ప్రేక్షకుల అభినందనే అసలు కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకుడు భీమ్స్

‘మనం చేసిన పని మాత్రమే మాట్లాడాలి అనే మనస్తత్వం నాది. గతంలో చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చినా బయట కనపడటానికి అంతగా ఇష్టపడను. ఎప్పుడైతే ప్రేక్షకులు మెచ్చుకోవడం మొదలుపెడతారో అదే పెద్ద కానుకగా భావిస్తాను’ అని సంగీత దర్శకుడు భీమ్స్ చెబుతున్నారు. రవితేజ, రాశీఖన్నా, తమన్నా ప్రధాన తారాగణంగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందించిన ‘బెంగాల్‌టైగర్’ ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలిపారు. ఇంకా మాట్లాడుతూ, సంపత్‌నందితో వున్న స్నేహం తనకు ఈ సినిమా వచ్చేలా చేసిందని, ప్రాజెక్టు ఓకె అవ్వగానే సంపత్ నంది కొన్ని సన్నివేశాలు చెప్పి బాణీలు సిద్ధం చేయమన్నారని, అవి రవితేజ విని ఓకె చేయడంతో ఈ అవకాశం వచ్చిందని తెలిపారు. ఓ పెద్ద సినిమాకు పనిచేయడం గుర్తుంచుకోదగిన విషయంగా తాను భావిస్తున్నానని, ఈ సినిమాకు పనిచేస్తూ అనేక విషయాలు నేర్చుకున్నానని, ఈ సందర్భంగా పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణపడివుంటానని అన్నారు. ఈ పాటలు ఇప్పటికే అందరికీ నచ్చాయని, రొమాంటిక్ పాటలు కూడా కొత్తగా వుండేలా ఈ సినిమా కోసం ప్రయత్నించామని, అది అందరికీ నచ్చడంతో మరింత ఆనందాన్నిస్తోందని, తాను గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చానుకనుక సంగీతంలో జానపద బాణీలు కనపడుతుంటాయని, ఆ ఫ్లేవర్ లేకుండా ఈ సినిమా కోసం కొత్తగా ప్రయత్నించానని తెలిపారు. ప్రస్తుతం అనేక చిత్రాలకు అవకాశాలు వస్తున్నాయని, ఇంకా ఏదీ పూర్తిగా నిర్ణయించలేదని, త్వరలో ఓ మంచి చిత్రాన్ని ఎంపిక చేసుకునే ఆలోచనలో వున్నాయని ఆయన వివరించారు.