భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సయ్యద్ బషీర్‌బాబా - బాన్స్‌వాడ (తెలంగాణ)
ప్ర: పంతులుగారూ! నాకీ తెల్గూ బాగా రాద్ సార్- కానీ అభిమానం ఉండి మా దోస్త్ కాడ ‘ఆంధ్రభూమి’లో మీ భవిష్యకాలం చదివిపిస్తా. నాకీ మీరంటే అభిమానం ఉంది. నాకీ ఉన్న సమస్య ‘గరీబీ’- గరీబీ పోవాలంటే ఏం చేయాలి?
సమా: బషీర్ బాబాగారూ! ఉర్దూలో ఒక మంచి సామెత ఉంది. అదేమిటంటే ‘గరీబ్ హోనా జుర్మ్ నహీ- గరీబీకూ నుమాయిష్ కర్నా జుర్మ్ హై’- పేదరికం తక్కువతనం కాదు- అరబిక్ చరిత్రలో ‘హాతీంతాయి’ కథ చదవండి. చేపలకూ- పావురాళ్ళకూ- ఆవులకూ- నల్లకుక్కలకూ - నల్ల పిల్లులకూ దాణా పెడుతూ ఉండండి. గరీబీ దూరం అవుతుంది.
పోతరాజు రామన్న, రామన్నపేట (యాదాద్రి, భువనగిరి)
ప్ర: బి.ఎస్.సి (టిఆర్‌టి)లో విజయం వస్తుందా?
సమా: అనుకూలంగానే ఉంది. గట్టిగా ప్రయత్నించండి.
షేక్ జాఫర్, సుందర్‌నగర్, ఆదిలాబాద్ (తెలంగాణ)
ప్ర: టైఫాయిడ్ అనారోగ్యం- డిప్రెషన్- భయం- ఏదీ కలసి రావటంలేదు. నిజం చెప్పినందుకు శత్రుత్వాలు వచ్చినయి- వ్యాపారంలో నష్టాలు- దయచేసి పరిష్కారం చెప్పండి?
సమా: జాఫర్‌గారూ! హోస్లా రఖో- హిమ్మత్ కె సాత్ సాత్ హిక్మత్- బీ హోనా చాహియే- ముందుగా మీ ఆరోగ్యం బాగుచేసుకోండి. టైఫాయిడ్ ఒకప్పుడు ప్రమాదకరం కానీ ఇప్పుడు వైద్య చికిత్సలు చాలా ఉన్నాయి. చాలావరకు నీటి కాలుష్యంవలన ఈ రోగం వస్తుందని వైద్యశాస్త్రం చెపుతున్నది. దీనే్న తెలుగులో సన్నిపాత జ్వరం- పేగు జ్వరము అంటారు. హోమియోలో దీనికి మంచి మందులున్నాయి. ‘బాస్టీషియం’ బ్రయోనియా- బెల్లడోనా- రూప్‌టాక్స్ వంటివి బాగా పనిచేస్తాయి. అయితే మీకు ఏవి కావాలో డాక్టరు చేత నిర్థారించుకోండి. వాడండి. దైవసేవగా ‘అజ్మీర్ దర్గా’కు మొక్కండి. మత పట్టింపు లేకపోతే మీకు దగ్గరలోనే ‘లింబాద్రి నరసింహ స్వామి’కి పానకం - వడపప్పు పంపించండి.
బలివాడా లక్ష్మీదేవి, రణస్థలం, శ్రీకాకుళం
ప్ర: సుదీర్ఘ లేఖ- ఆత్మఘోష- అన్నీ బాగానే ఉన్నాయి. ఆత్మకు శాంతి లేదు.
సమా: లక్ష్మీదేవిగారూ! మీది మానసిక సమస్య. ప్రతి విషయాన్నీ అనుమానంతోనూ- అపజయ భావంతోనూ చూడటం అలవాటు చేసుకున్నారు. ప్రతి విషయంలోనూ, ఇతరులతో పోల్చుకుంటున్నారు. అది మానేయండి. ఆత్మవిశ్వాసం కోసం ఆంజనేయస్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రతి వారికీ వారి వారి సమస్యలుంటాయి. అంతా సుఖపడిపోతున్నారు, నేను మాత్రం కష్టపడుతున్నాను అనుకోకండి. ఒకవేళ ఇంటి ముఖ ద్వారం దక్షిణం అన్నారు కనుక ఏమైనా ఆగ్నేయ దోషం ఉంటే ఉండవచ్చు. వాస్తు పండితులకు చూపించండి. మీ అమ్మాయి భవిష్యత్తు బాగానే ఉంటుంది.
కె.బంగార్రాజు, దెందులూరు, ఆంధ్ర
ప్ర: ఉమ్మడి కుటుంబం- తోబుట్టువులతో ఇబ్బందులు- జాగ్రత్తగానే ఉంటాను. మీ సలహా మీద గురి ఉంది. మీ సలహా కావాలి?
సమా: బంధువులతో అభిప్రాయ భేదాలు వస్తే వౌనంగా ఉండాలని- పరోక్షంగా పరులముందు ప్రతివిమర్శలు చేయొద్దని మన నీతి శాస్త్రం చెపుతున్నది. అవి పాటించండి.
ఎ.వెంకటరమణ, మదనపల్లె, చిత్తూరు
ప్ర: నేను చాలా కష్టపడి చదువుకున్నాను. పిల్లల్ని చదివించాను. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుచేసి ఇల్లు కట్టాను. అప్పుచేసి పెళ్లిళ్ళు చేయాలి. అందరిలాగా నేనూ సుఖంగా ఉండాలనుకుంటున్నాను. కాని వీలు కావటంలేదు. మీ సలహాలమీద నాకు విశ్వాసం చాలా ఉంది. దయచేసి పరిష్కారం చెప్పండి.
సమా: వెంకటరమణగారూ! మొదట లోకమంతా సుఖంగా ఉంది, నేను సుఖంగా లేను అనే ఆలోచన మనసులోనుండి చెరిపివేయండి. ఉన్నంతలో మీరు బాగానే సాధించారు. అప్పులంటారా? అందరికీ ఎంతో కొంత అప్పు ఉండనే ఉంటుంది. ‘బయట పల్లకీ మోత - ఇంట్ల ఈగల మోత’ వంటి వారి జీవితాలను చూసి భ్రమపడకండి. ఇంట్లో దేవతారాధన- దీపారాధన చేస్తూ ఉంటే అంతా శుభమే.
వి.వెంకటరెడ్డి, రావులపాలెం (ఆంధ్ర)
ప్ర: వివాహం ఎపుడు?
సమా: జాతకంలో కుజ- శుక్ర దోషాలున్నాయి. నివారణగా మంగళవారం దుర్గా పూజ- శుక్రవారం లలితా పరమేశ్వరిని ఆరాధించండి.
వి.శ్రీదేవి, తెనాలి (గుంటూరు)
ప్ర: సంతానానికి విద్యాభివృద్ధి?
సమా: తెలంగాణాలో నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర క్షేత్రం. చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం దర్శించండి. అమ్మాయికి అమ్మవారి కుంకుమ ప్రసాదం (మీరు అర్చన చేయించిన ప్రసాదం తినిపించండి)- లేదంటే కర్నాటకలో మూకాంబికా క్షేత్రమైనా దర్శించండి. మార్పు రాగలదు.
పేరు, చిరునామా తెలుపటం ఇష్టంలేదు
ప్ర: గతంలో నేను చేసిన పొరపాటు కారణంగా ఒక వ్యక్తి ‘బ్లాక్ మెయిలింగ్’కు గురి అవుతున్నాను. ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుందామా అనిపిస్తోంది. దయచేసి అతని నుండి బాధ తప్పే మార్గం పరిష్కారం చెప్పండి.
సమా: లోగడ మీ ప్రశ్నకు సమాధానం చెప్పాను. మీరు గమనించినట్లు లేదు. ప్రతి ఆదివారం ఆంజనేయస్వామికి తెల్ల జిల్లేడు పూలతో మన్యుసూక్త పారాయణముతో అభిషేకం చేయించి అరటిపండ్లు- తేనె నైవేద్యం పెట్టించి పిల్లలకు పంచి పెట్టండి. ప్రతి మంగళవారం నిమ్మకాయల దండ ఎర్రదారంతో కూర్చి, ఎర్రగనే్నరు పూలతో దుర్గాదేవిని పూజించండి. సమస్య పరిష్కారం కాగలదు.
పి.మణికంఠ, పెదకాకాని (గుంటూరు)
ప్ర: మా బాబుకు ‘ఆస్త్మా’ చాలా ఇబ్బంది పడుతున్నాం. పరిష్కారం చెప్పండి.
సమా: హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ వాళ్ళ చేత చేప మందు వేయించండి. మామూలుగా ఇంట్లో అయితే ఆయుర్వేదం ‘వాసకంటకారి లేహ్యం’ వాడండి. ప్రమాదం కాని మందు. డోస్ మాత్రం డాక్టర్ని అడగండి.
విస్సాప్రెగడ వెంకట సుబ్బారావు, శీతంపేట- రాజమండ్రి
ప్ర: కాలేయ సమస్య - పరిష్కారం చెప్పండి.
సమా: కేవలం కాలేయ సమస్యనే కాదు- మరికొన్ని స్పెషలిస్ట్‌లు చెప్పగలిగే సమస్యలు కూడా కనబడుతున్నాయి. ఒకసారి పూర్తి చెక్ అప్ చేయించుకోండి.
గోన సునీల్‌రెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర: సంతాన సమస్య?
సమా:దంపతుల ఇద్దరి జాతకాలు పరిశీలించాలి.
శైలజ, హిందూపూర్ (ఆంధ్ర)
ప్ర: మనోబలానికి ఏం చేయాలి?
సమా: ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేయండి.
కర్రెడ్ల వెంకట సూర్యనారాయణ, కొల్లూరు, గుంటూరు
ప్ర: మా వంశంలో ఈ తరంలో పురుషులెవరికీ పెండ్లిళ్ళు కాలేదు. నేను నాల్గవవాడిని. కారణం ఏమిటి? పరిష్కారం ఏమిటి?
సమా: పుణ్య స్ర్తి శాపం కాని- స్ర్తి దేవతా దోషం కాని - శే్వతనాగిని చంపిన దోషం కాని ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానికి శివలింగ ప్రతిష్ఠే పరిష్కారం- వీలయితే స్వతంత్రంగా శివనాగేశ్వర ప్రతిష్ఠ చేయండి. లేదంటే విశాఖపట్నంలో సిద్ధ గురు రమణానంద ఋషిగారి సహస్ర లింగ దేవతా ప్రతిష్ఠతో పాలు పంచుకోండి.
ఎన్.సి.పార్వతీదేవి, రాజమండ్రి (తూ.గో.)
ప్ర: ఆర్థికాభివృద్ధి- స్వంత యిల్లు- దత్తత ఆస్తి రావటం?
సమా: ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు ఉత్తర దిశగా వెలిగేట్టు ఆవు నెయ్యితో దీపం వెలిగించి బూందీ లడ్డూ కాని కోవా పేడాలు కాని నివేదన చేసి చిన్న పిల్లలకు పంచి పెట్టండి. దత్తత సమస్య గురించి లాయర్ చెప్పవలసిన పరిష్కారం
చర్ల మల్లీశ్వరరావు, కాకరపర్రు (ప.గో.)
ప్ర: వాస్తు దోషాల ఇల్లు మార్చి కట్టే స్తోమత లేదు. పరిష్కారం చెప్పండి.
సమా: వాస్తు సరిగా వున్న అద్దె ఇంటికి మారండి. లేదా ఉన్న ఇంట్లోనే వాస్తు సంబంధమైన యంత్రాలు ప్రతిష్ఠించుకోండి.
ఎ.సుధారాణి, ఉండి (ప.గో.)
ప్ర: నేను బి.టెక్ చదివాను. సాఫ్ట్‌వేర్ కోర్స్ చేయాలనుకుంటున్నాను. బాగుంటుందా?
సమా: బాగానే వుంటుంది- ప్రయత్నించండి.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