Others

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.వి.కృష్ణారావు, నాగోల్, హైదరాబాద్
ప్ర: శ్రీ విద్యలో అష్టాంగం అంటే ఏమిటి? తెలుపండి?
సమా:- శ్రీ చక్రార్చనకు సంబంధించినదే శ్రీవిద్య- నవకోణములు బిందుయుక్తమైనది శ్రీ చక్రము. బీజాక్షర సహితంగాను, బీజాక్షరాలు లేకుండాను పూజిస్తారు. శ్రీ చక్రం బ్రహ్మాండ సంకేతమని భైరవయామళ తంత్రంలోనూ, నవ చక్రమయో దేహః అని భావనోపనిషత్తులోనూ చెప్పబడింది- ప్రస్తుతం మీరడిగిన ప్రశ్నకు మాత్రమే పరిమితవౌదాం- నిగమోక్త శ్రీవిద్య పది రకాలుగా పది శక్తులుగా ‘‘మహాకాళీ నుండి కమలావరకు ఉన్నన్ని ఇందులో ఎనిమిదవ విద్య వల్గాముఖి తాంత్రిక పరిభాషలో బిగళాముఖి’’ - దీని స్థానం శ్రీచక్రంలో ‘‘సర్వాశాషరి పూరక చక్రం’’ అధర్వ అనే ప్రాణశక్తి దీనికి మూలశక్తి- ఈ చక్ర పూజవలన అణిమాద్యష్టిసిద్దులు లభిస్తాయని- దీనిని అష్టాంగ విద్యగా ఉపాసిస్తారు- ఇక హాది, కాది విద్యల్లో లోపాముద్రాదేవి ఉపాసించిన అష్టాంగ హాది విద్య-కూడా అష్టాంగంగా పిలుస్తారు- కుండలినీ అధియోగంలో కూడా అష్టాంగ యోగం ఉంది. ఇదీ సంక్షిప్తరూపం.
కె.్భస్కర్, మెహదీపట్నం (హైదరాబాద్)
ప్ర:- ఇల్లు అమ్మాలనుకుంటున్నాను- ఫలితం ఎప్పుడు.
సమా:- ముందు ‘‘తలంపు’’ ఫలితంలోనే తటపటాయింపు కనబడుతోంది- స్థిర నిశ్చయానికి వచ్చిన తరువాత ప్రశ్నించండి?
ఎమ్.గోపాలకృష్ణ, అత్తిలి (ప.గో.)
ప్ర: నా వ్యాపార జీవితం గురించి చెప్పండి-
సమా:- చేసేది ఏ వ్యాపారమో తెలుపలేదు- మీరు చెప్పిన సంఖ్యనుబట్టి ఆలోచిస్తే క్రమపద్ధతిలో మీ వ్యాపారం జరుగుతున్నట్టు కనిపించటం లేదు- అకస్మాత్తు సంఘటనలకు అవకాశం ఉంది.
పి.వెంకటేశ్వర్లు, కవలకుంట్ల, కడప
ప్ర:- నా జీవితంలో ఈ మధ్యకాలంలో మంచిరోజులు వస్తాయా?
సమా:- మధ్యకాలం అనే మాటే మీలో ఏదో సందిగ్ధత ఉన్నట్టు తెలుస్తోంది - మధ్యకాలం అంటే ఎప్పటినుండి ఎప్పటిలోగా? ప్రస్తుతం గ్రహస్థితి బాగానే ఉంది- ధైర్యంగా ముందుకు వెళ్ళండి-
కె.శ్రీనివాసులు, బాగ్‌అంబర్‌పేట్ (హైదరాబాద్)
ప్ర:- కచ్చితమైన నా జన్మరాశి ఏమిటి? భవిష్యత్తు ఏమిటి?
సమా:- కేవలం జన్మ తేదీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు- జన్మ సమయం- జన్మ స్థలం కూడా ఉండాలి.
పి.సుజాత, జనగాం (వరంగల్)
ప్ర:- ఆరోగ్యం- కుటుంబ పరిస్థితి.
సమా:- ఆరోగ్యం విషయంలో ఉదర సంబంధంగా అనారోగ్యం సూచించబడుతోంది- కుటుంబ పరిస్థితి విషయంలో స్ర్తి మూలకంగా ఇబ్బందులు- కొంత ధన నష్టమూ కనిపిస్తోంది- ప్రతి సోమవారం ఉదయం గోవును పూజించి దాణా పెట్టండి- పార్వతీపరమేశ్వరులకు మల్లెపూవుల దండ వేసి పూజించండి- శుభం జరుగుతుంది.
ఎన్.శోభారాణి, గాయత్రినగర్ (బెంగుళూర్)
ప్ర:- మేము జ్ఞాన భారతి యూనివర్సిటీ (బెంగుళూరు)లో భూమి కొన్నాము- అప్పటినుండి కొన్ని సమస్యలు మొదలయ్యాయి- ఏం చేయమంటారు.
సమా:- ఆ స్థలాన్ని వాస్తు పండితులకు చూపించండి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
భుజంగరావు, రాళ్ళకుంట, (ప.గో.)
ప్ర:- ఇల్లు ఆధునీకరణ (రిన్నొవేషన్) చేయగలనా?
సమా:- మీ కుటుంబ సభ్యులలో కొందరు మరొక విషయానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆ కారణంగా ఆలస్యం- *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