జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా 'భారత్‌బంద్‌'

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :పెరుగుతున్న పెట్రో, డీజిల్‌ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌, వామపక్షాల కార్యకర్తలు భారత్‌ బంద్‌లో పాల్గొని ఆందోళనలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులను నిలిపివేశారు. వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పాఠశాలలకు, కళాశాలకు సెలవులు ప్రకటించారు. జనతాదళ్‌ సెక్యూలర్‌, సమాజ్‌వాదీపార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె), రాష్ట్రీయ జనతాదళ్‌, మహారాష్ట్ర నవ నిర్మాణ సేనలతో సహా 21 ప్రతిపక్ష పార్టీలు బంద్‌కు మద్దతునిచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారు. తమిళనాడులోబస్సు సర్వీసులను అతిబెల్లీ వద్ద ఆగిపోయాయి. కర్ణాటకలోఎమ్మెల్యే బి.నాగేంద్ర నేతృత్వంలోని కార్యకర్తలు అమరావతి ఎక్స్‌ప్రెస్‌లు బళ్లారి రైల్వేస్టేషన్‌లో అడ్డుకున్నారు. పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఆయన గుర్రంపై సవారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. తిరుపతిలో నిరసనలు చేపడుతున్న సిపిఐ, సిపిఎం, ఆప్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోమహారాష్ట్రలో భారత్‌ బంద్‌కు శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మద్దతు తెలిపాయి. కోల్‌కతాలో వామపక్ష కార్యకర్తలు పెద్ద యెత్తున నిరనలు తెలుపుతున్నారు. ఒడిశాలోసంబల్‌పూర్‌ వద్ద రైళ్లను కాంగ్రెస్‌నేతలు అడ్డుకుని నిరసనలు తెలియజేశారు. దీంతో కొంతసేపు రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది.