భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై.లలితాకుమారి, నిడుమోలు (కృష్ణా)
ప్ర: సార్! పాత శుభలేఖలను- దేవుడు ఫొటోలను ఏం చేయాలి?
సమా: శుభలేఖలు మనకు సంబంధించినదైతే ఒకటి రెండు రికార్డు కోసం పెట్టుకొని మిగతావి పవిత్ర నదీ నదాలలో వదలివేయాలి. ప్లాస్టిక్ వంటివి మాత్రం నీటిలో వదలకూడదు. కాల్చివేయాలి. దేవుడి పాత ఫోటోలు కూడా ఫ్రేములు - అద్దములు తీసివేసి నీళ్లలోనే ఫొటోలు వదలివేయాలి. ‘నదీనాం సాగరో గతిః’ సముద్రంలో చేరి కరిగిపోతాయి.
చిటుకూరి సావిత్రిదేవి, పెందుర్తి (వైజాగ్)
ప్ర: ఒక ఇంటిని కొన్నాను- పూర్తి డబ్బులు చెల్లించాను. రిజిస్ట్రేషన్ కాలేదు. కొన్న ఇంటిలో అమ్మినవాళ్ళు ఒక గదిని ఆక్రమించుకుని కూర్చున్నారు. కోర్టుకు వెళ్లవలసిందేనా?
సమా: కొనుగోలు సమయంలో మీరు జాగ్రత్తపడలేదు. ఒప్పందం పత్రం (అగ్రిమెంట్ ఫర్ సేల్) వ్రాసుకోవలసింది. రిజిస్ట్రేషన్ కాకుండానే మొత్తం డబ్బు చెల్లిం చటం పొరపాటు- కోర్టుకు వెళ్ళేముందు బలమైన సాక్ష్యాలు కావాలి. ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్- అవి సిద్ధం చేసుకొని లాయర్‌ని సంప్రదించండి.
పట్నాల పూర్ణచంద్ర, పొంగిపల్లి (తూ.గో.)
ప్ర: ఉద్యోగంలో స్థిరత్వం- వివాహం - అయిన వాళ్ల నుండేనా- దూరపువాళ్లా?
సమా: ఉద్యోగంలో మీకు ఎప్పుడూ ఏదో కొన్ని మార్పులు చేసుకుంటూనే వుంటాయి. ఒకేస్థానంలో ఒకేరీతిగా ఉండదు. వివాహం అయినవాళ్ల సంబంధమే- ముఖ్యంగా తల్లి తరఫున బాంధవ్యం కలిగి ఉండే అవకాశం ఉంది.
దేసు శ్రీకాంత్‌కుమార్- విజయవాడ (స్థానికం)
ప్ర: వివాహం ఎప్పుడు?
సమా: 2019 ప్రారంభంలో కాని- 2018 చివరినెలల్లో కాని అయ్యే అవకాశం ఉంది. వాయవ్యం ఉత్తర దిశలనుండి సంబంధం రాగలదు. అక్షరాలు- ల - ర - స - శ - క
ఎమ్.ఎస్.ఎన్.మూర్తి, వీరవాసరం (ప.గో.)
ప్ర: ఉద్యోగం పర్మినెంట్ ఎపుడవుతుంది?
సమా: సమీప భవిష్యత్తులో అవకాశం లేదు. మే, జూన్ నెలల్లో కొంత శుభం జరిగే అవకాశం వుంది.
క్రొవ్విడి లక్ష్మీ నరసింహం, సజ్జాపురం (తణుకు)
ప్ర: మా నాన్నగారు ఇచ్చిన ఇంటిని అమ్మాను. అన్నదమ్ములతో ఆటంకాలున్నాయి. వెనక ఇంటి నివాసం- బాగుంటుందా?
సమా: మీది వాస్తుకు సంబంధించిన ప్రశ్న- ప్రత్యక్షంగా చూడనిదే చెప్పలేం.
జె.నవ్య, తణుకు (ప.గో.)
ప్ర: నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. అతనితో నా వివాహం జరుగుతుందా?
సమా: ఆ ఒకరు అని చెప్పబడే వ్యక్తి జాతకం ఎలా వుందో చెప్పలేము కదా?
జి.వి.డి.వి. (పూర్తి పేరు చెప్పటం ఇష్టంలేదు),
సింగపూర్ (సింగపూర్ దేశం)
ప్ర: ఒక వివాహం గురించి -సంఖ్య- పుట్టిన సమయం తేదీ ఇస్తున్నాను. మిగతా వివరాలు చెప్పటం ఇష్టంలేదు. వివాహం ఎప్పుడవుతుంది?
