బాల భూమి

పాపం( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవాపురంలో గొప్ప ధనవంతుడు గోపాలయ్య. అతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. రాబడి చాలా ఎక్కువగానే వస్తుంది. ఐనా పిల్లికి బిచ్చం పెట్టడు. ఎంగిలి చేత్తో కాకిని అదిలించడు. కడుపు నిండా తినటం తప్ప కడుపుకాలే వారికి పిడికెడు అన్నం పెట్టిన పాపాన పోడు. అతడి ఇంటికి ఊరి వారి రాకపోకలూ తక్కువే. బిచ్చగాళ్లు ఇంటి ముందు కనిపిస్తే చాలు నానా తిట్లూ తిడుతూ కర్ర పట్టుకు వచ్చి తరిమి కొడుతుంటాడు. ఊరి వాళ్లంతా అతగాడి గురించి కథలు కథలుగా చెప్పుకుని నవ్వుకుంటూంటారు.
ఆ ఊళ్లోనే చిన్న పండ్ల వ్యాపారి మాధవయ్య. ప్రతిరోజూ ఎవరికో ఒకరికి అన్నం పెట్టందే భుజించేవాడు కాదు. వ్యాపారం కూడా చాలా న్యాయంగా చేసేవాడు. ఊరి వారంతా అతడి వద్దే పండ్లు కొనేవారు.
ఒక రోజున ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు మధ్యాహ్న సమయంలో ఒకరి ఇంటి వద్దే అన్నం కోసం మూడుసార్లు కేకేసేవాడు. వారు సమాధానం చెప్పకపోతే మరొకరింటికి వెళ్లేవాడు కాదు. ఆ రోజు ఇహ భిక్ష ఎవ్వరినీ అడక్క శివాలయం వద్ద ఉన్న బావి నీరు తాగి బిళ్వ వృక్షం కింద ధ్యానంలో కూర్చుని ఉండేవాడు. అంతేకాక ఆ సాధువు ఒక మారు భిక్ష తీసుకున్న వారి ఇంటికి మళ్లీ వెళ్లేవాడు కాదు. అది అతడి నియమం. మాధవయ్య రోజూ ఇంటికి వెళుతూ రెండు అరటి పండ్లు ఆ సాధువుకు భక్తితో సమర్పించుకుని, నమస్కరించి వెళ్లేవాడు. సాధువు చిరునవ్వుతో దీవించేవాడు. అలా సాధువు ఆకలి తీరుస్తున్న మాధవయ్యకు రోజురోజుకూ వ్యాపారం వృద్ధి చెందసాగింది.
ఆ ఊర్లో ఉన్న ఇళ్లన్నీ పూర్తయ్యాక చివరగా మిగిలిన గోపాలయ్య ఇంటికి వెళ్లాడు సాధువు. గోపాలయ్య నోటికొచ్చినట్లు తిడుతూ ‘ఏం దున్నపోతులా ఉన్నావ్? పనీపాటా చేసుకోక ఇలా ఊరి మీద పడి పొట్ట నింపుకోకపోతే పస్తుండ రాదూ! సిగ్గు లేదా అడుక్కోను?’ అంటూ నానా మాటలు అన్నాడు. తిట్టిపోశాడు.
సాధువు చిరునవ్వుతో ‘అలాగే పస్తే ఉండు...’ అని చెప్పి, వెళ్లిపోయాడు. మాధవయ్య ఆ రోజు అంగడి కట్టేసి వెళ్తూ ఇంటి కోసం ఒక అరడజను పండ్లు పట్టుకెళుతూ సాధువు ముఖం చూసి, ఆ రోజు ఏమీ తినలేదని గమనించి, మొత్తం పండ్లన్నీ అతడి ముందు ఉంచి ‘స్వామీ! దయతో స్వీకరించండి’ అని నమస్కరించి వెళ్లాడు. గోపాలయ్య వెళ్లి భోజనానికి కూర్చోగా అతడికి ఆకలవుతున్నా నోట్లోకి అన్నం ముద్దలు పోలేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క ముద్ద అన్నం తినలేక పోయాడు. ఆకలి మాత్రం ఔతూనే ఉంది. అలా రెండు రోజులయ్యేసరికి అతడికి నీరసం ముంచుకొచ్చి మంచం దిగలేకపోయాడు. ఈ విషయం అతడి పని వాళ్ల ద్వారా ఊరి వారందరికీ తెలిసింది. వారంతా వచ్చి పరామర్శించసాగారు. చివరికి అతడి భార్య ద్వారా జరిగిన విషయం తెల్సుకుని ఆ సాధువు దగ్గరకెళ్లి బతిమాలి క్షమాపణ కోరుకోమని చెప్పారు. తన బాధ తీర్చుకోను నమ్మకం లేకపోయినా ఊరి వారి మాటలు నమ్మిన భార్య పోరు పడలేక బండి మీద శివాలయం వెళ్లి సాధువు ముందు కూలబడ్డాడు. సాధువు మాధవయ్య ఇచ్చిన అరటి పండ్లు తింటున్నాడు. గోపాలయ్య మాట్లాడలేకపోగా అతడి భార్య విషయం చెప్పి క్షమించి తన భర్తను కాపాడమని ప్రార్థించింది. సాధువు చిరునవ్వుతో తాను తిని కింద పడేసిన అరటిపండ్ల తొక్కలు ఇచ్చి తినమని చెప్పాడు. వాటిని చూడగానే గోపాలయ్యకు తినాలనిపించి, కొరికి నమిలి మింగాడు. అలా నాలుగు అరటి తొక్కలూ తిని కాస్తంత ఓపిక వచ్చి, తన వల్ల జరిగిన పొరపాటు తెల్సుకుని, మన్నించమని ఆ సాధువు పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. సాధువు ప్రేమగా అతడి తల నిమిరి ‘చూడు బాబూ! నీవు ఏదైతే ఇతరులకు ఇచ్చావో, దాన్ని వారు తిరస్కరిస్తే అది నీకే చెందుతుంది. ననే్న కాదు. ఎవ్వరినీ ఇహ మీద తిట్టకు. దూషణ ప్రమాదకారి. నీకు పెట్టను ఇష్టం లేకపోతే పెట్టకు, ఎవ్వరూ తిట్లూ స్వీకరించరు కదా! నోరు పారేసుకుని బాధిస్తే అవి నీకే తిరిగి వస్తాయి’ అని వివరించి పంపాడు. ఆ రోజు నుంచీ గోపాలయ్యలో మార్పు వచ్చింది.

-ఆదూరి హైమావతి