రాష్ట్రీయం

బందరు ఇంజనీర్‌కు ఐసిస్ లింకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సానుభూతిపరులపై ‘నిఘా’ నేత్రం

హైదరాబాద్, డిసెంబర్ 4: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ తన కోరలను ఆంధ్రకూ విస్తరించిందా? మచిలీపట్నానికి చెందిన తుల్ఫీజుర్ రెహమాన్ అనే ఇంజనీర్ ప్రస్తుతం లిబియాలో ఉద్యోగరీత్యా ఉన్నాడని, ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరపుతున్నాడని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారంతో ఆంధ్ర రాష్ట్ర పోలీసు నిఘా సంస్థ ఉలిక్కిపడింది. తుల్ఫిజుర్ రెహమాన్ అనే యువకుడు లిబియాలో ఐఎస్ ఉగ్రవాద సంస్థల ఆధీనంలోని సిర్టీ అనే పట్టణానికి వెళ్లిన సమాచారాన్ని కేంద్ర హోంశాఖ సేకరించింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువకులకు ఐఎస్ సంస్థ గాలంవేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఆదిలాబాద్‌కు చెందిన ఎం అతీఫ్ వాసిం అనే ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ సిరియాలో ఐఎస్ సంస్థ తరఫున పోరాడుతూ మరణించిన విషయం విదితమే. ఈ సమాచారం వాసిం కుటుంబీకులకు విదేశాల నుంచి అందింది. అయితే, ఐఎస్ వలకు మచిలీపట్నానికి చెందిన ఇంజనీర్ పొరపాటున చిక్కుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకెళ్లిన యువతలో ప్రతిభావంతులైన వారిని మతం ముసుగులో ఐఎస్ సంస్థ ఆకర్షిస్తోంది. ఐఎస్ వలకు చిక్కుకున్న యువత దేశానికి చెందిన ప్రతిష్టాకరమైన సంస్థలు, భౌగోళిక స్వరూపం, ఇతర వివరాలు అందిస్తారని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రలో ఉగ్రవాద కార్యకలాపాలు లేవనే భ్రమలో ఉండరాదని పోలీసులు అంటున్నారు. దీన్‌దార్ అంజుమాన్, సిమి, స్టూడెంట్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలు అజ్ఞాతంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో నిఘా విభాగం కేంద్ర హోంశాఖ నుంచి వచ్చే సమాచారాన్ని, ఇతర జిల్లాల నుంచి సేకరించిన వివరాలను 13 జిల్లాల పోలీసు శాఖలకు అందిస్తున్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 8మంది దీన్‌దార్ అంజుమన్, మరో ముగ్గురు ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల మూలాలు ఆంధ్రలో ఉన్నాయని, వీరి ఆచూకీని కనిపెట్టేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. లిబియా, ట్యూనీషియాల నుంచి వీరికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ఇండియన్ ఎంబసీని కూడా సంప్రదించినట్టు ఆంధ్ర పోలీసు వర్గాలు తెలిపాయి.