జాతీయ వార్తలు

హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదారంగా నిధులూ ఇవ్వండి కేంద్రానికి బాలకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వాల్సిన అవసరం ఉందనీ, హోదా లభిస్తుందన్న నమ్మకం ఉందని హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి హోదా ఇచ్చి తీరాలని ఆయన గురువారం విలేఖరులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినందున ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే హంద్రీ-నీవా సుజల స్రవంతి నీటి పారుదల పథకం పూర్తికావటానికి కేంద్రం నిధులను విడుదల చేయాలని కోరారు. హిందూపురం నుంచి బెంగుళూరుకు ప్రతిరోజు రైళ్లను నడపవలసిందిగా రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరినట్లు బాలకృష్ణ తెలిపారు. హిందూపురం రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలను మెరుగుపరచలసిందిగా మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న పట్టు పరిశ్రమకు చైనానుంచి దిగుమతి అవుతున్న నూలువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నందున దిగుమతి సుంకాన్ని పెంచాలని లేదా నూలు దిగుమతినే నిషేధించాలని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించినట్లు బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో భూగర్భ మురుగు నీటి పారుదల సదుపాయం కల్పించటానికి నిధులను మంజూరు చేయవలసిందిగా కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. హిందూపురం నుంచి బెంగుళూరు వరకూ విస్తరించి ఉన్న జాతీయ రహదారికి అనుబంధంగా లింక్ రోడ్లను ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళి అర్పించారు.(చిత్రం)గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు వినతిపత్రం అందజేస్తున్న టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ.