భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోన సునీల్‌రెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్

ప్ర: సంతాన విషయం- రాజకీయ రంగ ప్రవేశం- వ్యాపారం ఎలా వుంటుంది?
సమా: ఏదో అడగాలని అడుగుతున్నారు తప్పితే మీ ప్రశ్నల్లో సీరియస్‌నెస్ లేదు. ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రశ్నలకు ఒకదానికొకటి సంబంధం ఉందా? మొదట ఆలోచనల్లో స్థిరత్వం కలిగించుకోండి. లక్ష్యం పట్ల ఏకాగ్రత అవసరం. వట్టి ఊహలకు, నిర్మాణాత్మకమైన ఆలోచనలకూ ఉన్న భేదాన్ని గమనించండి.

ఎం.రాధ, హుజూరాబాద్ (తెలంగాణ)

ప్ర: ఊపిరితిత్తులు చెడిపోయాయి అన్నారు డాక్టర్లు. నా ఆరోగ్య పరిస్థితి చెప్పండి?
సమా: నా అభిప్రాయం ప్రకారం మీకు ఊపిరితిత్తులు చెడిపోలేదు. బహుశా కలుషితమైన నీరు ఊపిరితిత్తుల్లోకి చేరినట్టు కనిపిస్తోంది. ఆ నీటిని తీసివేసే వైద్య విధానం పెద్ద ఆసుపత్రుల్లో వుంది. ఈ అనారోగ్యం తాత్కాలికమే. ఉదరంలో ఏదైనా నొప్పి వంటిది ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకండి!

లావు సదాశివరావు, తెనాలి (గుంటూరు)

ప్ర: స్వగృహయోగం?
సమా: మీకు బెంగళూరులోనే యోగం కనిపిస్తోంది. తెనాలిలో కూడా మీకు బాగానే వుంటుంది కాని ఎక్కువగా యోగించదు. 50-50గా ఉంటుంది. ఆగ్నేయం-నైఋతి దిశలు మీకు యోగకారకాలు. ఆ దిశగా ప్రయత్నించండి.

బూదే వెంకట సురేశ్‌బాబు, నర్సారావుపేట (గుంటూరు)

ప్ర: భూసంబంధమైన వివాదం (సుదీర్ఘ లేఖ)?
సమా: సురేశ్ బాబుగారూ! మీ వైపు చట్టరీత్యా బలహీనత వుంది. మీరు రైతుల వద్దనుండి కొన్నపుడు ఈ.సి తీసుకొని ఉండవలసింది. అది మీరు చేయకుండా రైతుల చేతిలో మోసపోయారు. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు, ఈ.సి చాలా ముఖ్యం. బహుశా సంజీవబాబు గారి విచారణలో అది తేలి ఉంటుంది. రాజీ విధానంతో పోవటమే మంచిది. దైవసేవగా భూవివాదాలకు కొన్ని వైదిక తాంత్రిక పద్ధతులున్నాయి. దాని విషయం పత్రికా ముఖంగా తెలుపటం సాధ్యంకాదు. వ్యక్తిగతంగా వ్రాయండి.

ఎస్.కె.సిద్ధికీ, శ్రీకాళహస్తి (చిత్తూరు)

ప్ర: జీవితంలో స్థిరత్వం?
సమా: జన్మస్థలానికి దూరదేశంలో నైఋతి దిశలో బహుశా అరబ్ దేశాల్లో ఉద్యోగ యోగం ఉంది.

డి.పోతురాజు, అనకాపల్లి, విశాఖ

ప్ర: నాకు వ్యాపారం కలిసి రావటంలేదు. ఎప్పుడు బాగుంటుంది?
సమా: కలిసివచ్చే వ్యాపారం చేయండి! బాగుంటుంది. మెడికల్ గాని హోటల్ వంటివి ప్రయత్నించండి.

