భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాప్రెగడ రాజ్యలక్ష్మి (ప్రసిద్ధరచయిత్రి), హైదరాబాద్
ప్ర: శర్మగారూ! భవిష్య కాలంలో మీ సమాధానాలు బాగుంటున్నాయి. నా సందేహానికి సమాధానం చెప్పండి. వివాహ సమయంలో వధూ వరులకు అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? కేవలం సంప్రదాయమా?- శాస్త్ర ప్రాధాన్యం ఉన్నదా?
సమా: మంచి ప్రశ్న వేశారు రాజ్యలక్ష్మి గారూ!. మన హైందవ సంప్రదాయం ప్రతీదీ శాస్త్ర ప్రాధాన్యం కలిగినదే. అరుంధతీ నక్షత్రం ఖగోళ పరిణామానికి సంబంధం ఉంది. సృష్టికర్తయైన బ్రహ్మకు పుత్రికగా సంధ్యాదేవి జన్మించింది. ఆ సంధ్యను పురోడాశంగా అగ్నిలో ప్రేలిస్తే ప్రాతస్సంధ్య-సాయం సంద్యలూ-అరుంధతీ అనే ఒక కాంత ఏర్పడ్డాయి. దానికి కారకుడు వశిష్ఠుడు. వశిష్ఠ నక్షత్రం ఆకాశంలో సప్తర్షి మండలంలో కనిపిస్తుంది. దాని ప్రక్కనే అరుంధతీ నక్షత్రం మినుకుమినుకుమంటూ ప్రకాశిస్తుంది. ఇది ఖగోళ పరిణామం-శాస్త్ర సంబంధం.
రెండవది ఆదర్శంగా అరుంధతీ దేవి మహా పతివ్రత. (సీతారుంధత్యాది మహా పతివ్రతానాం అని వివాస మంత్ర చూర్ణికలో చదువుతారు)-
మూడవ కారణం: అరుంధతీ నక్షత్రం చూడలేని వారికి ఆయుర్ధాయ సంబంధంగా రుగ్మతలుంటాయని శాస్త్ర వాక్యం-ఇది లౌకిక ప్రయోజనం-ఇందుకు ప్రమాణాలున్నాయి.
శ్రీమతి జగదీగణేశ్‌రావు, మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర: నేను శుక్రవారంనాడు డబ్బులు దానం చేసాను. ఇంట్లో పది రోజుల్లో బంగారు గొలుసు పోయింది.శుక్రవారం దానం చేసిన దోషమా?
సమా: డబ్బు దానానికి ఏ నియమ నిబంధనలు లేవు. ఎప్పుడైనా దానం చేయవచ్చు! అయితే ధాన్య సంబంధమైతే పితృకార్యదినమైతే పితృ కార్య దినం నాడు చేయకూడదు. పితృకార్యమైన తరువాత చేయాలి. ధనం దానం చేయడానికి ఏ నియమాలూ లేవు.
ఇంట్లో బంగారు గొలుసు పోవడానికి దానికీ సంబంధం లేదు. మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీ గొలుసు పరాయి వారి చేతికి వెళ్లినట్టు లేదు.
పీసుపాటి సాయిదీప్తి, ఏలూరు, ప.గో
ప్ర: నాకు బ్యాంకు ఉద్యోగ యోగం ఉందా? ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందా?
సమా: ప్రత్యేకంగా బాంకింగ్ అని చెప్పడానికి వీలు లేదు. గవర్నమెంటు ఉద్యోగం అవకాశాలు వున్నాయి. అర్హతలు కూడా ముఖ్యం మరి.
కె.వి.వి.ఎస్.ఎన్.వర్మ, మట్టపల్లి, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర: స్థలం విషయంలో ఇచ్చిన డబ్బులు వాపసు రాగలదా?
సమా: అతి కష్టంమీద కొంత మాత్రం వచ్చే అవకాశం ఉంది.
పి.బదరీ నారాయణ, విజయవాడ, కృష్ణా
ప్ర: నాకు బ్యాంక్‌లోన్ వస్తుందా?
