జాతీయ వార్తలు

ఐఎస్‌పై పోరును తీవ్రం చేసిన ఐరాస, ఇయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్‌లో హై అలర్ట్ ప్రకటించిన బెల్జియం

పారిస్, నవంబర్ 21: ఇస్లామిక్ స్టేట్ జిహాదీలకు వ్యతిరేకంగా తాము జరుపుతున్న పోరును మరింత తీవ్రం చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తన సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు సరిహద్దు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తామని ఐరోపా సమాజం ప్రకటించగా బ్రస్సెల్స్ గరిష్ఠస్థాయి టెర్రర్ హెచ్చరికను జారీ చేసింది. ఐఎస్‌కి వ్యతిరేకంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సభ్య దేశాలకు అధికారాలిస్తూ భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన కొద్ది గంటలకే సాయుధ మిలిటెంట్లు మాలి రాజధానిలోని ఒక లగ్జరీ హోటల్‌లోకి చొరబడి వందమందికి పైగా బందీలుగా పట్టుకోవడం, ఈ దాడిలో కనీసం 27 మంది చనిపోవడం తెలిసిందే.
మరోవైపు ఎలాంటి పాస్‌పోర్టులు లేకుండానే ప్రయాణించడానికి వీలుగా ఉండే తమ సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడానికి యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల మంత్రులు అంగీకరించారు. కాగా, తీవ్రమైన ప్రమాదం ఎదురుకావచ్చని హెచ్చరిస్తూ బెల్జియం ప్రభుత్వం బ్రస్సెల్స్ నగరాన్ని గరిష్ఠస్థాయిలో అప్రమత్తం చేసింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులు సాఫీగా కొనసాగడానికి అంతకు మించి ఎలాంటి వివరాలు తెలియజేయడానికి అధికారులు నిరాకరించారు. పారిస్ దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మొరాకో సంతతికి చెందిన బెల్జియం దేశానికి చెందిన 28 ఏళ్ల అబ్దెల్ హమీద్ అబౌద్ ఐఎస్‌లో చేరడానికి సిరియాకు వెళ్లడమే కాకుండా యూరప్‌లో ఒక కార్యకర్తగా పని చేయడానికి శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ అరెస్టు వారంట్లు ఉన్నప్పటికీ అతనితో పాటుగా మరో జిహాదీ సిరియానుంచి యూరప్‌లోకి చొరబడ్డం జిహాదీలు దాడులు జరపడానికి శరణార్థుల సమస్యను అవకాశంగా తీసుకుంటూ ఉండవచ్చన్న భయాలకు కారణమైంది. పారిస్ దాడుల్లో పాల్గొన్న దుండగుల్లో ఒకరుగా భావిస్తున్న బ్రస్సెల్స్‌కు చెందిన 26 ఏళ్ల సలాహ్ అబ్దెస్లామ్ కోసం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వేట కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
కాగా, సిరియాలో ఐఎస్ అధీనంలో ఉన్న డీర్ ఎజార్ రాష్ట్రంపై రష్యా, సిరియా ప్రభుత్వ యుద్ధ విమానాలు జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది చనిపోయినట్లు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్న ఓ సంస్థ ప్రకటించింది. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంపై ఇంత భారీ స్థాయిలో దాడులు జరగడం ఇదే తొలిసారని కూడా ఆ సంస్థ పేర్కొంది.
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ, అల్‌ఖైదాతో సంబంధాలున్న ఇతర మిలిటెంట్ సంస్థలపై పోరాటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సభ్య దేశాలకు అధికారాలిచ్చే ఫ్రాన్స్ ప్రతిపాదించిన తీర్మానానికి పాశ్చాత్య దేశాలతో పాటుగా రష్యా సైతం మద్దతు తెలిపింది. ఐఎస్‌ని అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు తీవ్రమైన ముప్పుగా అభివర్ణించిన ఆ తీర్మానం ఈ సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటుగా ఇరాక్, సిరియాలకు విదేశీ మిలిటెంట్ల వలసలను ఆపడానికి చర్యలను మరింతగా పెంచాలని ప్రపంచ దేశాలను కోరింది.
బెల్జియం పౌరుణ్ని అరెస్టు చేసిన టర్కీ
పారిస్ దాడులతో సంబంధం ఉందన్న అనుమానంపై టర్కీ పోలీసులు మొరాకో మూలాలున్న ఓ బెల్జియం పౌరుడ్ని అరెస్టు చేసారు. 26 ఏళ్ల అహ్మెత్ దహమానిపై పారిస్‌లో గత వారం 130 మందిని పొట్టన పెట్టుకున్న బాంబు దాడులకోసం స్థలాలను ఎంపిక చేయడానికి రెక్కీ నిర్వహించినట్లుగా ఆరోపణలున్నాయని ‘దోగన్’ వార్తాసంస్థ తెలిపింది. మరో ఇద్దరు సిరియా పౌరులతో పాటుగా అతడ్ని అంతాల్యా నగర సమీపంలో అరెస్టు చేసినట్లు ఆ వార్తాసంస్థ తెలిపింది. అతను సరిహద్దులు దాటి సిరియాలో ప్రవేశించడానికి సాయం చేసే బాధ్యతను ఐఎస్ ఈ ఇద్దరు సిరియన్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతాల్యా నగరంలో ఈ మధ్యనే కనీవినీ ఎరుగని భద్రత మధ్య జి-20 శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిని ఎప్పుడు అరెస్టు చేసిందీ ఆ వార్త స్పష్టం చేయలేదు. ఈ ముగ్గురినీ కోర్టుకు తీసుకెళ్లగా పోలీసు కస్టడీకి అప్పగించినట్లు కూడా ఆ వార్త తెలిపింది.