బాల భూమి

వ్యసనం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనకయ్య, కాంతయ్య ప్రాణమిత్రులు. తీరిక దొరికినప్పుడల్లా ఇరువురూ రావిచెట్టు కింద బండరాయి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
ఎప్పటిలాగే ఓ రోజు రావిచెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ దారంట ఒక వృద్ధురాలు యాచించుకుంటూ వెళ్లడం గమనించిన కాంతయ్య ‘ఔనూ, మొన్న మొన్నది వరకు ఈమె కూరగాయలు అమ్మేది కదూ... ఇప్పుడేంటి ఇలా అడుక్కుంటోంది?’ అంటూ సందేహం వెలిబుచ్చాడు.
‘అది నా పాపమేరా’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు కనకయ్య.
‘ఏంట్రా నువ్వనేది? తను అడుక్కోవడం నీ పాపం ఎలా అవుతుంది?’ విస్తుపోతూ అడిగాడు కాంతయ్య.
మిత్రుడి ఆసక్తిని గమనించి నోరు విప్పాడు కనకయ్య.
* * *
వృద్ధాప్యంలో ఉన్న గంగమ్మని అయిన వాళ్లెవరూ ఆదుకోక పోవడంతో స్వతంత్రంగా తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంది. శరీరం సహకరించక పోయినా, అంగట్లో కూరగాయలు కొని ఎండనక వాననక వీధివీధికి తిరిగి అమ్ముకోసాగింది.
ఓ రోజు కూరలమ్ముతూ అలసిపోయిన గంగమ్మ కనకయ్య ఇంటి తలుపు తట్టి ‘కొద్దిగా బెండకాయలు ఉన్నాయి. ఎంతో కొంతకి తీసుకోండి బాబూ’ అంటూ బతిమలాడింది.
‘వద్దమ్మా ఇవాళ అంగడి కెళ్లి బోలెడన్ని కూరలు కొనుక్కొచ్చాను. అవి మాకు నాలుగైదు రోజుల దాకా సరిపోతాయి. ఇంకా కొని ఏం చేసుకుంటాను చెప్పు’ అన్నాడు కనకయ్య.
‘అలా అనకండయ్యా. ఇంక తిరగలేక గంపలో మిగిలిపోయిన ఈ కొద్దిపాటి బెండకాయల్ని మీకు ఎంతో కొంతకి ఇచ్చేద్దామనుకుంటున్నాను’ అంది గంగమ్మ నిట్టూరుస్తూ.
‘వయసు అయిపోయిందానివి.. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నాకు బెండకాయలేవీ వద్దుగాని ఈ ముప్పై రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్లిపో’ అంటూ జేబులోంచి డబ్బులు తీసి ఆమె చేతిలో ఉంచాడు.
ఆ రోజు తను అమ్మిన సరుకంతటికి ముప్పై రూపాయలకు మించి లాభం రాదు. అయితే ఈ పెద్ద మనిషి ఉత్తినే తనకు అంత సొమ్ము ఇచ్చేసరికి ఉప్పొంగిపోయింది గంగమ్మ.
దినమంతా గంప నెత్తినేసుకుని వీధి వాడ తిరిగి కూరలమ్ముకునే బదులు చేయి చాపితే తన వయసు చూసి జాలిపడైనా పదో పరకో ఇవ్వకపోరు అని అనుకుందో ఏమో ఆ రోజు నుంచి భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టింది.
* * *
జరిగింది చెప్పి, ‘ఆమె అలా అడుక్కోవటానికి కారణం మరి నేనే కదా!... అందుకే అన్నాను అది నా పాపమే అని’ అన్నాడు కనకయ్య.
‘ఔన్రా. నువ్వలా చేసి ఉండకూడదు. ఆ రోజు నువ్వు ఎంతో కొంత డబ్బిచ్చి కూరల్ని తీసుకుని ఉంటే ఇప్పుడు ఈమె ఇలా అడుక్కునేది కాదు’ అన్నాడు కాంతయ్య.
‘నిజమేరా. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? యాచన ఒక వ్యసనం లాంటిది. దాని రుచి మరిగితే తననింక మార్చడం ఎవ్వరి తరం కాదు’ అన్నాడు కనకయ్య.

-దూరి వెంకటరావు 9666991929