సబ్ ఫీచర్

ప్రాణం విలువ వైద్యుడికే తెలుసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం వైద్యులు ఏం చెయ్యలేరో చెప్పటం జరిగింది. ఈసారి పేషంట్లు ఏం చెయ్యకూడదో తెలుసుకుంటే మంచిది. అప్పుడప్పుడు వైద్యులు చేసే చికిత్స సత్ఫలితాలని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు సరైన చికిత్స చాలా కారణాలవల్ల ఇవ్వడం కుదరకపోవచ్చు. దానివల్ల పేషెంట్ ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు. ఆ సమయంలో పేషెంట్ బంధువులు, స్నేహితులు ఆసుపత్రులపైన, వైద్యులపైన తిరగబడి చేయి చేసుకోవడం లాంటివి ఎంతవరకు సమంజం. ఏ వైద్యుడు కూడా కావాలని తప్పు చేయడు. పేషెంట్ ఆజన్మ శత్రువా? లేక విరోధా? పేషెంట్‌కు కీడు చెయ్యడానికా రాత్రింబవళ్ళు కష్టపడి చదివి వైద్యుడు అయ్యేది? ప్రతి మనిషి తప్పు చేస్తాడు, వైద్యుడు కూడా మనిషే. తను తప్పు చేయడం వింతా కాదు విడ్డూరమూ కాదు.
ఎంతో అనుభవం ఉన్న ఓ వైద్యుడు చేసిన సర్జరీ ఒకటి ఫెయిల్ అయింది. అది తన 201 సర్జరీ. కాని అది ఫెయల్ అయనందుకు ఎంతో బాధపడ్డాడు. ‘‘నా మొదటి ఆపరేషన్ ఫెయిల్ కాలేదు కానీ నా 201వ ఆపరేషన్ సఫలీకృతం కాలేదు. ఇనే్నళ్ళ అనుభవం తరువాత కూడా ఇంకా ఓటమిని రుచి చూడాల్సి వస్తున్నది’’ అని అంటూ ఆయన కంట కన్నీరు కార్చాడు. ‘‘మనకు ఎంత అనుభవం వున్నా, మన పరిజ్ఞానం ఎంత ఎత్తుకెదిగినా ఓటమి ఎప్పుడూ నీడలా మన వెంటే ఉంటుందని’’.
మరోసారి ఇంకో సర్జన్, ఆపరేషన్ టేబిల్‌మీద కొన్ని అనివార్య కారణాలవల్ల ఓ పేషెంట్ మరణిస్తే ఆ సర్జన్ ఎంత మానసిక ఆవేదనకు గురయ్యాడో కళ్లారా చూడటం జరిగింది. తను తిరిగి కత్తిపట్టి కొయ్యడానికి ఒక ఏడాది పట్టింది. ‘‘ప్రాణం విలువ ఓ వైద్యుడు గుర్తించినట్టుగా మరెవరూ గుర్తించలేరు’’. కొంతమంది పేషెంట్లు మంత్రులతో ఇంక పెద్దవారితో సిఫార్సు చేయించుకుంటారు మంచిగా చికిత్స చెయ్యమని. ఇలా చేయటం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ డాక్టరూ ఓ పేషెంట్‌కి బాగా చెయ్యాలని ఒక పేషెంట్‌కి బాగా చెయ్యవొద్దనీ అనుకోడు. ఈ సిఫార్సుల వల్ల, ఉత్తరాలవల్ల ఆపరేషన్ ఎప్పుడు చెయ్యాలో మారుతుందేమోగానీ, ఎలా చెయ్యాలన్నది మారదు. ఉత్తరం ఉన్నవాళ్లతో రెండు నిమిషాలు ఎక్కువ సమయం మాట్లాడతాడేమోగాని లేనివారి ఆపరేషన్ సమయం రెండు నిమిషాలు తగ్గించడు ఏ వైద్యుడూ.
ఓ పేషెంట్‌కి చెడు జరిగితే దానికి కారణమైన వైద్యుడు ఎన్నాళ్లు ఆహారం సరిగ్గా తినలేడో, నిద్ర సరిగ్గా పోలేడో, తిరిగి తన మనోధైర్యాన్ని సంపాదించుకోడానికి ఎంత సమయం పడుతుందో అనుభవించిన ఆ వైద్యుడికే తెలుస్తుంది. చూసేవాళ్లకి నటనలా అనిపిస్తుంది. వారిని ప్రేమించేవారికి ఆ నరకం కనిపిస్తుంది.
