హైదరాబాద్

బ్యాంకు దోపిడీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసుల అదుపులో కరుడుగట్టిన చైన్ స్నాచర్ విలువైన నగలు స్వాధీనం
హైదరాబాద్, డిసెంబర్ 21: ఇటీవల నగర శివారులోని ఘట్‌కేసర్‌లో జరిగిన ఓ బ్యాంక్ దోపిడీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడుకు చెందిన మురుగన్‌దాస్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఘట్‌కేసర్‌లోని ఓ గ్రామీణ బ్యాంకుకు కన్నం వేసి దోపిడీకి పాల్పడిన కరుడుగట్టిన గజదొంగ మురుగన్‌దాస్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు.
విచారణ తరువాతే పూర్తి వివరాలు తెలుపుతామని ఓ సీనియర్ పోలీసు అధికారి విలేఖరులకు వెల్లడించారు. అదేవిధంగా కరుడుగట్టిన చైన్‌స్నాచర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. బీహార్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేసి విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.