భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరుమామిళ్ళ రామలింగ శాస్ర్తీ - అగ్రహారం (తూ.గో.)
ప్ర:శర్మగారూ! గత వారం ఒకరి ప్రశ్నకు సమాధానం చెపుతూ దేవాలయంలో ఘంట మూడుసార్లు మ్రోగించాలన్నారు. ఘంటానాదం ఓంకారానికి సంకేతం కదా! ‘ఓమిత్యే కాక్షరం’ అంటుంది కదా వేదం. ఒక్కసారి మ్రోగిస్తేనే సరియైనదని నా అభిప్రాయం- సమాధానం చెప్పగలరు?
సమా:‘ఓమిత్యే కాక్షరం బ్రహ్మ’ అన్నది పూర్తి వాక్యం. బ్రహ్మ స్వరూప నిర్వచనంగా చెప్పబడిన మాట అది. ‘ఓం’ ప్రత్యేక ప్రణవ మంత్రంగా భావించినపుడు- ‘అ’కార- ఉ-కార మకారాలు క్రమంగా బీజం- శక్తి- కీలకాలుగా త్రిమూర్త్యాత్మకే సమాహారం- వాటికి సంకేతంగానే మూడుసార్లు మ్రోగించాలి.
బి.జయలక్ష్మి- నర్సరావుపేట (గుంటూరు)
ప్ర:నాకు ప్రభుత్వోద్యోగం వస్తుందా? మంచి రోజులు ఎప్పుడు రాగలవు-
సమా:‘జూన్’ తరువాత కొన్ని మంచి మార్పులు రాగలవు.
గోలి హరిదీప్, కాల్వలపల్లి, నల్లగొండ
ప్ర:నేను కొన్న ప్లాటులో గృహ నిర్మాణం అసలు సాధ్యం కావటంలేదు. ఎప్పుడు కాగలదు?
సమా:కొన్ని ప్రభుత్వ సంబంధమైన విషయాలు- కొన్ని మీరుగా చేస్తున్న వాయిదాలు కారణంగా కనిపిస్తున్నది- ఆలస్యంగా కొంత వృధా ధనవ్యయంతో పూర్తయ్యే సూచనలున్నాయి. ఒకసారి వాస్తు పండితునికి కూడా చూపించండి.
ఆర్.వెంకట్రావు, బరంపురం (ఒడిసా)
ప్ర:్భవిష్యత్తులో గృహ మార్పు- స్థానచలనం ఉన్నాయా?
సమా:ఆ అవకాశాలున్నాయి కాని మీ కారణంగానే ఆటంకాలు జరుగవచ్చు!
చెరుకుపల్లి రాధాకుమార్, అమ్మవారితోట, నూజివీడు
ప్ర:మా మామిడి తోట ఎప్పుడు అమ్మగలము?
సమా:సోదర సంబంధమైన బాంధవ్యం గలవారి సహకారం లభిస్తే ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది.
సారవకోట అప్పారావు, సారవకోట (శ్రీకాకుళం)
ప్ర:నూతన నిర్మాణ గృహాలకు దిష్టిబొమ్మలు- దేవతల బొమ్మలు తగిలించటం శాస్తబ్రద్ధమేనా?
సమా:దేవతల బొమ్మలు తగిలించటం శాస్త్ర విరుద్ధం. దృష్టి దోషానికి నివారణగా అనే విశ్వాసంతో కొన్ని అనాకారి బొమ్మలు తగిలించటం ఆచారంగా వస్తున్నది. అయితే గృహ ప్రవేశం తరువాత ఆ దిష్టి బొమ్మలను తొలగించాలి.
చర్ల మల్లేశ్వరరావు, కాకరపర్రు (ప.గో.)
ప్ర:వివాహం కోసం శని- శుక్ర గ్రహాలకు జప హోమాలు చేయించాము- సంవత్సరం గడిచింది. శుభకార్య సూచనలు లేవు.
సమా:వివాహానికి ‘కన్యా పాశుపతం’ అనే ప్రత్యేక విధానం ఉంది. ‘స్వయంవర కళా’ అనే యంత్ర రక్షాధారణలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఏమైనా జూన్ తరువాత కొన్ని అనుకూలాలు జరుగవచ్చు. చెప్పినవి చేయటానికి ప్రయత్నించండి.
సురేశ్, హిందూపూర్, అనంతపురం
ప్ర:వ్యాపారం మందకొడిగా సాగుతోంది. పెంపుదలకు ఏం చేయాలి?
సమా:విక్రయవృద్ధి లక్ష్మీ గణేశ యంత్రం షాపులో పెట్టుకోండి. దాని పూజా నియమాలు పాటించండి.
ఎ.ఎస్.ఆర్.క్వార్టర్స్, తిరుపతి (చిత్తూరు)
ప్ర:మా ఫ్రెండ్‌షిప్- వ్యాపార భాగస్వామ్యం బాగుంటుందా?
