జాతీయ వార్తలు

బిసి రిజర్వేషన్లు అమలు చేయాలి: విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: వెనుకబడిన కులాలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని టి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుహెచ్చరించారు. హనుమంతరావు శుక్రవారం రాజ్యసభ జీరోఅవర్‌లో బిసి రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. దేశ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బిసిలకు కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్‌రంగ సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించి 23 సంవత్సరాలు గడుస్తున్నా పది శాతం మందికి కూడా ఉద్యోగాలు లభించలేదని ఆయన చెప్పారు. ఓబిసిలు అన్ని ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని అనుకుంటారని అయితే వాస్తవానికి ఓబిసిల ఉద్యోగుల శాతం పదిశాతం కూడా మించటం లేదని ఆయన తెలిపారు. పబ్లిక్‌రంగ బ్యాంకుల్లో మొత్తం 450 మంది జనరల్ మేనేజర్లు ఉంటే కేవలం ఐదుగురు మాత్రమే వెనకుబడిన కులాలకు చెందిన వారు ఉన్నారని విహెచ్ అన్నారు. బ్యాంకుల్లో మొత్తం డిప్యూటీ జనరల్ మేనేజర్ల సంఖ్య 1,255 ఉంటే కేవలం 16 మంది మాత్రమే ఓబిసికి చెందిన వారన్నారు. పది మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ ఏ పోస్టుల్లో బిసిలు ఒక్కరు కూడా లేరని విహెచ్ పేర్కొన్నారు. క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయటం వల్లనే ఓబిసి రిజర్వేషన్లు పూర్తి కావటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో 400 మంది న్యాయమూర్తులను నియమించవలసి ఉందని, రిజర్వేషన్లను అమలు చేయకపోతే ఓబిసి వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా ఎంపిక కారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క ఉన్నత కులాల వారు తమను ఓబిసి జాబితాలో చేర్చాలంటూ ఉద్యమిస్తున్నారు, దీని వల్ల ఓబిసిలకు తీరని నష్టం వాటిల్లుతుందని విహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు.