భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహ్మద్ సిరాజుద్దీన్, గుత్తి (అనంతపురం)
ప్ర: జరగవలసింది జరగక తప్పదు కదా! ఈ జ్యోతిషం, భవిష్యత్తు తెలుసుకోవటం వల్ల ఏమి ప్రయోజనం?
సమా: ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’. దాంతో కొన్ని నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఒకరికి అనారోగ్యం కలిగితే ‘అయ్యేది కాక మానదు’అని ఊరుకుంటామా? వైద్యం చేయిస్తామా? జ్ఞానాన్ని ఉపయోగించటం మన కర్తవ్యం. ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన’ అని, ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ’ అని భగవద్గీత చెపుతోంది. ‘జ్ఞానాన్ని కలిగి ఉండటం, విజ్ఞానాన్ని సంపాదించుకొనటం’ మనిషి కర్తవ్యం. ఇస్లామిక్ సంప్రదాయంలో కూడా యవన జాతకం అనే జ్యోతిషం ఉంది.
పురిపాక లక్ష్మణస్వామి, ఖమ్మం
ప్ర: పురోహితులు చేయించే శాంతికర్మలు ఫలితాన్నిస్తాయా?
సమా: తప్పకుండా ఇస్తాయి. అయితే మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం చేసిన పూర్వకర్మల్లో అదృఢకర్మ- దృఢకర్మ, సుదృఢకర్మ అని మూడు రకాలు. అదృఢ కర్మ అంటే కర్మ యొక్క తీవ్రత తక్కువగా ఉండటం. ఇటువంటి కర్మలు శాంతికర్మల ద్వారా నివారణమవుతాయి. దృఢ, సుదృఢ కర్మలు మాత్రం అనుభవించక తప్పదు. అవి ‘నాన్ బెయిలబుల్’ కర్మలన్నమాట. పూర్వకర్మల తీవ్రత ఎంత ఉందో మనకు తెలియదు కనుక శాంతికర్మలు చేస్తూండాలి. సశాస్ర్తియంగా సమర్ధులూ, పండితులూ అయిన పురోహితుల ద్వారా చేయించాలి.
ఫిరోజాబేగం, విశాఖ
ప్ర: దీర్ఘకాలంగా ఉన్న రుణబాధలు ఎలా తీరతాయి?
సమా: గోధుమ పిండి, శర్కర, ఆవుపాలు కలిపి 108 ఉండలుగా చేసి 40 రోజులు చేపలకు వేయండి. అయితే ఆ 40 రోజులూ మీరు మాత్రం చేపలను తినకూడదు.
రమేశ్‌బాబు, చెంబూర్ (ముంబయి)
ప్ర: నేను జర్మనీలో ఉంటాను. హైదరాబాద్‌లో నాకున్న ప్లాట్ వివాదంలో ఉంది. అది నాకు దక్కుతుందా?
సమా: కొందరి వల్ల ఆటంకాలున్నాయి. ప్రభుత్వం నుండి కూడా సమస్యలున్నాయి. ఆలస్యంగా అవుతుందని ఆశిద్దాం-
ద్వివేదుల భోజన్నశాస్ర్తీ, వరంగల్
ప్ర: ఆగమాలు, నిగమాలు ఒకటేనా? వేర్వేరైతే భేదమేమిటి?
సమా: ‘నిగమము’ అంటే వేదం. జ్ఞానప్రధానమైన భాగం. ఆగమము అంటే నిగమముల నుండి వచ్చిన క్రియాశీలకమైన (ప్రాక్టికల్) జ్ఞాన భాగం. నిగమాల విషయంలో అందరి పండితుల అభిప్రాయం ఒక్కటే. ఆగమాల విషయాలలోనే శైవాగమాలని, వైష్ణవాగమాలనే తేడాలున్నాయి. ముఖ్యంగా దేవాలయాలు, పూజల విషయాల.
వలబోజు యాదగిరిచారి, యాదగిరిగుట్ట
ప్ర: నా ఇష్టదైవం శివుడు, మా క్షేత్రం యాదగిరిగుట్ట. నేను ఎవరిని ఉపాసించాలి?
సమా: ముందుగా క్షేత్రాధిదేవుణ్ణి ధ్యానించి ఇష్టదైవాన్ని ఉపాసించాలి. క్షేత్ర దేవతను విస్మరించకూడదు.
పి.రామారావు, కోటపాడు
ప్ర: మా ప్రాంతంలో పణ్యహోమ పుస్తకం దొరకటం లేదు. దయచేసి పంపించగలరా?
సమా: నేను పబ్లిషర్‌ని కాను, ఆ గ్రంథకర్తను కాను. నేను మీకు చెప్పింది వాణిజ్య కల్పవృక్షం అనే పుస్తకం, అందులో పణ్యహోమ విధానం గురించి. ఆ పుస్తకం కావలిస్తే ‘సనాతన ధర్మప్రకాశక గ్రంథమాల, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా’ అనే చిరునామాలో సంప్రదించండి.
అవసరాల రామారావు, రాజమండ్రి
ప్ర: ప్రభవ మొదలు అరవై సంవత్సరాలకు అధిపతులు, అధిదేవతల పేర్లు చెప్పండి.
సమా: అంతటి సుదీర్ఘ సమాచారం ఈ శీర్షికలో సాధ్యపడదు. ‘పూర్వగాధాలహరి’ అనే మూడు భాగాల సంకలన గ్రంథాన్ని పరిశీలించండి.
ఎస్.వి.ఆదిత్య, తుని
ప్ర: ఇల్లు కట్టుకోవడం సాధ్యం కావడం లేదు. ఏం చేయాలి?
సమా: నాలుగు సోమవారాలు సశాస్ర్తియంగా అధర్వ శీర్షగణపతి హో మం చేయించండి.
మల్లాది దయాశీల, విజయవాడ
ప్ర: యజ్ఞాలు, యాగాలు చేయటం అవసరమా?
సమా: ఏయే ప్రయోజనానికి ఆయా సత్కర్మ చేయటం మనిషి కనీస ధర్మం. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