భాస్కర వాణి

భాషావాదులు ‘బొంద’ నుండి నిద్రలేచారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘హిందీ జాతీయ భాష’గా ఉంటే బాగుంటుందని ఇటీవల ప్రకటించారు. వెంటనే భాషావేత్తలు, మేధావులు, కుల భాషావాదులు, వారి విషపత్రికలు కత్తీడాలూ సర్దుకొని పాత మసాలాను మరోసారి రోట్లోవేసి దంచి ‘ఉత్తరాది-దక్షిణాది’ అంటూ గగ్గోలు పెట్టడం మొదలైంది. ఎనలేని ప్రాంతీయ, మాతృభాషాభిమానాన్ని ఒలకబోస్తూ తెలుగునాట చర్చోపచర్చలు మొదలుపెట్టారు. ఆ తర్వాత అమిత్ షా వివరణ ఇచ్చినా ‘మాతృభాషా ప్రేమికులు’ ఇంకా అక్షరయుద్ధం చేస్తూనే ఉన్నారు. ‘కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దుచేసినట్లే అమిత్ షా దేశంలో భాషల్ని కూడా మింగేస్తాడు’ అంటూ విషప్రచారం మొదలుపెట్టారు. ఈ డెబ్బై ఏళ్లనుండి సాహిత్య పీఠాలపై, భాషా అకాడమీలపై ఈ గద్దలే కూర్చొన్నాయి కదా! ఇవాళ కవి సమ్మేళనాల్లో, సాహిత్య సమావేశాల్లో ఎంతమంది ఆసక్తిగా కూర్చొంటున్నారో చెప్పగలరా? మాట్లాడితే ‘ప్రాంతీయ భాషల్ని బొందపెట్టాలనే హిందీ వస్తోంది’ అంటూ చేసే దుష్ప్రచారంలో నిజమెంత? ఖండాంతరాల్లో పుట్టిన ఆంగ్లంపై మోజు ఉండే ఈ గ్యాంగుకు హిందీపై అంత ద్వేషమెందుకు?
నిజానికి భాషోద్యమం నడిపిన గిడుగు రామమూర్తి వల్ల జరిగిన లాభం కన్నా నష్టమే ఎక్కువ. బ్రిటీష్ వారు సృష్టించిన భాషావాదాన్ని తలకెత్తుకున్న గిడుగు రామమూర్తి, కవిత్వంలో జాతీయతను ధ్వంసం చేసిన గురజాడ ఇద్దరూ రాంగ్‌రూట్‌లోనే వెళ్లారు. గిడుగు చేసిన ఉద్యమం మంచిదైనా దానివల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే నెరవేరింది. భాష కవిత్వావసరాల్లో గ్రాంధికంగాను, ఇతర వ్యవహారాల్లో ఆధునిక వ్యవహార భాషగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. కానీ భాషోద్యమం గ్రాంధిక భాషను ధ్వంసం చేసే కుటిల నీతిగా సాగింది. ఇక్కడి ప్రజలను ప్రాచీన సాహిత్యం నుండి దూరం చేసే ‘చాపక్రింద నీరు కుట్ర’ ఇందులో ఉంది. ఈ వ్యవహారిక భాషోద్యమంలో కమ్యూనిష్టు భావజాలం ఉన్నవాళ్లంతాచేరి లేనిపోని ఎర్రరంగు రుద్దారు. ‘ఆర్యులు భారతదేశంపై దాడిచేసి జయించారన్నది అభూతకల్పన’ (డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలు- ప్రసంగాలు ఆరో సంపుటం 73 పుట) అని బాబాసాహెబ్ స్పష్టంగా చెప్పాడు. కానీ అంబేడ్కర్‌ను ఉటంకించేవాళ్లు భాషలకు ఆర్య-ద్రావిడ సిద్ధాంతం అంటించారు. దక్షిణాదిలోని కన్నడ, మలయాళం, తెలుగు, తమిళాల్లో ఒక్క తమిళంలో 40 శాతం సంస్కృత శబ్దాలుంటే మిగతా మూడింటిలో 80 శాతం సంస్కృత పదాలే ఉన్నాయి. కానీ వీటిని ద్రావిడ భాషలని ఇంగ్లీషు జాతికి చెందిన బిషప్ కాల్డ్‌వెల్‌ను వీళ్లు ఆదర్శంగా తీసుకొన్నారు. రువాండాలో హుటులు, టుట్సీల మధ్య అంతరం ఉన్నట్లే ఇక్కడా భాషల ఆధారంగా ద్రావిడ పదాన్ని సృష్టించారు. ఈ విభజన దేశాన్ని కలిపి ఉంచకుండా చేసే కుట్రలో భాగం. ఆర్యుల వల్ల భయంకర కష్టా లు అనుభవించారనే భ్రమ ను భాషాశాస్త్రం