సమా:్భగస్వామి ఎవరో తెలియకుండా చెప్పటం సాధ్యంకాదు. పైగా మీ పేరు కూడా గోప్యంగా ఉంచారు. అన్ని చోట్లా దాపరికం సరికాదు.
కె.రాజవర్థన్, కొడంగల్ (వికరాబాద్, తెలంగాణ)
ప్ర:ఉద్యోగ యోగం ఎప్పుడు- కళారంగం భవిష్యత్తులో యోగిస్తుందా?
సమా:కళారంగ సంస్థలో ఉద్యోగ యోగం ఉంది. ప్రభుత్వ సంబంధమైన కళా- పత్రికా రంగాలలో ప్రయత్నించండి.

యల్లాప్రగడ సుబ్బారావు, విజయవాడ (కృష్ణా)
ప్ర:మా స్థలం ఇతరుల ఆక్రమణలో వున్నది. నా స్థలము నాకు వచ్చునా?
సమా:మీ స్థలం విషయంలో ప్రత్యర్థులు ఒక్కరుగా లేరు- ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. అలాగే మీ వైపునుండి కూడా స్థలంపైన మీ ఏక యాజమాన్యంగా కనిపించటంలేదు. చాలా ఆలస్యం- స్వల్పలాభం.
ఎన్.సి.సామీశ్రీనాధ్, రాజమండ్రి (తూ.గో.)
ప్ర:ఇస్రోలో జాబ్ కోసం అప్లై చేశాను. రాగలదా?
సమా:ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉండండి. జూన్‌లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం యోగదాయకంగా లేదు.
బి.రామారావు, బరంపురం (ఒడిశా)
ప్ర:్భముల అమ్మకం- డబ్బు ఎప్పుడు?
సమా: అమ్మకంలో మీ వైపునుండే ఆటంకాలు ఉన్నాయి.
ఆర్.పరశురాం, మల్కాజిగిరి (హైదరాబాద్)
ప్ర:వ్యాపారం- టిఫిన్ సెంటర్- ఆదాయం- నెలకు రెండు లక్షలు- ఖర్చు- ఆరు లక్షలు- నష్టంతో నడుపుతున్నాను. కర్తవ్యం- నివారణ చెప్పండి.
సమా:కొందరు వివాదాస్పద వ్యక్తుల కారణంగా కాని ప్రభుత్వ సంబంధమైన విషయాల కారణంగా కాని (ట్రేడ్ లైసెన్స్ వంటి విషయాలు) కారణాలుగా కనిపిస్తున్నాయి. వాస్తు విషయం అంతంత మాత్రంగానే ఉంది. యజమాని పెత్తనం కంటే పనివాళ్ళ పెత్తనం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యక్షంగా చూస్తే కాని వాస్తు వివరించలేను.
వేలూరి రవీంద్రనాధ్, మామిళ్ళగూడెం (ఖమ్మం)
ప్ర:జీవితంలో ఎదుగుదల లేదు. అనారోగ్య సమస్యలు
సమా:అనారోగ్యానికి సంబంధించినంతవరకూ గాయం కారణంగా తల భాగంలో అనారోగ్యం కనబడుతోంది. అనారోగ్యం అన్ని విషయాలమీదా ప్రభావం చేస్తుంది. ఆరోగ్యం విషయం ప్రధానంగా శ్రద్ధ వహించండి.
ఆవంచ శశిధర్, ఖైరతాబాద్ (హైదరాబాద్)
ప్ర:ఉద్యోగంలో స్థిరత్వం లేదు. ఆర్థిక సమస్యలు- వ్యసనాలకు బానిసను- పరిహారం చెప్పండి!
సమా:మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ముందుగా వ్యసనాలను మానేయండి. దైవసేవగా ప్రతిరోజు ఆంజనేయస్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అరటిపండ్లు నివేదన చేసి చీమలకు గోధుమ పిండి- శర్కర కలిపి వేయండి. ఆత్మబలం పెరుగుతుంది.
కొడకండ్ల భానుమూర్తి శర్మ - వరంగల్ (తెలంగాణ)
ప్ర:గృహ ప్రవేశములు ఎన్ని రకాలు? వాటిని వివరించండి.
సమా:ఒకటి, అపూర్వ గృహప్రవేశం అంటే పూర్తి నూతన గృహం- రెండు, సపూర్వ గృహప్రవేశం అంటే ఉన్న యింటినే మార్చినపుడు- మూడు, ద్వంద్వ గృహప్రవేశం - అంటే మరో అంతస్తు వేయటం- నాలుగు, యాత్రా గృహప్రవేశం- యాత్ర చేసి వచ్చి వెంటనే ఇంట్లోకి వెళ్లకూడదు (అంటే దీర్ఘకాలమైనప్పుడు). నాలుగింటికి వేరు వేరు ముహూర్తాలుంటాయి.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