భక్తి కథలు

భక్తితో భవ్యజీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమశీలత, సాధువర్తనం సహనం, నియబద్ధ జీవనం, స్నేహశీలత, సకల సద్గుణాలను వ్యక్తిలో మూర్త్భీరింపజేసేది నిర్మల భక్తి! నిశ్చల మానసిక శక్తితోకూడిన భక్తి! దైవత్వ సిద్ధికి అలాంటి భక్తియే దారి! దానికి తార్కాణం రాముడు.కాని లోకంలో శివకేశవులకు భేదాలు చెప్పుకుంటూ మనుష్యులు తారతమ్యాలను సృష్టించుకుంటూ ఉంటున్నారు. శివకేశవులకు భేదం లేదు. వారిద్దరి మధ్య భేదం సృష్టించిన వారికి కీడు కలుగుక మానదు. శ్రీరాముడెపుపడూ శివధాన్యంలో ఉంటాడట. శివుడెప్పుడు రామనామాన్ని ధ్యానం చేస్తుంటాడు. శివుడు అర్థనారీశ్వరుడు. తన శరీరంలో అర్థ శరీరాన్ని తన సతికి ఇచ్చాడు. రాముడు సీతమ్మను తప్ప అన్యులెవరినీ కలలోకి కూడా రానిచ్చేవాడు కాడట. రాముడు పరాక్రమానికి మారుపేరు.. శివుడిని పూజించిన వారికి మంగళాలు కలుగుతాయ. రాముని పూజించినవారికి అధైర్యమే కలుగదు.
ఇద్దరూ లోకారాధ్యులే! అనవరతం భక్తులతో పూజలు అందుకునేవారే! ఆరాధనీయులైన మహాపురుషులపట్ల భక్తి కలిగి వుండటం వారి నిరహంకారానికి, సౌజన్యానికి నిదర్శనం! ఆదిదేవుడిగా పూజలందుకుంటున్న చంద్రశేఖరుడురామునిలోని సత్యనిష్టని, దైవభక్తిని క్రియాశీల భుజశక్తిని, మాతాపితలపట్ల, మహనీయులైన ఋషులపట్ల గల ఆరాధనని, శివుడు అర్థం చేసుకున్నాడు. ఆరాధించాడు. రాముణ్ణి ఇంతగా అభిమానించిన శివుడు జగన్మాత పార్వతికి శ్రీరాముని చరిత్ర చెప్పాడు. అదే అధ్యాత్మరామాయణం!
అవతారపురుషుడిగా ప్రజలు కీర్తిస్తున్న రాముడు అహంకార రహితుడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, కర్తవ్య నిర్వహణలో రావణ సంహారానంతరం అయోధ్యకు వస్తూ దక్షిణ సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్టించి అచంచల భక్తితో పూజించాడు. అదే నేడు ‘రామేశ్వరం’ అనే పేరుతో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. అన్ని కష్టాలకు, సుఖాలకు మనతోటి వారు కారణం కాదు. అంతా దైవేచ్ఛ ప్రకారం జరుగుతాయ. ఎన్నో సార్లు లక్ష్మణుడికి, సీతకు చెప్పాడు. ఆఖరుకు ఆయన తండ్రి వనవాసం వెళ్లబోతున్న రాముడిని చూచి కన్నీరు పెట్టుకుంటే భగవంతుడు నిర్ణయంచనట్టు మనం నడవాలి కాని మనిష్టం వచ్చినట్టు నడవాలని అనుకోకూడదు. దైవం చూపిన దారిలో నడుస్తుంటే మంచి రోజులు తప్పక వస్తాయ అని చెప్పాడు.
శివభక్తి తత్పరత మాత్రమే కాదు శ్రీరాముడు దైవాన్ని ప్రజలలో కూడా దర్శించాడు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రజలే దేవతలుగా భావించి పాలన సాగించాడు. ‘‘రామరాజ్యం’’ అని నేడు కూడా ప్రజలు వాంఛింతగా ఆనాడు రాముడు పాలించాడు. అఖిల భారత ప్రజానీకానికి రాముడు ఆరాధ్యదైవం అయ్యాడు. రామునినామం చిరస్మణీయం అయింది.
మాతృదేవోభవ, పితృదేవభవ, ఆచార్యదేవభవ అనే ఆర్యోక్తుల్ని శ్రీరాముడు అక్షరాలా ఆచరణలో పెట్టాడు. విద్యార్థి దశలో వశిష్టాశ్రమ గురుకులంలో అరుంధతీ వశిష్ఠుల్ని, విశ్వామిత్రాది మహాఋషుల్ని వినయ విధేయతలతో సేవించాడు.
ప్రజారంజక పాలకులగా ప్రసిద్ధి చెందిన సూర్య వంశ రాజ కుటుంబంలో జన్మించిన రాముడు ఆటవికురాలైన శబరిని యోగినిగా సంభావించి గౌరవించాడు. గిరిజనులైన ఆంజనేయ సుగ్రీవ జాంబవంత సుషేణాదులతో మైత్రి పాటించాడు. వారి జాతినిగాక వారి భక్తి విశ్వాసాల్ని, మనోనైర్మల్యాన్ని, శ్రమ శీలతని, కార్యదీక్షని, మెచ్చుకున్నాడు. నిషాధరాజైన గుహునితో సఖ్యం చేశాడు.వారంతా విద్యా వివేకాలుగల వనచర వీరులన్నాడే కాని, రాముడు ఎక్కడా కులమతాలను పట్టించుకున్నట్టు మనకు కనబడదు.

- జానకి