ద్వారా తమిళుల్లో బాగా కల్పించారు. ద్రావిడులను నీగ్రోలతో పోల్చిన మాజీ యుఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాలి. నల్లజాతి సిద్ధాంతం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో మంటలురేపే పనికి స్వాతంత్య్రం రాకముందునుండే పూనుకున్నాయి. ఆఫ్రో-ద్రావిడ ఉద్యమం అలా పుట్టుకు వచ్చిందే. దీనిపై దేశంలో చాలామంది సాహిత్యవేత్తలకు అవగాహన లేకపోవచ్చు. కానీ యేల్ విశ్వవిద్యాలయం ‘ద్రవిడియన్ ఎటిమలాజికల్ డిక్షనరీ’ తయారుచేస్తే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం డ్గే (డ్యఖఆ్ద ఒజ్ఘ గళఒజజూఖ్ఘ యేష్ఘఇఖ్ఘూక ఒఒళౄఇ్ఘ్ళ) ఫేరుతో ఓ సంస్థను సృష్టించింది. బర్కిలీ విశ్వవిద్యాలయం తమిళ ప్రాచీన సాహిత్యం పేరుతో ప్రాజెక్ట్‌లు చేపట్టింది. ఇదంతా మన భాషల గొప్పతనాన్ని బయల్పరచడం కొరకే అనుకుంటే పప్పులో కాలేసినట్లే!? దీని అంతిమలక్ష్యం ఆర్యులకూ-ద్రావిడులకు మధ్య నాగరికతల సంఘర్షణ ఉందని నిరూపించడమే. మాడిసన్‌లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో గత 35 ఏళ్లలో జరిగిన సెమినార్లు, సమావేశాల ఎజెండా చూస్తే చాలు- వీళ్లు భారత్‌ను, ఇక్కడి జాతీయతను ఎంతగా ద్వేషిస్తూ అనేక ముద్రలు వేస్తున్నారో అర్థమవుతుంది అంటాడు రాజీవ్ మల్హోత్రా.
నిజానికి భారతదేశాన్ని కలిపి ఉంచేందుకు హిందీ అనుసంధాన భాషగా ఉంచే ప్రయత్నం గాంధీజీ, రాజేంద్రప్రసాద్ లాంటి నేతలు చేస్తే, వేర్పాటువాద ఉద్యమాలకు మూల పురుషుడైన పెరియార్ రామస్వామి తమిళ అస్తిత్వాన్ని ముందుకు తెచ్చాడు. ఇపుడు హిందీపై విరుచుకుపడుతున్న స్టాలిన్, తెలుగునాట కుల పార్టీల విష పత్రికలు ఆంగ్లంపై అమితమైన మోజు ప్రకటిస్తాయి. ప్రపంచంలోని 197 దేశాల్లో కేవలం 10 దేశాల్లో మాత్రమే ఆంగ్లం వాడుక ఎక్కువ. అభివృద్ధి చెందిన చైనా, జపాన్, రష్యా లాంటి దేశాలు తమ మాతృభాషల్లో వ్యవహరిస్తున్నాయి. ఠాగూర్‌కు నోబెల్ బహుమతి ఆంగ్లంలో రాస్తే రాలేదు. కేవలం 12 దేశాల్లో మాట్లాడే భాష ప్రపంచ మాతృభాషనా? మన దేశంలో గుజరాతీ, మరాఠీ, అస్సామీ, తెలుగువంటి భాషల్లో మూల పదాలు 50 వేలకు మించి ఉన్నాయి. కానీ ఆంగ్లాన్ని ఇంగ్లాండు ప్రక్కనున్న ఐర్లాండ్ లాంటి చిన్న దేశమే వదిలేసింది. వాళ్లు ఐరిష్‌ను బంగారంగా చూసుకొంటారు. మనం అంత గొప్పగా మాతృభాషల్ని చూ సుకొంటున్నామా? తమిళనాడువాళ్లది భాషాభిమానమా? దురభిమానమా?
నిజమైన భాషాభిమానం కర్ణాటక, గుజరాత్‌ల్లో చూడవచ్చు. ఈరోజు కర్ణాటకకు వెళ్తే కనకదాస వృత్త (సర్కిల్), బసవేశ్వరవృత్త, వాల్మీకి వృత్త, మడివాలు మాచయ్య వృత్త... అంటూ ఎన్నో సర్కిళ్లకు వాళ్లు గౌరవంగా పేర్లు పెట్టుకున్నారు. మరి మనం మొత్తం తెలంగాణలో ఒక్క సర్కిల్‌కు పాల్కురికి సోమనాథ చౌరస్తా అనో, దున్న ఇద్దాసు సర్కిల్ అనో పెట్టుకున్నామా! భాషాభిమానం పేరుతో పార్టీలకు ఫ్రేములు కడుతున్నవాళ్లు ఆంధ్రాలో ఒక్కచోట నన్నయభట్టు సర్కిల్‌నో, భోయి భీమన్న చౌరస్తా అనో పెట్టారా?
