తెలంగాణ

16 నుంచి బేగంపేటలో వైమానిక ప్రదర్శన ప్రారంభించనున్న రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఈ నెల 16 నుంచి 20 వరకు బేగంపేట ఎయిర్‌పోర్టులో 5వ ఇండియా అంతర్జాతీయ ఏవియేషన్ ప్రదర్శన, సమావేశం జరుగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 16వ తేదీన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, ఎన్.చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. వీరితో పాటు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆ శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే, ఫిక్కీ నియోటియా ప్రెసిడెంట్ హర్షవర్థన్ కూడా హాజరు కానున్నారు. ప్రదర్శనను వీక్షించేందుకు గాను వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రముఖులు విచ్చేస్తున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. దాదాపు 29 చిన్న, పెద్దా ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ ప్రదర్శనలో పాల్గోంటుండగా, సుమారు 12 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు ఆయా సంస్థల నుంచి హాజరు కానున్నారు. ఈ ఏవియేషన్ ప్రదర్శన వల్ల భారత పౌరవిమానయాన రంగానికి మంచి ఊతం లభిస్తుందని ఆయా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బేగంపేట ఎయిర్‌పోర్టులోని కార్గో విభాగం ప్రాంతంలో వాహనాల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. బారిగేడ్ల వైపు నుంచి మాత్రమే సందర్శకులు ఎయిర్‌క్రాఫ్ట్‌లను వీక్షించాలి తప్ప లోనికి అనుమతించరు. తినుబండారాలు, వాటర్ బాటిళ్లను లోనికి అనుమతించమని ఆయా వర్గాలు వెల్లడించాయి.