తెలంగాణ

ఈ సమావేశాల్లోనే బిసి సబ్‌ప్లాన్‌పై చట్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రులు ఈటల, జోగురామన్నలకు
బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ వినతి
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు న్యాయం చేసేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిసి బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి సాధన కమిటీ వినతిపత్రం సమర్పించింది. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీలో బిసిల సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి ఏటా రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సాధన కమిటీ చైర్మన్ ప్రొ.మురళీమనోహర్ ఆధ్వర్యంలో బృందం మంత్రులను కలిసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో కూడా బిసి సబ్‌ప్లాన్ ప్రస్తావన ఎక్కడా లేదని అన్నారు. 2011 నుంచి బిసి కమిషన్ నియమించలేదని, బిసి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించలేదని,వివిధ రుణాలు మంజూరు చేయడం లేదని వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.