భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లభజోస్యుల భావనారాయణ, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: శర్మగారూ! గత వారం ఒక ప్రశ్నకు సమాధానంగా మనో విజ్ఞాన తత్వాన్ని, మన ధర్మాన్ని గురించి బాగా చెప్పారు. ప్రామాణికమైన ఉదాహరణలు చెప్పగలరా?
సమా: ప్రామాణికమైన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఉదా భద్రం, కర్ణే భిః శృణు యామ దేవాః... దేవహితం యదాయుః అనే వేద మంత్రంలోని అర్థం మనస్సు పవిత్రతను గురించి చెప్పేదే- అంతేకాదు- విశే్లషిస్తే అవతారాల సందర్భంలోనూ మనోవిజ్ఞానం దాగి ఉంది- సనక సనందన ఋషుల చేత శపించబడిన జయ విజయులను శ్రీ మహావిష్ణువు ఏమని అడుగుతాడో గమనించండి!- తక్కువ జన్మలెత్తి నాతో శతృత్వం వహించి నాచేత మరణించి విముక్తులై నా దగ్గరకు వస్తారా? లేక ఎక్కువ జన్మలెత్తి మిత్రులై ఉంటారా అంటాడు- అంటే శతృభావం మనస్సు మీద బాగా ప్రభావం చేస్తుంది. అలాగే హిరణ్యకశిపుని విష్ణు ద్వేషమే పరిణామక్రమంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదునిగా పరిణమించింది. ఆధునికంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పింది అదే- యో జూళఒజూళ యూ ద్ఘఆళజూ ష్ఘశ ఇళ ఒఖఔఔళఒఒళజూ జచి క్యఖ ఆక ఆ్య ఒఖఔఔళఒఒ జఆ, జఆ త్యీఖజూ ఇళ ష్యౄళ్యఖఆ తీజఆ్ద జ్యూఖఇళజూ ఆ్దళ చ్యిషళ అందుకే తీవ్రమైన రాగద్వేషాలు మనిషికి కూడదు.
బి.సత్యనారాయణ - అంబాజిపేట (తూ.గో.)
ప్ర: గురువుగారూ! లోగడ నా ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానాలు చాలా సంతృప్తినిచ్చాయి. ప్రస్తుతం నేను పాడి పశువులను పోషించాలనుకుంటున్నాను. నాకు యోగిస్తుందా? ఆరోగ్య రీత్యా అడుగుతున్నాను?
సమా: చక్కగా యోగిస్తుంది. ముఖ్యంగా గోవులను కపిల ధేనువులను పోషించండి. గోవుల గిట్టల దుమ్ము పారితేనే ఎన్నో రోగాలు దూరమవుతాయని, శుభం జరుగుతుందని రఘు వంశ కావ్యంలో మహాకవి కాళిదాసు చెప్పాడు. గోసేవ వలన మీ ఆరోగ్యమూ కుదుటపడుతుంది. సమాజానికి పాడినందించి మేలు చేసినవారవుతారు.
వారణాసి కాళీవరప్రసాద్, బుగ్గపట్నం (ఆంధ్ర)
ప్ర: ఈ కాలంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి, కారణమేమిటి?
సమా: ధాన్యలక్ష్మిని ప్రేమించాల్సిన రైతులు ధనలక్ష్మి వ్యామోహంలో పడుతున్నారు. అధిక దిగుబడుల కోసం కృత్రిమ ఎరువులతో (అందులోనూ కల్తీవి) ఎక్కువసార్లు పంట వేసి అది కూడా ‘కాష్ క్రాప్స్’- భూసారాన్ని పోగొట్టుకుంటున్నారు. దానివలన నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రాణాలమీదకు వస్తున్నాయి.
జక్కా చెంచురామయ్య, నరసరావుపేట, గుంటూరు
ప్ర: కుమారుని సి.ఏ ఫలితం గురించి చెప్పండి?
సమా: ప్రస్తుత ప్రయత్నంలో ఫలితం సందేహమే- మరో ప్రయత్నం అవసరవౌతుందేమో?
కొమ్మూరు రవికుమార్, పసుమర్ర, గుంటూరు
ప్ర: స్వామీ- నాకు పసుమర్ర యోగిస్తుందా? చిలకలూరిపేటా? కట్టబోయే ఇంటి స్థలం మాప్ పంపినాను. ఎలా ఉంటుంది చెప్పండి?
సమా: చిలకలూరిపేట- పసుమర్ర- ఈ రెండూ మీకు యోగకారకం కావు. ‘న, మ, క, హం’ అనే అక్షరాలు గల ఊరు బాగుంటుంది. (మొదటగా) కనీసం మీ ఇంటి పేరైనా ఆ అక్షరాలతో పెట్టండి. స్థలవాస్తు ప్రత్యక్షంగా చూడనిది చెప్పలేను. స్థానిక పండితులను సంప్రదించండి.
వనె్నలగంటి పూర్ణచంద్రరావు, తెనాలి, గుంటూరు
ప్ర: నూతన స్వగృహ యోగం ఎపుడు?
సమా: 2018లో స్ర్తి సహాయంతో స్వగృహ యోగం కలిగే అవకాశం ఉంది-
బి.నీహారిక, అనంతపురం (ఆంధ్ర)
ప్ర: ప్రభుత్వోద్యోగం వస్తుందా?
సమా: మీరున్న ప్రదేశం నుండి ఆగ్నేయ దిశలో దూరంగా మరో పట్టణంలో ప్రభుత్వోద్యోగ యోగం కలుగుతుంది. కాని మీరే వెళ్ళరేమో?
