జాతీయ వార్తలు

బిసిసిఐ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ మంగళవారం రాజీనామా చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి ఆయన తొలి ఇండిపెండెంట్ చైర్మన్ కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. ఐసిసిలో పదవి చేపట్టేవారు స్వతంత్రంగా ఉండాలని, మరో క్రికెట్ సంఘంలో బాధ్యతలు కొనసాగించరాదన్న నిబంధన ఉంది. ఈ కారణంగానే మనోహర్ బిసిసిఐ అధ్యక్ష పదవిని వదులుకున్నారని తెలుస్తోంది. బిసిసిఐ చైర్మన్ పదవికి మాజీ కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. పవార్‌తో పాటు అనురాగ్ ఠాకూర్, రాజీవ్ శుక్లా, అజయ్ షిర్కే కూడా బిసిసిఐ పదవికి రేసులో ఉన్నారు.