25న భలే మంచి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, వామిఖ జంటగా 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి రూపొందించిన ‘్భలే మంచిరోజు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల మహేష్‌బాబు విడుదల చేసిన ఆడియోకు, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, అన్ని వర్గాల ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి వ్యాపారాత్మకమైన క్రేజ్ పెరిగిందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 25న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని తెలిపారు. ఒక్క రోజులో జరిగే కథనంతో మొదటినుండి చివరి వరకు ఆసక్తికరమైన సన్నివేశాలతో, స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుందని, సాయికుమార్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: సన్నీ ఎం.ఆర్, ఆర్ట్: రామకృష్ణ, మాటలు: అర్జున్, కార్తీక్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.