రాష్ట్రీయం

బీచ్‌కారిడార్ కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: ఆంధ్ర రాష్ట్రంలో 973 కి.మీ పొడువు ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక, వాణిజ్య రంగం అభివృద్ధి చేసేందుకు బీచ్ కారిడార్ పేరిట ప్రణాళికను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ఈ కారిడార్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాల నివేదికను అన్ని కోణాల నుంచి తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాని ఈ కారిడార్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అనుమతులు వచ్చిన తర్వాత బీచ్ కారిడార్ నిర్మాణంపై పిపిపి పద్ధతిలో ఎంఒయు ఖరారు చేయవచ్చనే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వరకు 250 కి.మీ, విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వరకు 260 కి.మీ, నర్సాపూర్ నుంచి ఒంగోలు వరకు 260 కి.మీ, ఒంగోలు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 240 కి.మీ పొడువున ఈ బీచ్ కారిడార్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేసే పనిని ఒక ఏజన్సీకి అప్పగించారు. తొలి దశలో ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బీచ్ కారిడార్‌లో వాణిజ్య జోన్, విస్తరణ జోన్, సైకిల్ ట్రాక్, వాక్ వేను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.