హిందీపైన ద్వేషమంతా జాతీయతపై ద్వేషం. నిజానికి భాషలకు ఏనాడో స్థల దోషం, కాలదోషం పట్టింది. ద్రావిడ భాషల్లో బ్రాహోయా అని ఒక భాష ఉంది. దానిని బెలూచిస్తాన్‌లో మాట్లాడుతారు. అక్కడి బెలూచీలు హిందువుల దేవాలయం అయిన ‘నానోమందిర్’ను కాపాడేందుకు వేల మంది ఇస్లామిక్ టెర్రరిస్ట్‌ల చేతుల్లో మరణించారు. మరి ఈ ద్రావిడ భాషలకు వకాల్తా తీసుకొన్న ఈ మహనీయులు ఏనాడైనా బెలూచీల హక్కుల గురించి అంతర్జాతీయంగా లేవదీసారా? కాశ్మీరీయత్ గురించి కన్నీళ్లు కార్చే ఈ ‘తుక్డేతుక్డే గ్యాంగు’కు 12వేల మంది బెలూచీ యువకులు కన్పించకుండా ఎవరు అపహరించారో చెప్పగలరా? పైరవీకార్లకు, క్విడ్‌పోక్రోగాళ్లకు, జోకుడుగాళ్ల చేతుల్లో భాషాసంఘాలు, కేంద్ర సాహిత్య అకాడమీలు అవార్డుల కమిటీలు నలిగిపోతుంటే ఇప్పుడు చేస్తున్న ఈ భాషా కేరింతలు అవకాశాల కోసమో, అధికారం కోసమో అని వెంటనే అర్థం అవుతుంది. ఇవాళ ఓ పెద్ద సమాజం ఇంజనీరింగ్, మెడికల్, ఐఐటీ చదువులు చదువుతూ పవన్‌కళ్యాణ్ తప్ప పాల్కురికి సోమనాథుడి పేరు తెలియకుండా బ్రతుకుతుంటే ఇపుడు భాషావాదం పేరుతో ఉత్తర- దక్షిణాలను విభజిస్తారా? ఇందులో భాషా పరిరక్షణకన్నా రాజకీయ ప్రయోజనమే ఎక్కువ ఉంది. ‘అన్నా’ అనో, ‘సోదరా’ అనే రోజులు మాయమై ‘బ్రో’అని పిలుస్తుంటే, పద్యాన్ని పాతిపెట్టాలని పిలుపులిస్తుంటే, వ్యాకరణం నడుములు విరగదంతానని కవిత్వం రాస్తుంటే, అకవిత్వం సంపుటాలకు సంపుటాలు పుట్టుకొచ్చి రసజ్ఞులను చంపేస్తుంటే ఈ విభజనవాదులు హిందీని వ్యతిరేకిస్తున్నారు! కబీర్, సూరదాస్, తులసీదాస్, రవిదాస్, రహీం, మీరా, రస్కాన్, దాదూ, సహజోబాయి, భూషణ్ బిహారీ, భీష్మసహానీ, రామ్‌నరేశ్ త్రిపాఠీ, ఏబీ వాజపేయి, మైథిలీ శరణ్‌గుప్తా వంటి హిందీ కవుల సాహిత్యాన్ని మనం ఇలా గుడ్డిగా వ్యతిరేకిస్తే తెలుసుకోగల్గుతామా? భాషలను ఎవరైనా బలవంతంగా రుద్దగల్గుతారా? తిలకంలా తీర్చిదిద్దాలి కానీ... ఎవరైనా భాషల్ని బలవంతంగా నేర్చుకుంటారా? అమ్మలా అర్చిస్తారు కానీ.. ఇది విస్మరించి రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శలు వాటి వెనుక ప్రయోజనం ఈ నిశ్శబ్ద సమాజం గమనిస్తూనే ఉంది. ఇటీవల ప్రధాని మోదీ తమిళం 3వేల యేళ్ల ప్రాచీనమైందని ‘కణియన్ పుంగున్ రన్నర్’ కవితల్ని ఉటంకించిన సంగతి విస్మరిస్తే ఎలా? భారత భాషలను ఇంగ్లీషు మింగకుండా చూడాల్సిన మనం హిందీపై ద్వేషం చూపించడం ఆత్మహత్యా సదృశం.

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com