సమా: పూర్తి అవకాశాలున్నాయి. బహుశా ఇప్పటికే ఆ విషయంగా పాసిటివ్ సూచనలు గోచరించి ఉండాలి.
ఎమ్.కుమారి, విజయవాడ, కృష్ణా
ప్ర: థైరాయిడ్ వల్ల బాధపడుతున్నాను. ఇది ఏ గ్రహ దోషం వలన?
సమా: ‘శరీరం వ్యాధి మందిరం’ అన్నది శాస్త్ర వాక్యం. ప్రతి వారికీ ఏవో రుగ్మతలుంటునే వుంటాయి. అయితే స్ర్తిలకు ముఖ్యంగా పసుపు రుద్దుకోవడం ఇలాంటి సమస్యలు రాకుండా వుండడానికే. కానీ ఆధునికత కారణంగా అలాంటి సంప్రదాయాలు అదృశ్యమైపోయాయి. ఇప్పటికైనా మీరు నాణ్యమైన పసుపు, వేపనూనె కలిపి మెడ చుట్టు రాయండి. కొన్నాళ్లకు మంచి ఫలితం కనబడుతుంది.
పి.కనకరాజు, విజయనగరం, ఆంధ్రప్రదేశ్
ప్ర: ఆర్థిక ఇబ్బందులు-పెద్దబ్బాయి దూర ప్రాంతంలో-చిన్నబ్బాయి భవిష్యత్తు గురించి ఆందోళన?
సమా: ఇందులో ఆందోళన పడవలసినదేముంది. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉండేదే. పెద్దబ్బాయి దూర దేశంలో వుండడం మీరంతా నిర్ణయించుకున్నదే కదా! ఒకటి కావాలి అనుకున్నప్పుడు మరొకటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి.
సచిన్, జయపూర్, రాజస్థాన్
ప్ర: నాకు 2018 ఎలా ఉంటుంది?
సమా: గొప్ప క్రికెటర్ పేరు పెట్టుకున్నారు. పేరురీత్యా మీది కుంభరాశి. 2018 మధ్య భాగం వరకు మీకు చాలా బాగుంటుంది. ఆ తరువాత చివరి వరకూ బాగానే వుంటుంది.
అలజింగి మహేశ్, గాజువాక, వైజాగ్
ప్ర: నాకు పోలీస్ శాఖలో చేరాలని కోరిక నేరవేరుతుందా?
సమా: మీ ఆదర్శం చాలా మంచిదే. అయితే ఆ ఉద్యోగానికి కేవలం విద్యార్హతలే కాదు శారీరక సౌష్ఠవం కూడా వుండాలి. గట్టిగా ప్రయత్నించండి. ఫలించగలదు.
కె.వి.దుర్గామోహనరావు, వనస్థలిపురం, హైదరాబాద్
ప్ర: మనుమని ఆరోగ్యం-సుదీర్ఘ లేఖ.
సమా: యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి కొండమీద నలభై రోజులు వుండి స్వామికి సేవ చేయండి. శుభం కలుగును.
చాట్ల వెంకటేశ్వర్లు, చీమకుర్తి ప్రకాశం
ప్ర: నేను వ్యాపారం చేసినా కలిసి రావడంలేదు ఏం చేయమంటారు?
సమా: ఏదైనా ఉద్యోగం చేయండి కొన్నాళ్లు.
జోసెఫ్ పరిమళరావు, విజయవాడ, కృష్ణా
ప్ర: ఒక మంచి క్రిస్టియన్‌గా జీవించాలని, బాగా డబ్బు సంపాదించాలని నా కోరిక. ఫలిస్తుందా?
సమా: మంచి క్రిస్టియన్‌గా జీవించాలనేది మంచి ఆదర్శమే. బాగా డబ్బు సంపాదించాలని ఎందుకనుకుంటున్నారు. ‘్ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుటకన్నా ఒంటి సూది బెజ్జమును దూరుట సులభము’ అన్న ప్రభువు మాటలు మీకు తెలియదా? మీ రెండు కోరికలూ ఒకదానికొకటి విరుద్ధమైనవి.
