విశాఖపట్నం

బీచ్‌రోడ్డును సుందరంగా తీర్చిదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భవన వ్యర్థాల డంపింగ్‌ను అరికట్టాలి
* అనుమతి లేని హోర్డింగ్‌ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్
* ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను నియంత్రించండి
* అధికారులకు కమిషనర్ ఆదేశం
విశాఖపట్నం, డిసెంబర్ 18: జివిఎంసి పరిధిలోని జోడుగుళ్లపాలెం నుంచి రుషికొండ వరకూ బీచ్‌రోడ్డులో వేస్తున్న భవన వ్యర్థాలను నియంత్రించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఆయన అప్పుఘర్ నుంచి బీచ్‌రోడ్డు వెంట సందర్శించారు. ముందుగా అప్పుఘర్ వద్దనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. అనంతరం తెనే్నటి పార్కు సమీపంలో భవన వ్యర్థాల తరలింపులో భాగంగా కుప్పలుగా వేసిన డెబ్రిస్‌ను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వీటిని తొలగించడంతో పాటు భవిష్యత్‌లో వ్యర్ధాలు వేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, కాపలాదారును నియమించి నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జోన్ 1 కమిషనర్ సత్యవేణిని ఆదేశించారు. హనుమంతవాక - అడవివరం మధ్య రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. పచ్చి మొక్కలను తొలగించడం ద్వారా బహిరంగ మల విసర్జన తగ్గుతుందని, ఫుట్‌పాత్‌ల వాడకం మెరుగుపడిందని గుర్తించారు. బహిరంగ మలవిసర్జనకు సంబంధించి హెచ్చరికల బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని జోన్ల పరిధిలోని అనధికార హోర్డింగ్‌లు, అనుమతి లేని ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే బిఆర్‌టిఎస్ రహదారి, ఇతర గోడలపై వాల్‌పోస్టర్లను తొలగించాలన్నారు. కాలువల్లో చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో సహాయ వైద్యాధికారులు తమ యంత్రాంగంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. అధికారులు క్షేత్ర పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ప్రజా సమస్యలు దృష్టికి వస్తాయన్నారు. పర్యటనలో హార్టీకల్చర్ ఎడి దామోదర్, జోన్ 4 జెడ్సీ నాగనరసింహారావ, ఎఎంఓలు డాక్టర్ మురళీ మోహన్, రమణ, ఎసిపి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.