పవన్‌కుమార్, రామాలయం రోడ్, అమలాపురం

ప్ర: నేను సి.ఏ పాస్ కాలేకపోతున్నాను. పరిష్కారం చెప్పండి.
సమా: ప్రస్తుతం కొంత అనుకూలంగానే వుంది. మీకు సి.ఏ అబ్బి వచ్చే అవకాశం లేదు. ఏదైనా ఫర్నీచర్ సంబంధమైన వ్యాపారం ఆలోచించండి.

ఉపేంద్ర, అనకాపల్లి, విశాఖ

ప్ర: నాకు ఏ వ్యాపారం బాగుంటుంది?
సమా: బుక్స్- స్టేషనరీ- కాటరింగ్- చిట్‌ఫండ్ వంటివి బాగుంటాయి.

ఎస్.కోటేశ్వరరావు, నర్సారావుపేట, గుంటూరు

ప్ర: గురువుగారూ! నా వివాహం విషయంలో మీరు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. అత్తగారి నుండి స్థిరాస్తి పొలం లభించింది. అమ్మకానికి పెట్టాను. అమ్మకం కావటంలేదు. ఎప్పుడవుతుంది.
సమా: ఈ సంవత్సరం చివరలో జరిగే అవకాశం వుంది. అయితే ప్రభుత్వ మూలకంగా ఆటంకాలు ఉన్నాయి. సరిచూసుకోండి!

రెడ్డి సింహాచలం, విజయనగరం, ఆంధ్ర

ప్ర: కోచింగ్ సెంటర్ అభివృద్ధి?
సమా: వాస్తు సంబంధంగా నైఋతి దిశా ద్వారంగా కనిపిస్తోంది. పూర్తివాస్తు ప్రత్యక్షంగా చూస్తే మాత్రమే చెప్పగలను. అయితే మీకు కోచింగ్ సెంటర్ బాగా యోగిస్తుంది. ప్రస్తుతం మీకు మీ సెంటర్‌కు కూడా సమయం బాగుంది. వాస్తుదోషమే గోచరిస్తోంది. అందుకు వ్యక్తిగతంగా సంప్రదిస్తే తెలుపగలను.

అన్నవరపు శేషుబాబూరావు, వేములవారిపాడు, గుంటూరు

ప్ర: కుమార జననం- వ్యాపారంలో ఇబ్బందులు- ఋణము?
సమా: మీకు జరిగిన నష్టానికి పసివానికి ఆపాదించటం ఎంత మాత్రం న్యాయం కాదు. అ కారానికి, శ కారానికి శనైశ్చర దోషం ఘటించింది. ఆ కారణంగా జరిగి ఉంటుంది. తరువాత వ్యాపార స్థలంలో లక్ష్మీ గణేశ- కుబేర యంత్రాలు తప్పకుండా ఉండాలి. స్థానికంగా లభ్యమయితే పొందండి! కాదంటే వ్యక్తిగతంగా సంప్రదించండి.

జగతీబాయి, మల్కాజిగిరి, హైదరాబాద్

ప్ర: అమ్మాయి దాంపత్య సమస్యలు?
సమా: ప్రత్యక్షంగా వివాహ ముహూర్త దోషం కనిపిస్తోంది. కాత్యాయనీ వ్రతం చేయించండి.

ఐ.వి.సంతోష్, విశాఖపట్నం (ఆంధ్ర)

ప్ర: మా నాన్నగారు కాలం చేశారు. మా కుటుంబంలో ఇంతవరకూ ఏ శుభకార్యమూ జరుగలేదు. ఆర్థికంగా ఎదుగుదల లేదు. పరిష్కారం చెప్పండి.
సమా: ఎవరైనా స్థానిక వాస్తు పండితునితో గృహ వాస్తు పరిశీలించుకోండి. సవరణలు ఉంటే చేయండి.

