బాల భూమి

మార్పు(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలేష్ బడి నుంచి రాగానే టీవీ ముందో, కంప్యూటర్ ముందో, అదీ లేదంటే ఏ ఐపాడో పట్టుకుని ఆడుకుంటూ కూర్చునేవాడు. రాన్రాను బయటకు వెళ్లి ఆడుకునే ఆటలకన్నా ఆన్‌లైన్ గేమ్‌ల మీదే ఆసక్తి ఎక్కువై పోయింది.
తోటి పిల్లలు వచ్చి ఆటలకు పిలిచినా వెళ్లకుండా ఏదో ఒక జంక్ స్నాక్స్ తింటూ ఆడుకుంటూ లావై, బద్దకంతోను, అనారోగ్య సమస్యలతోనూ హోంవర్క్ సంగతి, చదువు సంగతి కూడా పెద్దగా పట్టించుకోకుండా, ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ కేకలేసినా పద్ధతి మార్చుకోకుండా మొండిగా తయారయ్యాడు.
నీలేష్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్థులవటంతో వాళ్లు లేని సమయంలో ఆడుకుంటూ బాగా అలవాటు పడిపోయాడు. అలాంటి సమయంలో పల్లెటూళ్లో వుండే అతని పిన్ని ఉద్యోగం కోసం ఒక ఇంటర్వ్యూకని వాళ్ల ఇంటికి వచ్చింది.
ఆమె వచ్చిన రోజే నీలేష్ విషయం అర్థమై, అతని బలహీనత మరింత ముదిరి విచక్షణ కోల్పోకుండా వుండేలా చేయాలని భావించింది. అదే విషయం అక్క, బావలతో అంటే, వాళ్లు తామిద్దరూ ఎంత చెప్పినా వినటం లేదని, కోప్పడితే ఎదురు తిరుగుతున్నాడని వాపోయారు.
ముందుగా ఇంటికున్న వైఫై కనెక్షన్ తీసేయించింది. అక్క, బావలను మొబైల్ డాటా తీసుకొమ్మని సలహా ఇచ్చింది. నీలేష్‌కి అంతగా అవసరమైతే వాట్సప్‌లో ఫ్రెండ్స్ పంపే నోట్స్ కానీ, ఇంటర్నెట్ సమాచారం కానీ తల్లిదండ్రుల ఫోన్‌లో నుంచీ కంప్యూటర్‌లోకి వేసుకుని చూసుకునేలా చేసింది. కానీ, ఇదంతా ఏ మాత్రం నీలేష్‌కి అనుమానం రాకుండా ఇంటర్నెట్‌కి ఛార్జ్ ఎక్కువ చేశారని, స్పీడ్ తక్కువగా ఇస్తున్నారని, కాబట్టి మరేదైనా మంచి ఇంటర్నెట్ కనెక్షన్ వాళ్ల గురించి తెలుసుకుని తీసుకోబోతున్నట్టు చెప్పి ఇవాళ రేపు అంటూ కాలయాపన చేయసాగారు.
రాన్రాను నోట్స్ కోసం కంప్యూటర్ వాడటం, టీవీకి కూడా డిష్ కనెక్షన్ తీసేయించడం, అప్పుడప్పుడూ ఓ పది నిమిషాలు ఫ్రెండ్స్‌తో వాట్సప్ చాటింగ్‌కి తప్ప పేరెంట్స్ వారి ఫోన్లు ఇవ్వకపోవటంతో అతిగా స్నాక్స్ తినటం తగ్గించి సన్నబడ్డాడు.
ఇప్పుడిక గేమ్స్ రాకపోవడంతో హోంవర్క్ మీద, బయటకెళ్లి ఆడుకోవటం మీద అతని దృష్టి మళ్లింది. నెలరోజుల్లోనే ఊబకాయం తగ్గి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మంచి మార్కులతోపాటు ప్రశంసలు కూడా అందటంతో నీలేష్ తండ్రి బహుమతిని వస్తు దూరంలో కాకుండా ఓ కొత్త ప్రదేశానికి విహారయాత్రగా తీసుకెళ్లి రెండు రోజులు గడిపి రావటంతో అతనిలో ఉత్సాహం రెట్టింపైంది.
ఈసారి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చిందన్న శుభవార్తతో వచ్చింది నీలేష్ పిన్ని. స్వీట్‌ముక్క పిన్నికి తినిపిస్తూ కంగ్రాట్స్ చెప్పాడు నీలేష్. అతని తల్లిదండ్రులు మాత్రం స్వీట్ తినిపించి థాంక్స్ చెప్పడంతో ఆశ్చర్యంగా చూశాడు నీలేష్ అసలు విషయం తెలియక. ఈసారి మంచి మార్కులొస్తే తాను ఉద్యోగంలో చేరబోయే కొత్త ఊరికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు, వింతలు చూపిస్తానంది అతని పిన్ని. నీలేష్ ఆనందంతో సరేనంటూ ఎగిరి గంతేశాడు.

-డేగల అనితాసూరి 9247500819