అంతర్జాతీయం

ఒప్పందం ముసాయిదాలో భారత్ ప్రతిపాదనలకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వాతావరణ మార్పు ఒప్పందం తొలి ముసాయిదా విడుదల
* భారత ప్రతినిధి అజయ్ మాథుర్ వెల్లడి
లే బౌర్గెట్ (ఫ్రాన్స్), డిసెంబర్ 4: ఇక్కడ విడుదల చేసిన వాతావరణ మార్పు ఒప్పందం తొలి ముసాయిదాలో తాను ప్రతిపాదించిన అంశాలన్నీ ఉండటం పట్ల భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందం కుదుర్చుకునే దిశగా కొంత పురోగతి సాధించామని ఈ చర్చలలో పాల్గొన్న ప్రతినిధులు చెప్పారు. ‘ప్రస్తుతానికి ఇది సంక్షిప్త ముసాయిదా. అయితే మేము (్భరత్) చేర్చిన ప్రతి అంశం ఇంకా ఇందులో ఉన్నది’ అని భారత్ తరపున చర్చలలో పాల్గొంటున్న ప్రధాన ప్రతినిధి అజయ్ మాథుర్ ఐక్యరాజ్య సమితి (ఐరాస) వాతావరణ మార్పు సదస్సు వద్ద చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారం దిశగా ముందుకు సాగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పారని, ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా కలిసి చేస్తున్న పనిని భారత్ కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. సంక్లిష్టమైన 54 పుటల ఒప్పందం ముసాయిదాపై మూడు రోజుల పాటు ఎడతెగకుండా సాగించిన చర్చల అనంతరం, చర్చలలో పాల్గొన్న ప్రతినిధులు అయిదు పుటలు తక్కువగా గల ఒక పత్రాన్ని (డాక్యుమెంట్‌ను) విడుదల చేశారు. అయితే ఇందులోనూ ఇంకా నిర్ణయం కాని ప్రత్యామ్నాయాలు సుమారు 250 వరకు ఉన్నాయి. జర్మనీలోని బోన్ నగరంలో 1999లో జరిగిన సదస్సులో విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారమే ఇంచుమించుగా ఇందులో ఉందని అధికారులు చెప్పారు.
బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ వనరుల ఆధారంగా తయారు చేసే విద్యుత్తు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలు సహకరించాలని భారత్ కోరింది. చర్చల ప్రక్రియను మాథుర్ వివరించారు. అన్ని అంశాలను కలిపి ప్రెసిడెన్సీకి అందజేసే విభిన్న చర్చల బృందాలు ఈ పత్రాన్ని రూపొందించాయని ఆయన చెప్పారు. తరువాత ప్రెసిడెన్సీ పరిష్కారం కాని వివిధ అంశాలపై చర్చల బృందాలను ఏర్పాటు చేస్తుందని, ఆ బృందాలు చర్చలపై కేంద్రీకరిస్తాయని ఆయన తెలిపారు. నాలుగో రోజు తమకు మంచి ప్రోత్సాహం లభించిందని, కొంత పురోగతి సాధించామని మాథుర్ చెప్పారు. తాము ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే ప్రెసిడెన్సీ అభిప్రాయంతో తాము ఏకీభవించామని తెలిపారు. ప్రెసిడెన్సీ ఈ పాఠ్యాన్ని తీసుకొని, చర్చలు ప్రారంభించడానికి ముందు పురోగతి సాధించడానికి తాము చేయాల్సిన పని చాలా ఉందని ఆయన గురువారం పేర్కొన్నారు.