భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికంటి రాజవౌళి,
చుడీబజార్ (హైదరాబాద్)
ప్ర: పోయిన సంవత్సరం ఆగస్టులో నన్ను వస్త్ర వ్యాపారం చేయమన్నారు. అదే మొదలెట్టాను. చాలా బాగా నడుస్తోంది. మా అబ్బాయి చేత ఏ వ్యాపారం పెట్టించమంటారు చెప్పండి.
సమా: మీ అబ్బాయి నక్షత్ర వివరాల ప్రకారం సిమెంట్, స్టీలు, ఇత్తడి వ్యాపారాలు, ప్లాస్టిక్, కలప కూడా బాగుంటాయి. మీ కనుకూలమైనది ఎన్నుకోండి.
ఏ.వి.ఎస్.కులకర్ణి,
బి.హెచ్.ఇ.ఎల్ (హైదరాబాద్)
ప్ర: మా భూమి విషయంలో మీరు చెప్పినట్లుగానే మాకే జయం కలిగింది. మాకు సంతోషం కలిగించారు. ఆ భూమిని అమ్మాలనుకుంటున్నాము. మేము ఇచ్చిన సంఖ్య ప్రకారం మాకు లాభం కలుగుతుందా?
సమా: ఈ సంవత్సరం చివరిభాగంలో అమ్మకమయ్యే అవకాశం వుంది. అయితే కొన్ని ఆటంకాలు కూడా వచ్చే అవకాశం వుంది. జాగ్రత్త అవసరం.
గాయత్రీ దేవి, తిమ్మాపురం (ప.గో)
ప్ర: నా పేరున గల భూమి ఎప్పుడు అమ్మకం కాగలదు.
సమా: ఏప్రిల్, మే నెలలో అవకాశం ఉంది. అయితే మరొకరి ప్రమేయం కూడా వస్తుంది. ఒకే ఆలోచన మీద నడవండి. ధర సరి సంఖ్యలో వచ్చే అవకాశం వుంది.
బి.గీతా మహాలక్ష్మి, హైదరాబాద్
ప్ర: మామిడి తోట లీజుకు తీసుకుంటున్నాం. మంచి లాభాలు రావాలంటే ఏం చేయాలి?
సమా: ‘లక్ష్మీ గణేశ యంత్రం’ సశాస్ర్తియంగా తయారు చేయించి, ప్రతిరోజూ మాతులంగ ఫలము (మాదీఫలము) నివేదన చేస్తూ పూజించండి. శుభమూ, లాభాలూ కలుగుతాయి.
ఎస్.విజయానందబాబు, తిరుపతి (చిత్తూరు)
ప్ర: దాంపత్య సమస్య
సమా: సమస్య కోర్టువరకూ వెళ్ళే అవకాశం వుంది. సామరస్యంగా కుటుంబ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటేనే మంచిది.
కె.లక్ష్మీనరసింహ, సరిపల్లె (ప.గో.)
ప్ర: స్వగృహయోగం
సమా: వచ్చే దుర్ముఖి నామ సంవత్సరంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు.
కె.కృష్ణమోహన్‌రావు, ఫతేబాద్, ఏలూరు
ప్ర: మానస సరోవర యాత్రయోగం ఉందా?
సమా: ప్రత్యేకంగా మానస సరోవర యాత్రాయోగం అంటూ శాస్త్రంలో ఉండదు. ‘గంగాస్నాన ఫలసిద్ధి- తీర్థయాత్ర యోగం’ అని ఉంటుంది. ఆ యోగాలు మీకున్నాయి. శుభం భూయాత్.
వి.వసుంధర, నాగారం, హైదరాబాద్
ప్ర: వివిధ రోగాలు- దీర్ఘకాల బాధ- పరిష్కారం చెప్పండి.
సమా: ‘పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా పీడతి- తచ్ఛాంతి కౌషధైర్దానైః జపహోమ సురార్చనైః’ అన్నారు పెద్దలు. నలభై రోజులు పూజా నైవేద్యాలతో సద్బాహ్మ్రణుని చేత శ్రీమత్సుందరకాండ పారాయణం చేయించండి. మంచి వైద్యం కూడా లభిస్తుంది.
యశోద, రాజమండ్రి (తూ.గో.)
ప్ర: వివాహం
సమా: దుర్ముఖినామ సంవత్సరం మధ్యభాగంలో అంటే శ్రావణమాసంలో కాని కార్తీకంలో కాని అవకాశం వుంది.
ఎ.నాగరాజు, కంకచర్లపాలెం, వైజాగ్
ప్ర: ఉద్యోగంలో ప్రమోషన్
సమా: మే - జూన్‌లలో అవకాశం ఉంది.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