భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి డా॥ పిళ్లె కు నారికురుపు లేచింది. ఎంతో బాధ అనుభవిస్తునే ఉన్నాడు. బాబా దగ్గరకు వచ్చి ‘బాబా నీ కురుపు బాధను నేను భరించలేను. నీవేదైనా చేయి’ అని అడిగాడు.
‘ఏముందిలే పదిరోజులు భరించు పది సంవత్సరాల బాధ దూరవౌతుంది. ’అన్నారు.
‘అబ్బా ఇంకా పదిరోజులు పడాలా అన్నారు. మరి పదినిముషాల్లో తగ్గిపోవాలి అంటే ఎలా ఒక కాకి రావాలి. ఆ కాకి వచ్చి నీ కురుపు పొడుస్తుంది. అపుడు ఆ కురుపు పగిలి తగ్గిపోతుంది ’అన్నారు.
కాకి పొడవడం నా కురుపు తగ్గడమూ ఏంటో ఈ బాబా ఏం చెబుతారో నాకు అర్థమే కాదు అని మనసులో అనుకొంటూ వెనక్కుతిరిగారు. ఎక్కడ్నుంచో హడావుడిగా అబ్దుల్లా అనే భక్తుడు బాబా దగ్గరకు రాబోయి పిళ్లే కురుపు పైన కాలేశాడు. వెంటనే ‘అమ్మా’ అని పిళ్ళే అరిచాడు. బాబా తగ్గుతుందిలే ఇపుడే కదా చెప్పాను అన్నారు. అపుడు ఆ కురుపు పగిలింది. రక్తం చీము కారింది. ఆ తరువాత మెల్లగా రెండు మూడు రోజుల్లోనే పూర్తి తగ్గిపోయింది. బాబా చెప్పేవన్నీ నిగూఢమైన అర్థాలు ఉండేవి. వాటిని అర్థం చేసుకొన్నవారు చాలా అరుదుగా ఉండేవారు.
బాబా దగ్గరకు వచ్చిన వారికి ఎంతో సంతోషంగా ఉండేది. వారేదైనా అనారోగ్యంతో ఉన్నా కూడా ఆ అనారోగ్యం దూరమైయ్యేది. వారు దారిద్య్రబాధ పడలేమని అనుకొంటే వారికి ఏదో ఒక ఉద్యోగం లభించి వారి దారిద్య్రం దూరమయ్యేది. ఇలా ఎన్నో సంగతులుబాబా సన్నిధిలో జరుగుతూ ఉండేవి.
ఒకసారి నెల్లూరు నుంచి ఒక వైశ్యుడు తన కూతురుని తీసుకొని వచ్చాడు. ఆమెకు రెండు మూడు రోజులకు ఒకసారి జ్వరం వస్తుండేది. ఆ జ్వరం వస్తే తగ్గేదికాదు. జ్వరం తగ్గిన తర్వాత చాలా నీరసంగా ఉండేది. ఎపుడూ ఏదో ఒక అనారోగ్యంతో కళతప్పి ఉండేది. ఆమెను చూసి తల్లిదండ్రులు ఎంతో బాధ పడేవారు. అందుకే ఎవరో బాబాను దర్శనం చేసుకొంటే బాధలు తీరుతాయి అన్నారని బాబా దర్శనం కోసం వచ్చాడు.
బాబాను చూడగానే వైశ్యుని మదిలో ఎంతో సంతోషం అనిపించింది. కాని బాబా ఏమీ మాట్లాడలేదు. అతడు కూడా ఆ అమ్మాయిని వెంట బెట్టుకుని బాబా మాట్లాడేదాకా అక్కడే ఉందామని మసీదులో కూర్చున్నారు.
కొద్దిసేపు గడిచింది. ఎవరో ఆపిల్ పండ్లను తీసుకొని వచ్చి బాబాకు సమర్పించారు. అందులో ఒక పండు తీసుకొని ‘ఓ సుశీలా! ఇటు రాఅమ్మా! ’అన్నారు. వైశ్యుని కూతురు దిక్కులు చూసింది.
‘నినే్న తల్లీ,నీకే కదా బాగలేదు బాగలేదు అని అంటూ మీ తండ్రి ఇంత దూరం తీసుకొని వచ్చాడు. రమ్మంటే రావేమి’అన్నాడు. వైశ్యునికి కళ్లల్లోంచి ధారాపాతంగా నీరు కారసాగాయి. అతడు లేచి సాష్టాంగ దండప్రణామాలు అర్పించాడు. వెంటనే ఆ అమ్మాయిని చేయి పట్టుకొని బాబా దగ్గరకు తీసుకొని వెళ్లాడు. ‘ఎందుకమ్మా అంతభయం. ఏమీ అక్కర్లేదు. అనారోగ్యమూ ఏమీ లేదు నీకు ఇక జ్వరమూ రాదు నీవు చక్కగా నవ్వుతూ తిరుగుతావు. ఎన్నో పనులు చేయాలి ’’అన్నాడు బాబా.
అప్పటిదాకా ఎంతో నీరసంగా ఉన్న పిల్ల కళ్లల్లోజీవం వచ్చినట్టు అక్కడి వారికి అనిపించింది.
బాబా చేతిలోని ఆపిలుపండును తీసుకొని ఆ అమ్మాయి చేతిలో పెట్టారు. దీన్ని తిను అమ్మా. ఆపిలు పండ్లు అరటి పండ్లు కాస్త తినాలి కదా. అప్పుడప్పుడు పండ్లు కొనిపెట్టండి పిల్లలకు అన్నారు. ఆ అమ్మాయి ఆ పండు తీసుకోగానే అప్పటిదాకా ఉన్న ఉబ్బసం ఆయాసం కాస్త తగ్గినట్లు అనిపించాయి.
వైశ్యుడు మర్రోజు వచ్చి బాబాకు నమస్కరించి ఎన్నో ఏళ్లనుంచి మా అమ్మాయి ఈ జబ్బుతో బాధపడుతోంది. మీరు ఒక్కనిముషంలో ఏ మందులు లేకుండా తగ్గించేసేశారు మీమేలును ఎన్నటికీ మరవను. మీరే నాకు భగవంతుని రూపం అని చేతులెత్తి నమస్కరించాడు. అప్పటినుంచి ఆ వైశ్యకుటుంబం ప్రతిసంవత్సరమూ శిరిడీ కి రావడం ప్రారంభించారు. ఒకరోజు ఒక శివుడు అను భక్తుడు వచ్చాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743