భక్తి కథలు

దొంగిలకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దొంగిలకూడదు’ - నిర్గమ 20:15.
స్వాభావికంగా చిన్ననాటి నుండి చిల్లర చిలిపి దొంగతనాలు మొదలౌతాయి. చిన్నచిన్న వస్తువులు, పెన్నులు, బట్టలు, పేపర్లు.. ఇలా. అది అలవాటుగా మారినప్పుడు వస్తువుల సైజు పెరుగుతుంది. కాయిన్స్ నుండి కరెన్సీగా మారుతుంది. ఇక దీనికి అంతు ఉండదు. కొంతమంది దీనికి ‘ఎడిక్ట్’ అవుతారు. అవసరమున్నా లేకున్నా దొంగతనం అలవాటుగా చేస్తూంటారు. దీనినే Kleptomania అంటారు. ఇది ఒక విధమైన మానసిక వ్యాధి. సమయాన్ని దొంగిలించేవారు - పని సమయంలో రెండు మూడు గంటలు మాయమై పోతారు. కొంతమంది సీటులో ఉంటారు కాని పని చేయక ముచ్చట్లతో కాలక్షేపం చేస్తారు. సెల్‌ఫోన్లతో కాలయాపన చేస్తూంటారు. Time is (valuable) Money.
తల్లిదండ్రులకు, టీచర్లకు తెలియకుండా చేసే పనులు దొంగ పనులే. దొంగలకు సహకరించేవారు కూడా దొంగలే. సహకరించిన, సలహా ఇచ్చిన వారికి కూడా పాలు ఉన్నట్లే.
దొంగ సొమ్ము అని తెలిసి, ఆ సొమ్ముతో చేసే ఎంత మంచి పని అయినా అది మంచి పనిగా పరిగణింపబడదు. దొంగ బోధకులు, దొంగ బాబాలు ఈ మధ్య ఎక్కువయ్యారు.
దొంగ భక్తులు - ఈ మధ్య కాలంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకోవటానికి భక్తి ఒక మార్గమైంది. దేవుని మోసం చేస్తున్నారా? మనుషులను మోసం చేస్తున్నారా? వారిని వారే మోసం చేసుకుంటున్నారో అర్థం చేసుకుంటే మంచిది.
సామెతలు 9:17 - (తెలివిలేని వాడికి) దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన ఆహారము రుచి అని చెప్పును. దేవునికి ఇవ్వవలసిన సమయము ఇవ్వకపోయినా, దేవునికి చెందవలసిన ఫలము ఇవ్వకపోయినా, ఇవ్వవలసిన మహిమ ఇవ్వకపోయినా - దేవునివి దొంగిలించినట్లే.
దేవుని పేరున డబ్బు వసూలు చేసి సరియైన రీతిలో వాడక పోయినా అది కూడా దొంగతనమే. దేవుని దృష్టిలో గినె్నడు చన్నీళ్లకు కూడా విలువ ఉంది. 1 పేతురు 4:5 - మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడవుగా గాని బాధ అనుభవింప తగదు.
యోహాను 10:10 - దొంగ దొంగతనము చేయుటకును నాశనము చేయుటకును వచ్చును కాని మరి దేనికి రాడు. సాతానుడు దొంగతనానికి జనకుడు. వాని పని దొంగిలించుటయే. మన సమయాన్ని, మన తలాంతులను, మన ఈవులను చివరకు మనలను కూడా దొంగిలించి నాశనము దాకా నడుపుతాడు. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది మాత్రము సమృద్ధిగల జీవము, సంపన్న జీవితాన్ని ఇవ్వటానికి. ప్రభువును నమ్మి చెడుతనము విడిచిపెట్టాలి.
ఎఫెసీ 4:27-28 - అపవాదికి చోటియ్యకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనులు చేయుచు కష్టపడవలెను. అక్కర గలవానికి పంచి పెట్టుట వలన అవసరతలో వున్నవారిని దొంగలుగా మారకుండా కాపాడవచ్చు.
మన అందరికీ తెలిసిన కథే. చిన్నప్పుడు సూది దొంగతనం చేసినప్పుడు తల్లి సంతోషించింది - ఆ పిల్లవాడి పట్ల. వాడు పెద్దదొంగగా మారి జైలులో ఉన్నప్పుడు తల్లిని పిలిచి, ఆమె చెవిని గట్టిగా కొరికాడట. ఎందుకు కొరికావు అంటే, చిన్నప్పుడు సూది తెచ్చినప్పుడు అది తప్పు అని తెలియజెప్తే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు గదా - అని చెప్పాడుట. ఈ లోకంలో దొంగతనము చేసి తప్పించుకోవచ్చు. కాని దేవుని తీర్పు తప్పించుకోలేడు. దొంగగా చనిపోతే దేవుని తీర్పులో తప్పించుకోలేము. ‘ప్రభువుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనువారిని వెయ్యి తరములకు ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రభువు ఆజ్ఞలను గైకొనకపోతే తండ్రుల దోషము కుమారుల మీదికి మూడు నాలుగు తరాల వరకు ఉంటుంది. 8వ ఆజ్ఞ- దొంగిలకూడదు. ఆయన ఆజ్ఞలను పాటించి వెయ్యి తరాలకు ఆశీర్వాదకరంగా మనమందరము ఉండగలుగుటకు దేవుడు కృప చూపించునుగాక. ఆయన కృప నిరంతరముండును.

-మద్దు పీటర్ 9490651256