బాల భూమి

ఉప్పు ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆట చాలారకాలుగా ఉంటుంది. చిన్న పిల్లలను పెద్దవాళ్లు వీపు మీద ఎక్కించుకుని ఉప్పు అమ్మా ఉప్పు. ఉప్పు బాగా ధర తక్కువ గా ఉంది కొనుక్కోండమ్మా అంటూ తిరుగుతారు. అపుడు ఇంట్లో ఉండే ఇంకెవరన్నా వీపుమీద ఉన్న పిల్లలను చూసి మాకు కావాలి బాగా ఉంది ఉప్పు అంటే ధర ఎక్కువ అని బాగా మారాం చేసేవాళ్లు అయితే ఉప్పు ఏమీ బాగాలేదు. మాకొద్దు అమ్మా అని కాస్త ఏడిపిస్తారు. బంగారు ఉప్పు అమ్మా కొనుక్కోండి. అసలు ఏడిపించరు అంటూ మళ్లీ మళ్లీ ఇల్లంతా వారిని వీపు మీద ఎక్కించుకుని ఆడుతుంటారు. అట్లా కాసేపు తిప్పి కొనుక్కొన్నవాళ్లకు ఇచ్చేస్తారు. ఆట అయిపోతుంది. లేకపోతే వారిని మంచం మీదనో బల్లలమీదనో దింపేసి ఉప్పు అయిపోయింది అంటూ చిన్నవారిని నవ్విస్తారు. ఇది ఒక ఆట
మరో ఉప్పు ఆట
ఇది బహిరంగ ప్రదేశంలో ఆడుతుంటారు. ఎక్కువగా మగపిల్లలు, శరీర ధారుఢ్యం కలవారు ఆడుతుంటారు.
ముగ్గురు లేక నల్గురు ఒక్కోజట్టుగా ఉండి ఈ ఆట ఆడుతుంటారు. వీళ్లు మొదటి జట్టువాళ్ల కోసం రెండవ జట్టువాళ్లు దూరంగా ఒక గీతను గీస్తారు. మరికొంతదూరంగా ఆ గీతకు ఎదురుగా మరో గీత గీస్తారు. మొదటి గీత నుండి రెండవ గీతవరకు ఎదురు జట్టు వాళ్లు చెప్పిన బరువు ఎత్తుకుని పరుగెత్తుతూ వెళ్లాలి. ఎవరు ముందు బరువు పడకుండా రెండవ గీతకు చేరుకొంటారో వారు గెలిచినట్టు అట్లా చేరలేకపోయినవాళ్లు ఓడి నట్టు అనుకొంటారు. జట్టులోని వారంతా ఓడిపోతే ఆ జట్టు ఓడిపోయినట్టు అవుతుంది. అంతదాకా ఇరు జట్లవారు ఆడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఇంత బరువు ఎత్తుకోవడంలోను, గీతను చేరడంలోను ఉపాయాలు పన్నడం, ఎదుటివారికన్నా ముందు చేరుకోవడం లో మెళుకువలు చూపి ఆటను గెలవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఆరుబయట కేవలం మగపిల్లలలే ఆడుతుంటారు.
ఇక మూడవ ఉప్పు ఆట
ఇది ఆడపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆట
ఈ ఆటను ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఆడుతుంటారు. రెండుజట్లుగా ఉంటారు. ముందుగా
మూడు డబ్బాల్లా గీతలు గీస్తారు. ఆ డబ్బాల్లో ముగ్గురేసి ఆడపిల్లలు నిల్చుంటారు.ముగ్గురు బయట నిల్చుంటారు.
బయట నిల్చున్నవారు లోపల ఉన్నవారికి ఉప్పు అందివ్వాలి. లోపల ఉన్నవారు బయటకు వచ్చి ఉప్పు తీసుకోవాలి. ఇలా బయటకు వచ్చేటపుడు బయట జట్టువాళ్లు వీళ్లను ముట్టుకుంటే వారు ఓడిపోయినట్టు. గీతలు దాటి బయటకు రాకుండా వీరు కాపలా కాస్తారన్నమాట. వీళ్లను తప్పించుకుని ఉప్పు లోపలకి తేవడంలోనే నేర్పు వహిస్తారు లోపల ఉన్న జట్టువాళ్లు.
ఆతరువాత లోపల నిల్చున్న వాళ్లు బయటకు వస్తారు. బయట ఉన్నవారు లోపల డబ్బాల్లోకి వెళ్తారు. ఈ విధంగా రెండు జట్లవాళ్లు ఉప్పును పంచడంలో ఓర్పు నేర్పులను చూపిస్తూ ఈ ఆటను ఆడుతుంటారు. ఇలా ఆడే ఆటను ఉప్పాట అని అంటారు.

-జంగం శ్రీనివాసులు