భక్తి కథలు

ఓం నమః శివాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుడిని పూజించన వారు ఎవరూ ఉండరు. శివుని విభూదిని ఆస్వాదించని వారు ఎవరూ ఉండరు. జగత్ శివమయం. ‘ఓం నమః శివాయ’ అనగానే సకల శుభాలను కలిగిస్తుందని పెద్దలంటారు.
‘‘మంత్రోహృదయ గోచరః’ అంటే ఎవరి హృదయంలో నిరంతరం ‘ఓం నమః శివాయ’ అనే మంత్రం జపించబడుతుంటుందో వారికి ఇతర మంత్రాలతో యజ్ఞ యాగాదులతో పనిలేదని భావం.
ఓం నమశ్శివాయ (షడక్షరీ) నమశ్శివాయ (పంచాక్షరీ) మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు.
శివుడు అంటే నిరాకారుడు అనే అర్థం. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటారు. భగవంతుని అంశ అనే అర్థం వస్తుందంటారు. ఈ మంత్రానికి ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.
న - భగవంతునిలోని కాంతి / భూమి
మ - నీరు
శి - నిప్పు
వ - గాలి
య - ఆకాశం అని కొందరు నిర్వచిస్తారు
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు, సృష్టిలయకారకుడు.
నా యిష్టదైవం శివుడు. చిన్నతనంనుండి నాకు శివుడు అన్నా శివనామస్మరణ అన్నా ఎంతో ప్రీతి. ఎక్కడ దేవాలయం కనిపించినా తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకుంటాను. వీలుకాని పరిస్థితిలో దూరం నుండైనా దండెం పెట్టుకొని సరిపుచ్చుకుంటాను. శివరాత్రి నాడు తప్పకుండా ఉపవాసం, జాగరణ చేస్తాను. పూజామందిరంలో ఎక్కువగా శివలింగాలు, శివపార్వతుల ప్రతిమలు ఉంటాయి.
శ్రీశైలం, ఉమామహేశ్వరం, మహానంది, శ్రీకాళహస్తి, త్రయంబకేశ్వరం, ఝరాసంగం, కాళేశ్వరం, పుట్టపర్తి, షిరిషీ సోమేశ్వరాలయం మొదలగు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరిగినది ఆ దైవం పుణ్యాన. భాసర, అన్నవరం, సూర్యదేవాలయం, శ్రీకాకుళం, రాఘవేంద్ర మంత్రాలయం.
ప్రతి సంవత్సరం స్కూల్ /కాలేజీ మొదలుకావడానికి ముందు మహానందికి తప్పకుండా వెళతాము. అక్కడి కోనేరులో స్నానం చేసి దైవదర్శనం చేసుకుంటాము ఎంతో ఆనందంగా అనిపిస్తుంది దర్శనం చేసుకున్న తరువాత.
ప్రతిరోజూ లేవగానే శివుడిని తలచుకుంటూ ఆరోజు కార్యక్రమాలు మొదలుపెడతాను.
వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తారు.
హరహర మహాదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ, అనేకాలోచనుడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదాన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్థేశ్వర్, అర్థనారీశ్వరుడు, ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉమాకాంతుడు, ఉమానాధ్, ఉమాపతి, ఉరగ్‌భూషణ్, ఎకలింగ, కపాలపాణి.. ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా పలికే దైవం ఆ సర్వేశ్వరుడు జగమంతా నిండియున్నాడు.
ఆ దివ్య మంగళ స్వరూపుని ఆశీస్సులు అందరికి ఉండాలని ఆశిస్తూ.

-ఉషశ్రీ తాల్క