రాష్ట్రీయం

భద్రాద్రిరామయ్యకు రికార్డు ఆదాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు
భద్రాచలం, డిసెంబర్ 28: ఇటీవల వచ్చిన వరుస నాలుగు సెలవు దినాల్లో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి హుండీ రికార్డుల మోత మోగించింది. స్వామివారి ఆదాయం ఆలయ చరిత్రలోనే తొలిసారి వరుసగా రెండు రోజుల్లో రూ. 10 లక్షల మార్కును దాటింది. ప్రసాదాలు, ఆర్జిత సేవలు, కల్యాణాలు, కేశఖండనం, సత్రాలు, ప్రచార శాఖ, అన్నదానం, శాశ్వత పూజలు, దర్శనం టిక్కెట్ల విక్రయాలపై గురువారం రూ. 5,71,980లు వచ్చాయి. శుక్రవారం రూ. 9,42,401లు రావడంతో దేవస్థానం సిబ్బంది ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు శనివారం ఏకంగా రూ. 14,22,861లు వచ్చాయి. ఆదివారం ఆదాయం ఏకంగా రూ. 15,35,531ల మార్కు దాటింది. వరుసగా సెలవు రోజులు రావడంతో ముక్కోటి కంటే ఎక్కువగా భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. 100కి పైగా నిత్యకల్యాణాలు జరిగాయి. నాలుగు రోజుల్లోనే శ్రీ సీతారామచంద్ర స్వామి ఆదాయం రూ. 44 లక్షల 72వేల 773లు రావడం గమనార్హం.
పాపికొండల్లోనూ రద్దీ
మంచు కురిసే వేళలో పాపికొండల్లో గోదావరి సోయగాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 25 లాంచీల్లో పర్యాటకులు వెళ్లగా ఇంకా 1000 మందికి పైగా యాత్రికులు ఇసుక తినె్నల్లో మిగిలిపోయారు. దీంతో వారికోసం వెళ్లిన లాంచీలు రెండో దఫా వెనక్కు రావాల్సి వచ్చింది.
** భద్రాచలం రామాలయంలో సోమవారం పోటెత్తిన భక్తులు **