బాధ కోపానికి దారితీస్తుంది, కోపం ఆలోచనను చంపేస్తుంది. ఆలోచన లేని వ్యక్తి ఎప్పుడూ సరిగ్గా వ్యవహరించలేడు. పేషెంట్ బంధువులు, స్నేహితులు సరిగ్గా చికిత్స జరగని సందర్భాలలో ఇదే దిశగా ప్రయాణిస్తారు. ఆ క్షణంలో ఆవేశాన్ని ఆపుకొని కొంచెం ఆలోచిస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. సరైన రీతిలో వ్యవహరిస్తే అందరికీ మంచిదని నా అభిప్రాయం. రోడ్డుమీద ప్రమాదం జరిగి ఇద్దరు మనుషులు కిందపడి రక్తం కారుస్తుంటే ఎంతోమంది వాళ్ల వాహనాలని ఆపి ఏదో సినిమాని వీక్షిస్తున్నట్టు దూరంనుంచి చూస్తారేగాని ఒకళ్లు వెళ్లి సహాయం చేద్దామనుకోరు. వీళ్లు ప్రాణం గొప్పతనం గురించి చెడు చికిత్స జరిగినపుడు వైద్యులకు బోధిస్తారు. ఆపరేషన్ తరువాత మత్తులోంచి బయటకి వస్తున్న పేషెంట్ అకస్మాత్తుగా ఊపిరి పీల్చడం ఆపేస్తే వైద్యుడు, సిబ్బంది ఆ పేషెంట్‌ని కాపాడడానికి ఎంత కష్టపడతారో ప్రాణాన్ని నిలబెట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నం పడే తపన ఎలా ఉంటుందో చూస్తేనే గాని మనకి అర్థంకాదు. కొంతమంది వైద్యులు కాకపోయినా వైద్య వృత్తి ముసుగులో చికిత్స చేస్తుంటారు. అలాంటి వారి వల్ల ప్రమాదాలు ఖచ్చితంగా సంభవిస్తాయి. అలాంటివారిని పోలీసుల ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చేయటం మంచిది. కానీ వారిమీద కూడా చేయి చేసుకోవడం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టే.కత్తితో పొడిచి చంపాలంటేనే చాలా ధైర్యం కావాలి. అదే కత్తితో ప్రాణం పోయాలంటే అంతకు మించిన మనోధైర్యంతోపాటు గొప్ప సంకల్పం కావాలి. అది ఓ వైద్యుడు అంటే!. అలాంటి వైద్యుడికి చేతులు జోడించి మొక్కకపోయినా ఫర్వాలేదు కాని అదే చేతితో కొట్టకండి. పేషెంట్ ఆనందంగా ఉన్నప్పుడే వైద్యుడు మొహం అం దంగా ఉంటుంది.
వైద్యుడు తప్పు చేసేడనిపిస్తే ‘మెడి కో లీగల్ కేస్’ వేసే సౌలబ్యం మన ప్రభుత్వం మనకు ఇచ్చింది.
న్యాయస్థానంలో అది తప్పని నిరూపిస్తే కోర్టే ఆ వైద్యుడికి తగిన శిక్ష వేస్తుంది, బాధితులకి తగి న పరిహారం ఇప్పిస్తుంది. ఆలోచించండి.

పాఠకులకు సూచన
‘‘మీ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు’’ పొందాలనుకుంటే ప్రశ్నలు ఈ చిరునామాకు క్లుప్తంగా పంపండి. వాటిని భూమికలో ప్రచురించడం జరుగుతుంది.
మీ ప్రశ్నలను ‘‘మీ సందేహాలు- నా సమాధానాలు’’
అనే శీర్షికకు పంపాలి.
చిరునామా : డా శ్రీరంగం రమేష్, ఫేస్ క్లీనిక్,
1-3-15, కలాసిగూడ,
సికింద్రాబాద్-500003

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615