కె.్భషణ్‌రావు, కొత్తపల్లి
ప్ర: గుడి కట్టించాం- కండిగలమ్మ తల్లి దేవత ప్రతిష్ఠించాం. మాకు కష్టాలు మొదలయ్యాయి. పరిష్కారం చూపండి?
సమా:గుడి స్థలము వాయువ్య దోషము కనిపిస్తోంది. ప్రతిష్ఠా - యంత్ర నిర్మాణంలో కూడా లోపాలు జరిగినట్టున్నాయి.
కె.బాలసత్యనారాయణమూర్తి- విజయవాడ (కృష్ణా)
ప్ర: తొమ్మిది సంవత్సరాలుగా బట్టల వ్యాపారం చేస్తున్నాను. అభివృద్ధి లేదు. ఏం చేయమంటారు?
సమా: మీ వ్యాపార సంస్థ పేరు- మీకు వ్యయ స్థానంలో ఉంది - పేరు మార్చాలి.
ఎమ్.వసుమతి- నర్సరావుపేట, గుంటూరు
ప్ర: దాంపత్య సమస్యకు పరిష్కారం?
సమా: ఎవరో మూడవ వ్యక్తి (స్ర్తి) ప్రమేయము కనిపిస్తున్నది- పత్రికా ముఖంగా అన్ని వివరములు చెప్పలేను.
వాసు- విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: గురునాథస్వామి అంటే ఎవరు? గురునాథస్వామి వ్రతం ఏమిటి?
సమా: దత్తాత్రేయస్వామికే గురునాథుడని, గురురాజని పేర్లున్నాయి. దత్తాత్రేయ వ్రతంగానే అనఘాదేవి వ్రతం చెప్పుకొంటారు. ప్రాంత భేదాన్ని బట్టి మార్పు ఉంటే చెప్పలేను.
భాస్కర్ల శర్మిష్ఠ, సైనిక్‌పురి, సికాంద్రాబాద్
ప్ర: నాకు ప్రభుత్వోద్యోగం వస్తుందా? నేను డెంటల్ సర్జన్ చేశాను.
సమా: దూర దేశంలో వచ్చే అవకాశం ఉంది. మరో రాష్ట్రంలో.
వై.శ్రీనివాసరావు, డాంగేనగర్, జగ్గయ్యపేట (కృష్ణా)
ప్ర: శర్మగారూ! పడమర ముఖంగల స్థలం కొన్నాం. ఇల్లు కట్టుకోవచ్చా? ప్రభుత్వ గృహం వచ్చే అవకాశం ఉందా?
సమా: పడమర ముఖమైన సింహద్వారం పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎదురుగా మరో ఇల్లు ఉండటం కూడా మంచిదే. మీకు ప్రభుత్వం నుండి కూడా గృహయోగం ఉంది. స్ర్తి సహాయంగా ఉన్నతి.
జి.ఎస్.ఎస్.మహాలక్ష్మి, ఊరి పేరు లేదు - తెలంగాణ
ప్ర: ప్రభుత్వోద్యోగం వస్తుందా?
సమా: కుటుంబ సభ్యులలో కొందరి వ్యతిరేకత కారణంగా అవకాశం లేదు. విద్యార్హత సంపాదనలో కూడా ఆటంకాలు కనపడుతున్నాయి.
గీతాశ్రీప్రియ, పెందుర్తి, విశాఖపట్నం
ప్ర: వివాహ యోగం ఎపుడు?
సమా: 2018లో మధ్యభాగంలో వివాహయోగం రాగలదు.
పమ్మి సూర్యనారాయణ, నిడదవోలు, (ప.గో.)
ప్ర: పునర్వివాహం ఎప్పుడు?
సమా: 2018 ఆగస్టులో అవకాశం రాగలదు.
కోలా కాశయ్య, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: అనేక సమస్యలు- పరిష్కారం చెప్పండి?
సమా: అన్ని సమస్యలకూ పత్రికా ముఖంగా పరిష్కారం చెప్పటం కుదరదు- స్థానికులే కనుక వీలయితే వ్యక్తిగతంగా కలవండి!
బలివాడ శివప్రసాద్, అరసవల్లి, శ్రీకాకుళం
ప్ర: ప్రస్తుతం విలేఖరిగా పనిచేస్తున్నాను. భవిష్యత్తులో స్థిరపడగలనా? నాకు ఏ వ్యాపారం బాగుంటుంది.
సమా: పత్రికా రంగంలో బాగా కృషి చేయండి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కానీ-క్యాంటీన్ల సంబంధం- కాటరింగ్- స్వగృహ ఫుడ్స్ వంటివి లాభిస్తాయి.
ఎస్.రమేశ్, కుప్పం, చిత్తూర్
ప్ర: నాకు వ్యవసాయమా? వ్యాపారమా? ఏది యోగించును.
సమా: వ్యవసాయమే- వరి- ఫలవృక్షాలు - ధాన్యాలు ప్రస్తుతం అనుకూలమే, ప్రారంభించండి!
ఎమ్.జయశ్రీ, కైకరం (ప.గో.)
ప్ర: నవగ్రహ దోషాలకు పండితులు చాలా మార్గాలు చెప్పారు. అంత ఖర్చు భరించలేని పేదరాలను- సులభమైన ఉపాయం చెప్పండి.
సమా: ప్రతిరోజూ కొంచెం అన్నంలో కొన్ని నవధాన్యాలు కొంచెం కలిపి కాకులకు పెట్టండి. గోవుకు సోమవారం దాణా పెట్టండి.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