జాతీయ వార్తలు

సమతౌల్యం తప్పుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలురు 1000, బాలికలు 918
ఆందోళనకరంగా స్ర్తి, పురుష నిష్పత్తి
ఐదున్నర దశాబ్దాల్లో కనిష్ఠ స్థాయి
హిందువుల్లోనే తేడా అధికం
తాజా జనగణన వివరాలు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారతదేశంలో స్ర్తి పురుష నిష్పత్తి ఆందోళనకర స్థాయికి పడిపోయింది. 1961 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈ నిష్పత్తి తగ్గిందన్న సంకేతాలు 2011 జనగణన తాజా వివరాలు బట్టి స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా హిందువుల్లో ఆడ, మగ వ్యత్యాసం మరింతగా తగ్గిందని, ప్రతి వెయ్యిమంది పురుషులకు 918మంది స్ర్తిలే ఉన్నట్లుగా ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. 2001లో కంటే కూడా హిందువుల్లో స్ర్తి-పురుష నిష్పత్తి మరింతగా తగ్గింది. అలాగే సిక్కులు, జైన్లలో కూడా ఆడ-మగ నిష్పత్తి అత్యంత దారుణమైన స్థాయికి చేరుకుందని, క్రైస్తవుల్లో మెరుగైన పరిస్థితి ఉందని ఈ అదనపు జనగణన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. క్రైస్తవుల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 958మంది బాలికలు ఉన్నారని, అదే సిక్కుల్లో, జైనుల్లో ఈ నిష్పత్తి ఆందోళనకర స్థాయికి పడిపోయిందని ఈ వివరాలు చెబుతున్నాయి. జైన్లలో వెయ్యిమంది బాలురకు 889మంది బాలికలు ఉన్నారు. 1 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసును ప్రామాణికంగా తీసుకుని హిందువులు, క్రైస్తవులు, జైనులలో స్ర్తి పురుష నిష్పత్తిని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ నిష్పత్తి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అంటే ప్రతి వెయ్యిమంది బాలురకు 918మంది బాలికలు ఉన్నారు. వివిధ మతాల్లో స్ర్తి-పురుష నిష్పత్తిని పరిశీలిస్తే ముస్లింలలో ప్రతి వెయ్యిమంది బాలురకు 943మంది బాలికలు, బౌద్ధుల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 933మంది బాలికలు ఉన్నట్లుగా ఈ వివరాలు చెబుతున్నాయి. మొత్తం స్ర్తి పురుష నిష్పత్తిని 2011 నాటి జనగణన వివరాలతో పోలిస్తే ప్రతి వెయ్యిమంది బాలురకు 943మంది బాలికలు ఉన్నట్లుగా స్పష్టమైంది. ఆ లెక్కన చూసుకుంటే అప్పట్లో ఉన్న స్ర్తి పురుష నిష్పత్తి ఈ పదిహేనేళ్ల కాలంలో అన్ని మతాల్లోనూ గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. దేశంలో మొత్తం సిక్కుల జనాభా 2,08,33,116 కాగా, వారిలో స్ర్తిలు 47.4 శాతం, పురుషులు 52.55 శాతం ఉన్నారు. అదే క్రైస్తవుల్లో స్ర్తిలు 49.4 శాతం ఉండగా, పురుషులు 50.5 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం క్రైస్తవ జనాభా 2,78,19,588 మంది. దేశంలో అత్యధిక స్థాయిలో 96,62,57,353 మంది హిందువుల్లో 48.4 శాతం మంది మహిళలు, 51.5 శాతం మంది పురుషులు ఉన్నారు. దేశంలో రెండో అత్యధిక జనాభాగా కలిగిన ముస్లింలలో కూడా ఇదే స్థాయిలో స్ర్తి పురుష నిష్పత్తి ఉంది. ఇక విద్యాపరమైన అభివృద్ధి విషయానికి వస్తే 2011 జనగణన లెక్కల ప్రకారం జైనుల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉంది. రెండో స్థానంలో క్రైస్తవులు, మూడో స్థానంలో బౌద్ధ మతస్థులు ఉన్నారు. ఏడో తరగతి ఆపైన చదువుకున్నవారి సంఖ్య హిందువుల్లో 73.3 శాతం, ముస్లింలలో 68.5 శాతం, క్రైస్తవుల్లో 84.5 శాతం, సిక్కుల్లో 75.4 శాతం, బౌద్ధుల్లో 81.3 శాతం, జైనుల్లో 94.9 శాతం ఉంది. ఇక మొత్తం జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఈ అక్షరాస్యత 7.0 శాతంగా నమోదైంది. ఇక వివిధ పనులు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు - ఇలా ఆదాయ మార్గాల్లో ఉన్నవారు మొత్తం దేశ జనాభాలో 39.8 శాతం మేర ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య హిందువుల్లో 41.0 శాతం ముస్లింలలో 32.6 శాతం, క్రైస్తవుల్లో 41.9 శాతం, సిక్కుల్లో 36.3 శాతం, బౌద్ధుల్లో 43.1 శాతం, జైనుల్లో 35.5 శాతం ఉన్నట్లుగా ఈ జనగణన వివరాలు చెబుతున్నాయి.