పిన్నని అనిల్‌కుమార్, సూర్యాపేట,తెలంగాణ
ప్ర: సార్! నాకు పోలీస్ జాబ్ దొరికే అవకాశం ఉందా?
సమా: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీకు పోలీసు ఉద్యోగ యోగం కనిపించడంలేదు. ఏదైనా వ్యాపార సంబంధంగా మీకు యోగిస్తుంది. భవిష్యత్తు బాగుంది.
ఎ.ఉషారాణి, మైలవరం, కృష్ణా
ప్ర: మా బాబు వివాహం ఎపుడు?
సమా: రానున్న ఆరు నెలల్లో మీ బాబు వివాహ యోగం కలదు. ర-ప-మ-ల-వ అక్షరాలు- నైరుతి దిశనుండి యోగం.
సి. భాస్కర శాస్ర్తీ, పుట్లగట్లగూడెం, ఆంధ్ర
ప్ర: బంధువులతో రాజీ ప్రయత్నం ఎంత ప్రయత్నించినా వారు ముందుకు రావడం లేదు. ఏం చెయ్యమంటారు?
సమా: సమస్యను కాలానికి వదిలేయండి. మీరు నిర్లిప్తంగా వుండండి. వారే ముందుకు వస్తారు.
మహ్మద్ జహీరుద్దీన్, సంగారెడ్డి, తెలంగాణ
ప్ర: శాస్ర్తి సాబ్, మీరు చెప్పింది చెప్పినట్టుగా సమస్య పరిష్కారం అయింది. స్నేహ పూర్వకంగా నాకు అనుకూలంగానే మీరు చెప్పినట్టు జరిగింది. షుక్రియా ఆదాకరతాహూ- త్వరలోనే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుస్తాను. సంగారెడ్డి ఆహ్వానిస్తాను.
సమా: చాలా సంతోషం. అయితే రాజకీయ సంబంధమైన సభలకు నేను రాలేను.
టి.లక్ష్మీ గాయత్రి, చీరాల, ప్రకాశం
ప్ర: ఋణ బాధలు, అనారోగ్యాలు. పరిష్కారం చెప్పండి
సమా: ఇంటి వాస్తు సరి చూసుకోండి. అద్దె ఇల్లయితే మంచి ఇంటికి మారండి.ఇంట్లో ఉదయం సాయంత్రం వేళ ప్రకారం కనీసం రెండు గంటలు వెలిగేవిధంగా దేవుడి ముందు దీపారాధన చేస్తూ వుండండి.
చిలకా వెంకట్రావు, చిన్నకండ్లకుంట, ప్రకాశం
ప్ర: నాకు ప్రభుత్వోద్యోగ యోగముందా?
సమా: మీకు ప్రభుత్వ సంబంధమైన శాఖల్లో తాత్కాలిక ప్రాతిపదికమీద ఉద్యోగం దొరకవచ్చు. ప్రైవేటు వుద్యోగం ముఖ్యంగా నగల దుకాణాల్లో ఉద్యోగం దొరకగలదు.
కొంగర వెంకటరాజు, ఖాజీపేట, తెలంగాణ
ప్ర: ఎగ్జిమా వంటి వ్యాధులను నయం చేసే మంత్రం ఉందా?
సమా: మంత్రాలతో వ్యాధులు నయం కావు. అంతటి తపశ్శక్తి ఈ కాలంలో జరగదు. బాసర క్షేత్రానికి పొయ్యే దారిలో బోధన్ రూటులో నృసింహ స్వామి క్షేత్రం ఉంది. అక్కడి కోనేటి నీరు అనేక వ్యాధులను నయం చేస్తుందనే కీర్తి వుంది. అక్కడ స్నానం చేయండి.
మంచి డాక్టర్ సలహాతో కాడ్‌లివర్ ఆయిల్ మందుగా వాడండి.పైపూతగా వేపనూనె పసుపు వెల్లుల్లి రసం కలిపి ఒంటికి పూసుకుని గంటసేపటి తరువాత స్నానం చేయండి.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