రాష్ట్రీయం

ఒయులో బీఫ్ ఫెస్టివల్ ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ జన జాగృతి డిమాండ్ * నేడు హైదరాబాద్ కలెక్టరేట్‌కు వినతిపత్రం

హైదరాబాద్, నవంబర్ 26: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 10న జరిగే ‘బీఫ్ ఫెస్టివల్’ను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని గోవాకు చెందిన హిందూ జన జాగృతి సమితి హైదరాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనుంది. ఈ సందర్భంగా సమితికి చెందిన పలువురు ప్రతినిధులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని, ఆ కార్యక్రమం జరగకుండా రద్దు చేయాలని కలెక్టర్‌ను శుక్రవారం కోరనున్నట్లు జాగృతి సమితి తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రు మోగెర్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమితితో పాటు అన్ని హిందూ అనుకూల సంస్థలు బీఫ్ ఫెస్టివల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు. ఈ నేపధ్యంలో తమ సంస్థతో పాటు అన్ని హిందూ సంస్థలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు త్రిదండి వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ, శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మురారి, తెలంగాణ గో రక్ష దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్, నేతాజీ స్ఫూర్తి కేంద్ర వ్యవస్థాపకుడు డాక్టర్ సీతారామయ్య, హైకోర్టు అడ్వకేట్ రమణమూర్తి, హిందూ ఏక్తా మంచ్ కార్యదర్శి జగతయ్య, హిందూ జన జాగృతి సమితి కో ఆర్డినేటర్ చంద్ర మోగెర్, భజరంగ్‌దళ్, శ్రీరామ్ యువసేన నుంచి పలువురు హాజరవుతున్నారని తెలిపారు.