ్చి మేనాలో తన రక్షక దళం వెంట నుంచి సుబేదార్‌కు అప్పగించాడు. అద్భుతం. శివాజీ జీవితంలో ఎన్నో మరపురాని ఘట్టాలున్నాయి. శివాజీ సర్వమత సమభావంతో పరిపాలన చేసాడు. శివాజీ సైన్యంలో ఎందరో ముస్లింలు ఉన్నత పదవుల్లో ఉండి ప్రభుత్వం పట్ల భక్త్భివనను ప్రదర్శించేవారు.
శివాజీ పాలనాకాలంలో అంతకుముందు బలాత్కారంతో ముస్లింలు మతం స్వీకరించినవారిని తిరిగి హిందూ ధర్మంలోనికి ఆహ్వానించాడు. ఆనాటి వరకూ రాజ్యభాషగా పార్శీ భాష చలామణి కాగా, దాని స్థానంలో సంస్కృతాన్ని అధికార భాషగా వ్యాపింపజేసాడు. మహిళల అభ్యుదయానికీ, రక్షణకు చట్టాలు రూపొందించాడు. స్ర్తివిద్యను ప్రోత్సహించాడు. శివాజీ సామ్రాజ్య సాధనకు, వైభవానికి స్ఫూర్తి విజయనగర సామ్రాజ్య పరిపాలనలోని ఆర్థిక, రక్షణ, సంస్కృతీ వ్యవహారాలే మార్గనిర్దేశనం చేశాయని చరిత్రకారులంటారు.
‘‘ఈరోజు మావంటివారు హిందూ సన్యాసులు- నిర్భయంగా రాజ వీధుల్లో తిరుగుతున్నారంటే అది శివాజీ మహారాజ్ పెట్టిన భిక్ష’’ అంటారు శ్రీశ్రీ కంచి మహాస్వామివారు.
రాయగఢ్‌లో పట్ట్భాషేకానంతరం, హిందూ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించి తన గురువైన సమర్ధ రామదాసు పాదాల చెంత తుల్జ్భావానీ మాత ప్రసాదించిన ఖడ్గంతోపాటు ఉంచాడు. రాజగురువుల ఆజ్ఞానుసారం పాలనా విధులను చేపట్టినా గురువుల పేరునే పరిపాలన సాగించాడు ఛత్రపతి శివాజీ!
పట్ట్భాషేకానంతరం శ్రీశైల భ్రమరాంబికను దర్శించి,‘‘నీ ఆశీర్వాద బలంతో నా లక్ష్యాన్ని సాధించాను. అందుకు కృతజ్ఞతగా నన్ను నేను సమర్పించుకుంటున్నా’’నంటూ ఒరలోని ఖడ్గం తీయగా భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ‘‘వత్సా! నీవు సామాన్యుడవు కావు. ఈశ్వరాంశవు. హిందూ ధర్మ సంరక్షణకు అవతరించావు. నీవింకా ఎంతో చేయాల్సివుంది. నీవు కారణజన్ముడవు’’ అంటూ శివాజీ చేతిలోని ఖడ్గాన్ని తీసుకుని భ్రమరాంబికా దేవి ఆ ఖడ్గాన్ని తిరిగిచ్చివేసి ఆశీర్వదించింది. ఈ కథ అత్యంత ప్రాచుర్యంలో ఉంది. ఛత్రపతి శివాజీ ఈశ్వరాంశ సంభూతుడని, శివాజీ హిందూ ధర్మసంరక్షకుడని ఉగ్గడిస్తూ శ్రీ గడియారం వేంకట శేషశాస్ర్తీగారు తమ ‘‘శివ భారతం’’లో-
మూడవ కన్ను ననె్నదుట ముమ్మొనవాలు కరమ్మునందు రే
ఱేడు శిరమ్మునందు చిగిరింపగ నాడనసూయ యింట పా
రాడిన పాపడే మన గృహంబున నేడుదయించెనేమొ! ఱే
కాడిన వాని ఛాయలు యట్టిది ధన్యుడ వీవు భూవరా! అన్నారు.
శివాజీ ఏ విజిగీష ప్రవృత్తితో మత తత్త్వాన్ని నిర్మూలించి విజయం సాధించాడో అటువంటి శక్తి జన జీవనంలో నిర్మాణం చేయవల్సిన అవసరం ఉంది. అందుకని శివాజీ చరిత్రను అందరూ అధ్యయనం చేయాలి.

-ఎ.సీతారామారావు