భక్తి కథలు

శుభ శ్రావణం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులకు పరమ పవిత్రమాసంగా భావించబడే మాసం శ్రావణం. ‘‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగత: పితరం వందే పార్వతీపరమేశ్వరం ’’అని మహాకవి కాళిదాసు వాగర్థముల జ్ఞానానికై పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. వాగర్థములవలె కూడియున్న పార్వతీ పరమేశ్వరులు జగజ్జననీ జనకులు. ‘‘ఈశానాం సర్వ విజ్ఞానం’’. ఎల్లవిద్యలకు ఈశ్వరుడు పార్వతీ పతియే. అందుకే వేదం ‘ప్రథమో దైవ్యో భిషక్’ అని స్తుతిస్తున్నది. ‘‘అంత్యజోవిధిమోనిపివా, మూర్ఖోవా, పండితోవా, పంచాక్షరీం జపేన్నిష్ఠో ముచ్యతే పాప పంజరాత్ ’’ అని శివపురాణం తెలుపుతున్నది. పూజాసంస్కారాదులు తెలియని వారునూ, వేదం తెలియని వారైననూ, మూర్ఖులూ, పండితులూ ఎవరైననూ, ‘‘ఓం నమఃశివాయ’’ అని పంచాక్షరీ జపం పఠిస్తే, సర్వపాపాలూ, కష్టాలూ, దు:ఖాలూ పటాపంచలవుతాయని శివపురాణం స్పష్టం చేస్తున్నది. ‘‘నభోమా సేతుయో మర్త్య: లింగం శైవం సమర్చయేత్, పశే్యద్యా పూజితం దేవం, సాయుజ్యం సోనిధి గచ్చతి’’. లోకేశ్వరుడు, అభయంకరుడైన శంకరుని శ్రావణమాసం అందునా ప్రత్యేకించి, సోమవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పూజిస్తే శివసాయుజ్యం పొందగలని పురాణాలు విశదీకరిస్తున్నాయి. ‘న్యాసము’ అనగా ‘ఐక్యము’ చేసుకోవడం. పూజకు పూర్వం రుద్రుడిని, లింగంలో నిలుపుకుని, తాను రుద్రుడై, ఆ రుద్రుడిని అభిషేకించాలి. అందులకై మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో, కనీసం శ్రావణ సోమవారమైనా శివున్ని పూజించి, నిరాహారం, ఉపవాసం లేక ఏకభుక్తం చేయాలి. ‘‘సోమవారం వ్రతం కార్యం, శ్రావణీవై యధావిధి, శక్తేన్ పోషణం కార్యం, అధవా నిశిభోజనం’’. ‘‘సోమవారే చతుర్దశ్యాం, కృష్ణపక్షే విశేషిత:, శ్రావణే పూజయేర్లింగం, శ్రేయోర్ధ రాఘవార్చితం’’. ద్వాదశ మాసాల్లో శ్రావణం అత్యంత శ్రేష్ఠమైన పవిత్రమాసం. వేసవి తాపంతోనున్న జీవకోటికి వర్షాలతో సేదతీరి ప్రాణం లేచి వస్తుంది. పాడి పంటలు, కూరగాయలు సమృద్ధియై పుష్పాలు, వృక్షాలు పచ్చదనంతో కళకళలాడుతూ, వింతశోభలు కూర్చుకుంటాయి ఈకాలంలో. పూజాక్రతువులకు, దానధర్మాలకు, దాతలకు, భోక్తలకు అనువైన మాసమిది. సృష్టి, స్థితి, లయకారులైన జగజ్జననీ జనకులు పార్వతీ పరమేశ్వరులు ఈపరమపవిత్ర మాసంలోనే సృష్టికార్యాన్ని ప్రారంభించారని పెద్దల ఉవాచ. మానవ దంపతులుకూడా శ్రావణ మాసాన్ని శుభదినాలుగా ఎంచుకుంటారు. అంతేగాక శ్రావణ మాసంలో హిందూ పండగలు అధికంగా ఉంటాయి. శ్రావణ సోమవారం శివారాధన, శ్రావణ మంగళవారం - గౌరీపూజ, శుక్రవారం - వరలక్ష్మీవ్రతం, శనివారం - విష్ణుపూజ, నాగుల చవితి, నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్ఠమి, ఉపాకర్మ (యజ్ఞోపవీత ధారణం), రాఖీ పండగ, పొలాల అమావాస్య, మొదలగు పండగలు ఉండే శ్రావణమాసం లక్ష్మీపార్వతులకేగాక, హిందువులకు అత్యంత ఇష్టదాయకం. జలప్రియుడైన గంగాధరునికి దోసెడు నీటితో అభిషేకించి, పిడికెడు భస్మం పూసి, ఒకే ఒక్కమారేడు పత్రం సమర్పించి, కైమోడ్పులిడితే సంతుష్ఠుడై సర్వ భోగాలను సమకూర్చగలడని ప్రతీతి. ఈనెల 12న ఆదివారంతో శ్రావణ మాసారంభం కానుండగా, నెల రోజులపాటు ధార్మిక సత్కర్మలు ఆచరించనున్నారు.

--సంగనభట్ల రామకిష్టయ్య