క్రీడాభూమి

ఊరించి.. ఉడికించి.. మొండిచేయి చూపించింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్‌తో క్రికెట్ సిరీస్‌పై బిసిసిఐ దొంగాట!

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రపంచ క్రికెట్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శాసిస్తున్నదన్న విమర్శలు జోరందుకున్నాయి. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు పరిస్థితులు అనుగుణంగా లేవని తెలిసినప్పటికీ, రోజుకో మాట చెప్తూ గందరగోళం సృష్టించి, చివరికి తప్పును కేంద్ర ప్రభుత్వంపై వేసేందుకు బిసిసిఐ అద్భుతంగా నాటకమాడింది. దానిని అద్భుతంగా రక్తికట్టించింది. గత ఏడాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత జట్టు పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ను, రొటేషన్ విధానంలో ఈసారి పాక్‌లోనే టీమిండియా ఆడాలి. ఈ సిరీస్ జరుగుతుందంటూ ఆఖరి వరకూ పిసిబిని ఊరించి, ఉబ్బించి చివరికి మొండి చేయ చూపింది. ఇప్పటికీ సిరీస్‌పై బిసిసిఐ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గడువులు పెంచుకుంటూ వెళ్లిన పిసిబి గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత్‌తో సిరీస్ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రకటించింది. మొత్తానికి బిసిసిఐకి చెలగాటంగా మారిన నాటకం పిసిబికి ప్రాణ సంకటంగా పరిణమించింది. ఇప్పుడు ఏం చేయాలో, అభిమానులకు ఏమని సమాధానం చెప్పుకోవాలో అర్థంగా మల్లగుల్లాలు పడుతున్నది. బిసిసిఐ మాత్రం నెపాన్ని కేంద్రంపై నెట్టేసి వినోదం చూస్తునే ఉంది. పాకిస్తాన్‌లో భద్రతాపరమైన అంశాలు తలెత్తుతున్నట్టు లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ అనుమానాలు వ్యక్తం చేయడంతో పిసిబి ఇరుకున పడింది. ఆ క్షణం నుంచి ప్రారంభమైన కష్టాలు ఇంకా కొనసాగతున్నాయ. హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని కేంద్రంగా ఎంచుకుంది. అప్పటి నుంచి అక్కడే హోం సిరీస్‌లు ఆడుతుంది. కాబట్టి భారత్ కూడా యుఎఇకే వెళ్లాల్సి ఉంటుంది. కానీ, యుఎఇలో ఆడే ప్రసక్తి లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతి ఉంటేనే యుఎఇకి వస్తామని లేకపోతే అక్కడ సిరీస్ ఆడడం సాధ్యం కాదని ముందుగానే పిసిబికి స్పష్టం చేసివుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఈ విషయంలో పిల్లీఎలుక ఆట ఆడింది. అంతేగాక, భారత్‌కు వచ్చి సిరీస్ ఆడితే, పిసిబికి కోరినంత సొమ్మును ఇస్తామని చెప్పడం ద్వారా తన ధన బలాన్ని మరోసారి చాటిచెప్పే ప్రయత్నం చేసింది. స్వదేశంలో సిరీస్‌లు జరగకపోవడంతో ఎదుర్కొంటున్న నష్టాలను చాలావరకు భర్తీ చేసుకోవచ్చని ఆశచూపింది. పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ఈ ప్రతిపాదనను నిరాకరించడంతో బిసిసిఐ కంగుతింది. అయతే, తన ఆధిపత్యాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనందున ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించింది. బంగ్లాదేశ్ లేదా శ్రీలంకలో కుదించిన సిరీస్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపింది. ఫలితంగా పిసిబిని మళ్లీ ఇరకాటంలోకి నెట్టింది.
రోజుకో మలుపు
ద్వైపాక్షిక సిరీస్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే అంశం రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ సృష్టించింది. యుఎఇలో మ్యాచ్‌లు ఆడేది లేదని బిసిసిఐ బెట్టు చేస్తే, భారత్‌లో సిరీస్‌కు హాజరుకాబోమని తాము కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నామంటూ పిసిబి సంతృప్తిపడింది. శ్రీలంకలోనే పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు అంగీకరించింది. ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర కూడా వేయంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధనలను అనుసరించి ఫిక్చర్స్ అండ్ ఫ్యూచర్స్ ప్రోగ్రామ్ కింద కుదిరిన ఒప్పందాన్ని సాధారణ పరిస్థితుల్లోనైతే ఆయా క్రికెట్ జట్లు అమలు చేయాలి. కానీ, పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకపాలు ఉద్ధృతంగా ఉన్నాయని, ఆటగాళ్ల భద్రతకు ప్రమాదం ఉందని దాదాపు అన్ని దేశాలు అనుమానిస్తున్నాయ. అందుకే అక్కడ సిరీస్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్నాయి. హోం సిరీస్‌లకు యుఎఇని కేంద్రంగా పిసిబి ఎంపిక చేసిన తర్వాత పరిస్థితి కొంచం మెరుగుపడింది. కానీ, భారత్‌తో మ్యాచ్‌లు జరగకపోవడంతో, భారీగా ఆదాయాన్ని కోల్పోయంది.
‘లంక’ ఆలోచన మనోహర్‌దే
పిసిబి పరిస్థితి బాగా తెలిసిన బిసిసిఐ మరోసారి దొంగపోలీసు ఆటకు తెరతీసింది. యుఎఇలో ఆడబోమని అంటూనే, భారత్‌కు రావాలంటూ ఆహ్వానం పంపింది. దీనికి పిసిబి నిరాకరించడంతో రాజీకి వచ్చింది. శ్రీలంకలో సిరీస్ ఆడవచ్చంటూ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ఆలోచన బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌దే. అతను పిసిబితో ఈ విషయంలో చర్చలు జరుపుతుంటే, అసలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మధ్యమధ్యలో ప్రకటనలు చేస్తూ గందరగోళ పరిస్థితిని సృష్టించాడు. పాక్‌తో సిరీస్‌పై మనోహర్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ, అతని ప్రతిపాదనలకు కేంద్రం ఎంత ఆమోద ముద్ర వేస్తుందా? లేదా? అన్నది బిసిసిఐ అధికారులకు, ప్రత్యేకించి బిజెపి నాయకుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు తెలియదనుకోవడం పొరపాటు. బిసిసిఐ ఆహ్వానం మేరకే షహర్యార్ ఖాన్ ఇటీవల భారత్‌కు వచ్చాడు. మనోహర్‌తో భేటీ కోసం పడిగాపులుకాశాడు. శివసేన హెచ్చరించిదంటూ సమావేశాన్ని రద్దు చేసిన బిసిసిఐ ఢిల్లీలో మాట్లాడుకోచ్చంటూ మరోసారి బూటకపు హామీనిచ్చింది. షహర్యార్ ఢిల్లీకి వెళ్లి, బోర్డు అధికారులతో ఫలవంతమైన చర్చల కోసం ఎదురుచూశాడు. కానీ, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కేంద్ర మంత్రులను కలిసి సిరీస్‌పై ఒక ప్రకటన ఇప్పించాలని అనుకున్నాడు. కానీ, ఎలాంటి హామీని పొందకుండానే, అత్యంత దయనీయంగా, అవమానకరమైన పరిస్థితుల్లో వెనుదిరిగాడు. నిజంగానే ద్వైపాక్షిక సిరీస్‌లపై మనోహర్‌కు చిత్తశుద్ధి ఉంటే, ముందుగానే ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నించి ఉండేవాడు. ఆ తర్వాతే పిసిబితో చర్చలు జరిపేవాడు. అయతే, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, పిసిబితో చర్చలు, ప్రతిపాదనలు, సిరీస్ జరగాల్సిన కేంద్రాలు అంటూ కాలయాపన చేశాడు. మరో రకంగా చెప్పాలంటే పిసిబికి లేనిపోని ఆశలను కల్పించి, చివరికి కేంద్రం నిర్ణయం తీసుకోవాలేగానీ, తమదేమీ లేదని ప్రకటించాడు. మొత్తం మీద షహర్యార్‌కు భారత్‌లో నిరాశ తప్పలేదు. స్పష్టతనివ్వకపోతే, తమ ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లను బహిష్కరించే ప్రమాదం ఉందని అతను హెచ్చరించినప్పటికీ అదిగో.. ఇదిగో అంటూ నాన్చివేత ధోరణిని బిసిసిఐ అనుసరించింది. చివరికి వాస్తవం తెలుసుకున్న పిసిబి సిరీస్ ప్రస్తుతానికి రద్దయనట్టేనని ప్రకటించి, పరుగవు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.