సమా: మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఆ అజ్ఞాత వ్యక్తి జాతకంలో భృగుదోషం- కుజదోషం- చంద్ర దుస్థాన స్థితి దోషాలు ఉన్నాయి. వీలయితే సెల్ఫ్ చిరునామా గల కవరు పంపించండి- నివారణా శాంతి సంస్కారాలు చెప్పగలను.
ఎమ్.వి.ఎస్.ఎన్.రాజు, మట్టపల్లి (మిర్యాలగూడ)
ప్ర: స్థిరాస్తి కొనటానికి హైదరాబాద్ నాకు యోగిస్తుందా?
సమా: భేషుగ్గా యోగిస్తుంది. శుభస్య శీఘ్రం- చక్కగా కొనుక్కోండి- వ్యవహార సంబంధమైన జాగ్రత్తలు మాత్రం పాటించండి.
ఆళ్ళ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి (హైదరాబాద్)
ప్ర: గురవుగారికి నమస్కారం- నాకు సినీ గేయ రచయితగా ఎదిగే యోగం ఉందా? భవిష్యత్తులో నా ఆరోగ్యం ఎలా ఉంటుంది?
సమా: సినిమా అని ప్రత్యేకంగా చెప్పలేను కాని రచయితగా అభివృద్ధికి రాగలరు. ఆరోగ్యం విషయంలో నడుము- మోకాళ్లు మీకు బలహీన స్థానాలు- అనారోగ్య కారకాలు- జాగ్రత్త తీసుకోండి!
గుండా మాధవ్ - సూర్యాపేట- హుజూర్‌నగర్
ప్ర: వివాహం ఎపుడు?
సమా: మీరు పంపిన జాతకం ప్రకారం మీకు ఇదివరకే వివాహం జరిగి ఉండాలి. కాలేదు అంటున్నారు కనుక జన్మ సమయం విషయంలో నాకు సందేహం ఉంది. వీలయితే వ్యక్తిగతంగా కలవండి. కొన్ని దోషాలు పత్రికా ముఖంగా చెప్పటం మంచిది కాదు.
కాలువ శ్రీనివాసరావు, కందుకూరు (ప్రకాశం)
ప్ర: మరణించిన మా తండ్రి నెలలో రెండుసార్లు అయినా నా కలలో కనిపిస్తారు. పక్కన కూర్చుని మాట్లాడతున్నట్లు కనిపిస్తారు. ఇది శుభమా- అశుభమా తెలియజేయగలరు?
సమా: స్వప్న శాస్త్ర ప్రకారం పితృదేవతలు కలలోకి రావడం మంచిదే. అయితే మరీ అంత తరచుగా వస్తున్నారంటే ఆయన కోరిక ఏదైనా ఉందేమో అది తీర్చండి!
వి.అనూషాదేవి, రాజమండ్రి (తూ.గో)
ప్ర: గురువుగారికి నమస్కారం! గతంలో నేను సి.ఏ పాసవుతానని చెప్పారు. ప్యాసయ్యాను. ప్రస్తుత ప్రశ్న- నాకు వివాహం ఎప్పుడు? ఉద్యోగం చెయ్యగలనా?
సమా: ఉద్యోగమే మొదట దొరికే అవకాశం ఉంది. అయితే దూర ప్రాంతంలో- వివాహం ఆలస్యం-
గోవిందరాజులు, సోమందేపల్లి, అనంతపురం
ప్ర: గురూజీ! మీకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు! 2018లో నేను జీవితంలో ఉద్యోగరీత్య స్థిరపడగలనా?
సమా: ప్రభుత్వ సంబంధంగా మే, జూన్, జూలైలలో ఏదైనా మంచి వార్త వింటారు. అయితే ఉద్యోగం కూడా కావచ్చు. కాని దూర ప్రాంతంలో- ఆగ్నేయ దిశలో జరిగే అవకాశం ఉంది.

భవిష్యకాలం కూపన్

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

కూపన్ నింపి ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్,
సికింద్రాబాద్- 03.
bhoomika@andhrabhoomi.net

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