ఆటాపోటీ

బానిసలా చూశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ మాజీ నంబర్ వన్ టైగర్ ఉడ్స్ వివాహేతర సంబంధాల కారణంగా అతని భార్య ఎలెన్ నార్డెగ్రిన్ విడాకులు తీసుకుంది. పరువు పోగొట్టుకున్న ఉడ్స్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మళ్లీ బయటకు వచ్చి కెరీర్‌ను కొనసాగించినప్పటికీ, గతంలో మాదిరి అద్భుతాలు సృష్టించలేకపోయాడు. కెరీర్‌లో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం 362వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉడ్స్‌పై అతనికి గతంలో కాడీగా పని చేసిన స్టీవ్ విలియమ్స్ విమర్శలు గుప్పించాడు. తనను ఒక బానిసలా చూశాడంటూ ఉడ్స్‌కు 1999 నుంచి 2011 వరకూ కాడీగా ఉన్న విలియమ్స్ తాను రాసిన ‘అవుట్ ఆఫ్ ది రఫ్’ పుస్తకంలో ఆరోపించాడు. ఎన్నడూ తనకు కనీసం గౌరవ మర్యాదలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తాడు. ఉడ్స్ కెరీర్‌లో 14 మేజర్ టైటిళ్లు సాధిస్తే వాటిలో 13 టైటిళ్లు విలియమ్స్ కాడీగా ఉన్నప్పుడు లభించినవే కావడం విశేషం. ఎప్పుడూ వెన్నంటి ఉండే కాడీకే అతని నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైతే, మిగతా వారిని అతను ఏ విధంగా చూస్తాడో ఊహించడం కష్టం కాదు.