భక్తి కథలు

పారాయణ కన్నా ఆచరణే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో సుఖదుఃఖాలు చీకటి వెలుగులు. విజ్ఞులైన వారు రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. సుఖదుఃఖాది ద్వంద్వములనుండీ విడువడాలని ‘సమత్వం యోగముచ్యతే’ బుద్ధిమంతులైనవారు సుఖ దుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తారని దానినే ఉత్తమ యోగముగా భావించాలనేది గీతాసందేశం. సారాంశం.
అందరూ దుఃఖాలలో దైవాన్ని స్మరిస్తారు కాని ఉత్తములు మాత్రమే సుఖాలలో భగవంతుని స్మరణ చేస్తారు. సంతోషంలో కూడా దైవచింతనగలవారికి దుఃఖాలు దరిజేరవని భక్త కబీరుదాసు వివరిస్తాడు. సుఖ దుఃఖాలు, కలిమిలేములు. మానవ జీవితంలో కావడికుండలు వంటివి.
సుఖదుఃఖాలు చంచలాలు. అవి సదా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయ. కోరిక అను ఒక్కదాన్ని వదిలేస్తే చాలు సుఖదుఃఖాలు రెండూ దరిచేరవని బుద్ధుడు చెప్పాడు.
స్వశక్తిపై ఆధారపడి జీవిస్తే సుఖం, ఇతరులపై ఆధారపడి జీవిస్తే దుఃఖం కలుగునని ‘మనుస్మృతి’ చెబుతోంది. దుఃఖం భగవంతుని జ్ఞాపకం చేయిస్తుందని, సుఖం దేవుని మరచిపోయేలా చేస్తుందని తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిఅంటారు.
ఎపుడైనా ఉన్నది చాలునని అనుకుంటే సుఖం, లేనిదానికోసం ఆశిస్తే దుఃఖం అని మదర్ థెరిసా చెప్పారు.
దుఃఖితుల దుఃఖాన్ని చూచి వారికి ఓదార్పు నిస్తే చాలు వారికి ధైర్యం మనోబలం సిద్ధిస్తాయని మహాకవి కాళిదాసు వెలిబుచ్చాడు. దుఃఖితుల ఆక్రందనలను పొగొట్టడంలో పాలుపంచుకున్నవారికి కోటి స్వర్గాలు లభిస్తాయని మహర్షులుద్బోధించారు. తన సుఖం కంటే ఇతరుల సుఖాలు కోరడంలోనే శ్రేయస్సుందని పురాణాలు చెబు తున్నాయ. సుఖం దుఃఖం రెండింటిలోను ‘ఖం’ అనే అక్షరం సమానం. ఖం అనగా ఆకాశము. ఆకాశ అనంతత్వమును దేహముగా పొందిన పరమాత్మ రెండింటిలోను సమానంగా ఉన్నాడు. అనగా సుఖదుఃఖాలలో సగపాలు భరిస్తున్నాడు. మిగిలిన అర్ధ్భాగమే మానవుని వంతని గ్రహించాలి.
రెండింటియందు చెక్కు చెదరకుండా ఉండే మనస్తత్వం శ్రీరామునిది. దశరథుడు రామునికి రేపు పట్ట్భాషేకం చేస్తానంటే సంతోషం వేయలేదు. దుఃఖమూ కలుగలేదు. అట్లానే రేపే నీవు అడవులకు వెళ్లాలి అని అంటే కూడా దుఃఖమూ లేదు సంతోషమూ లేదు. అట్లాంటి మనస్తత్వము న్నవాడే స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు. మానవులు కూడా కోరికలపైన అంతగా ఆశ పెంచుకోకపోతే భగవంతుడు ఏది చేయస్తాడో అదే జరుగుతుంది అనుకొంటే చాలు దుఃఖమూ రాదు . సంతోషమూ వేయదు. నిశ్చలంగా ఉండచ్చు.
ఆ స్థితికోసమే భగవంతునికి పూజచేయాలి. కేవలం విగ్రహారాధన చేయడమే కాక మనుష్యుల్లో దైవాంశను చూడాలి. గుడిమెట్లపైన ఉన్న బిచ్చ గాళ్లని చీదరించుకుంటూ గుడిలోని హుండీలో వేలకు వేలు మొక్కులు తీరిస్తే భగవంతుడు మెచ్చడు. మనకు చేతనైనంతలో పేదవారికి కాస్త దానం చేస్తే చాలు వారి కంట్లో ఉన్న తడిని తుడిచేయగలిగితే చాలు భగవంతుడు మెచ్చు తాడు. మానవసేవనే మాధవసేవ అని అనడంలో అర్థాన్ని తెలుసుకోవాలి. అట్లానే భారత భాగవతాలను ప్రతిరోజుపారాయణ చేయడం కన్నా అందులో చూపిన మంచిమార్గాన్ని ఆచరణలోకి తీసుకొని వస్తే చాలు పారాయణ చేసినంత పుణ్యాన్ని భగవంతుడు ఇస్తాడు. అపుడు ఇలనే స్వర్గంగా భాసిల్లుతుంది.

- ఆర్. పురంధర్