వరంగల్

అర్ధరాత్రి అంబేద్కర్ భవన్ కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానుకోటలో టెన్షన్ * తెరాస అండతోనే అంటూ ఆరోపణలు * ఆందోళనకు దిగిన అఖిల పక్షం * రేపు మానుకోట బంద్
మహబూబాబాద్, మార్చి 7: మానుకోట గాంధీపార్కులోని అంబేద్కర్ భవన్‌ను అర్ధరాత్రి అక్రమంగా కూల్చి వేశారు. దళితులకు, ప్రజాసంఘాలకు వేదికలా ఉపయోగపడుతున్న అంబేద్కర్ భవన్‌ను రామాలయ విస్తరణ పనుల పేరుతో కూల్చి వేయడంతో సోమవారం ఉదయం నుండి మానుకోటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతకొన్ని రోజులుగా మానుకోటకు చెందిన ప్రముఖ వ్యాపారి ఓం నారాయణలోయ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణ పనుల పేరుతో గాంధీపార్కులోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను కూల్చి వేయలని చూస్తున్నారంటూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం గాంధీపార్కులో ఏలాంటి నూతన నిర్మాణాలు చేపట్టరాదని పలు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూల్చాలని చూస్తున్న నాయకులకు అధికార తెరాస పార్టీ అండదండలున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఆఘమేఘాల మీద కమ్యూనిటీ హాల్‌ను దాని పక్కనే ఉన్న సభ వేదికను కూల్చివేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దళిత కుల సంఘాలతో పాటు కాంగ్రెస్, టిడిపి, సిపి ఎం, సిపి ఐ, సిపి ఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, వై ఎస్సార్‌సిపి, ఎమ్ ఎస్‌పి వంటి రాజకీయ పక్షాలు కూల్చి వేసిన అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగాయి. అనుమతి లేకుండా అక్రమంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ మానుకోట ఆర్డీఓ, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ భాస్కర్‌రావు బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అధికార పార్టీ అండతో స్థానిక వ్యాపారి ఓం నారాయణలోయ ఈ దురగాతానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మానుకోటలోని ఆయన ఇంటి ఎదుట దళిత, కులసంఘాలతో పాటు రాజకీయ పక్షాల నాయకులు నిరసనకు దిగారు. అనంతరం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి స్థానిక నెహ్రూసెంటర్‌లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విపక్ష నాయకులు మాట్లాడుతూ.. అధికార పార్టీ అండతోనే నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ భవన్, సభా వేదిక కూల్చి వేశారంటూ నిప్పులు చేరిగారు. ఇందుకు నిరసనగా మార్చి 8 మంగళవారం డివిజన్ వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. మార్చి 9 బుధవారం మానుకోట పట్టణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి టౌన్ సీ ఐ నందిరాంనాయక్‌కు స్థానిక పోలిస్‌స్టేషన్‌లో కూల్చివేతకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కూల్చిన వారిపై చర్యలు తప్పవు: ఆర్డీఓ భాస్కర్‌రావు
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అంబేద్కర్ భవన్, గాంధీపార్కు సభావేదిక కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్డీ ఓ భాస్కర్‌రావు అన్నారు. కూల్చివేత అంశంపై ఆయన మాట్లాడుతూ.. విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సిందిగా పోలీస్‌శాఖను కొరడం జరిగిందని, గాంధీపార్కు స్థల ఆక్రమణ జరగకుండా పినిషింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.