రామరాజుగారి భాస్కరమూర్తి, వరంగల్, తెలంగాణ

ప్ర: గురువుగారూ! ఈమధ్యకాలంలో పిడుగులు పడటం చాలా సాధారణమైపోయింది, ఎందువలన?
సమా: పిడుగులు పడటం- వడగళ్ళు కురవటం అనాది నుండి వున్నదే. ఈ కాలంలో సమాచార సాధనాలు చాలా అనుకూలం కావటంవలన దూర ప్రాంత సంఘటనలు కూడా తెలిసి చాలా ఎక్కువైనట్టుగా తోస్తోంది. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. మానవుడు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలనే నమ్ముకుంటున్నాడు. అన్నిటికీ అతీతమైన దైవాన్ని విస్మరిస్తున్నాడు. ప్రకృతిని నియంత్రించే యజ్ఞయాగాదులు మహారాజులు చక్రవర్తులూ విరివిగా జరిపేవారు. ఇపుడు నాస్తికవాదం పెరిగిపోతూ ప్రకృతినీ, అంతరిక్షాన్ని ధిక్కరిస్తున్నాము. ఇప్పటికైనా మేలుకొనకుంటే సమస్తమూ విషపూరితంగా మారుతుంది.

ఆర్కాట్ తనూజ, ఆదోని, కర్నూలు

ప్ర: దాంపత్య జీవితంలో సమస్యలు మనశ్శాంతి లేదు?
సమా: దాంపత్య జీవితం చక్కగా ఉండాలంటే ఉన్న దానితో సంతృప్తి - సంతానం పట్ల శ్రద్ధ, లాలన - ఆలన -పాలన- భర్త విషయంలో సహన శాంతాలు- ఇరువురూ అలవరచుకోవాలి. ఇంట్లో దీపారాధన - దేవతారాధన జరుగుతూ వుండాలి.

పిన్నం రాజు అలేఖ్య, పెద్దాపురం (తూ.గో.)

ప్ర: వివాహ విషయం?
సమా: రాబోయే 9 నెలలలోపు వివాహం జరుగుతుంది. నైఋతి దిశ నుండి సంబంధమూ రాగలదు. ప- ర - ల - మ - అక్షరములు.

డి.ఎస్.ప్రసాద శర్మ, వీరవల్లి (కృష్ణా)

ప్ర: పెద్దతనం- కోరికలు-
సమా: మీ కోరిక ధర్మబద్ధమే కనుక 2018 చివరలో సానుకూలమయ్యే అవకాశం వుంది.

శెట్టిపల్లి సూర్యారావు, వీరులపాడు (కృష్ణా)

ప్ర: భూమి అమ్మకం?
సమా: రాబోయే ఆరు నెలల్లో అమ్మకమవుతుంది.

జయమాలిని, సికింద్రాబాద్, మారేడుపల్లి

ప్ర: శర్మగారూ! నేను జయమాలిని అనే విషయంగా (జగతీబాయిని) మిమ్మల్ని ప్రశ్నించాను. మీరు జలగ్రహదోషం నీటి ప్రమాదం జరిగి ఉండాలి అన్నారు. నిజంగానే ఆ అమ్మాయి నీటి కాలువలో పడితే ఒక అబ్బాయి రక్షించాడు. మా కుటుంబ సభ్యులకు కూడా తెలియని విషయం మీరు తెలుపటం ఆశ్చర్యమే. అయితే ఆమె మానసిక స్థితి బాగుపడటానికి మార్గం చెప్పండి.
సమా: రాబోయే కార్తీకమాసంలో ప్రతి సోమవారం తులసి చెట్టుకు- ఉసిరిక చెట్టుకు దీపాలు వెలిగించాలి. అలాగే సంధ్యాకాలంలో పవిత్రమైన నదిలో కార్తీక దీపం వదలాలి. శుభం జరుగుతుంది.

గోదా సుబాలయ్య, రామన్నపేట, యాదాద్రి, భువనగిరి, తెలంగాణ

ప్ర:దైవిక- సామాజిక- సేవా కార్యక్రమాలు...!
సమా:మీకు హృదయ పూర్వకమైన అభినందనలు బాలయ్యగారూ. ఈ వయసులో కూడా మీరు చేసినవి చేస్తున్నవి గొప్ప పనులు. మునుముందు కూడా మీ సంకల్పం జయప్రదంగా నెరవేరుతుంది. అభినందనలు.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.

umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