భక్తి కథలు

ఆషాఢ ప్రత్యేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెప్పబడింది. వర్షరుతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేషఫలితాన్ని ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాఢమాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురి పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సుబ్రమణ్యస్వామిని ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు.
ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలల తరువాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజుల పగలు, రాత్రి, నిమిషం ఘడియ, విఘడియల తేడాలేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభముతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయబద్దంగా బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు.
దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినానే్న బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్తజగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపునీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాధుల నుండి ఉపకరించేవి. ఈ సమయంలో అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈమాసంలోనే మొదలు పెడుతారు రైతులు. చైత్రవైశాఖ మాసాలలో వ్యవసాయ పనులు ఉండవు. కాబట్టి ఈ సమయంలోనే వివాహాది శుభముహుర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరునెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయ పనులు చేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చోని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు అవి. ఇప్పటిలాగ కాలువల ద్వారా నీరు లభించేదికాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్య్రంతో బాధ పడాల్సిందే.
అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం విధించారు పెద్దలు. అంతేకాకుండా అనారోగ్యమాసం ఆషాఢం. విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్ర్తిలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అన్ని అరిష్టాలు ఉన్నాయని కొన్ని పనులు కూడదని చెప్పారు. మన పెద్దలు.గ్రీష్మంలో మన శరీరం బాగా వేడి పెరుగుతుంది.
ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది. మన శరీరంలో ఉన్న వేడి బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్దం కాబట్టి అనారోగ్యాలు మొదలవుతాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీస్తే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు. కాబట్టి మహిళలు ఆషాఢమాసంలో అందంతోపాటు ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకును అరచేతుల నిండా నింపుకోవాలి.

-హెచ్.ఉమాశంకర్, 9394799792