గర్హనీయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: సరిహద్దులో యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్న పరిస్థితులోల పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్‌ను చాలా మంది కోరుకోవడం లేదు. రాజకీయ పార్టీలే కాదు.. అభిమానులు కూడా భారత్ పట్ల పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదు. కానీ, సిరీస్ గురించి పిసిబి ప్రస్తావించిన మరుక్షణమే ఈ విషయాన్ని స్పష్టం చేసివుంటే బాగుండేది. పాక్‌తో సిరీస్‌కు సిద్ధమని ప్రకటించడం, షహర్యార్‌ను చర్చల కోసం భారత్‌కు ఆహ్వానించడం, పదేపదే భేటీ కావడం, చివరి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ముఖం చాటేయడం వంటి చర్యలతో బిసిసిఐ తన ఆధిపత్యాన్ని చాటుకుందే తప్ప అభిమానుల మద్దతును సంపాదించలేకపోయంది. భారత క్రికెట్ బోర్డు అనుసరించిన విధానం గర్హనీయం. బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఆతర్వాత అధ్యక్షుడిగా ఎన్నికై, గుండెపోటుతో మృతి చెందిన జగ్మోహన్ దాల్మియా, తాజాగా శశాంక్ మనోహర్ పిసిబితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రభుత్వ అనుమతి ఉంటేగానీ సిరీస్ జరగదని తెలిసిన తర్వాత ఇన్నిసార్లు చర్చలు ఎందుకు చేసినట్టు? ఇంత ఉత్కంఠను ఎందుకు సృష్టించినట్టు. సమాధానం బిసిసిఐకే తెలవాలి. ఈనెల 15 నుంచి సిరీస్ శ్రీలంకలో ఆరంభమవుతుందని తొలుత ప్రకటించిన బిసిసిఐ ఆతర్వాత నోరు మెదపలేదు. 25 లేదా 27 నుంచి మొదలు కావచ్చని సంకేతాలు పంపింది. చివరికి అంతా ప్రభుత్వం చేతిలోనే ఉందంటూ చేతులెత్తేసింది. పాక్‌తో సిరీస్ జరగకపోవడంతో తన తప్పు ఏమాత్రం లేదని, ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేసే క్రమంలో వౌనాన్ని పాటించింది. ఇప్పటికీ సిరీస్ జరగదని బిసిసిఐ ప్రకటించలేదు. పిసిబినే ఆ మాట చెప్పేలా జాగ్రత్త పడింది. అనుకున్నది సాధించింది.