సబ్ ఫీచర్

చేసుకొన్నవారికి చేసుకొన్నంత మహాదేవా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్విధ పురుషార్థాలలో ధర్మం మొదటిది. మనస్సు-ఆత్మలను ఉత్తమ సంస్కార రూపంతో ఉంచే గుణమునే ‘్ధర్మము’ అంటారు. శృతి, స్మృతులచే విధింపబడిన క్రియను ధర్మాచరణమని అంటారు. భారతదేశం కర్మభూమి- ధర్మభూమి గనుక ధర్మానికి పెద్దపీట వేయడం జరిగిందని, పురాణాలు- ఇతిహాసాలలో కన్పిస్తుంది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ్భగవానుడు ధర్మం విలువనూ, ధర్మానికున్న శక్తినీ ఆచరణలో చూపి ధర్మానిదే అంతిమ విజయం అని తెలిపేందుకే అవతరించారు. రావణ సంహార సమయంలో మండోదరి తన భర్త మరణానికి ఆయన అనుసరించిన అధర్మమే కారణమన్నది. సీతవంటి పతివ్రతను బంధించిన అధర్మానికి రావణుడు మరణించాడు.
సోదరులైన పాండవులను వేధించిన అధర్మానికి దుర్యోధనునితో పాటు కురువంశం నాశనమైంది. ఎంతటి పాపానికైనా ప్రాయశ్చితం వుందేమోకాని, అధర్మానికిమాత్రం ప్రాయశ్చిత్తం లేదని శాస్త్ర వచనం.
‘‘్ధర్మో రక్షతి రక్షితః’’. ధర్మ మార్గం తప్పినమనిషి పతనం కాక తప్పదు. రావణునిలో సుగుణాలున్నప్పటికీ ఆయనకున్న పర స్ర్తి వ్యామోహం పతనానికి కారణమైంది.
ప్రకృతి తన ధర్మాలను సృష్ట్యాది నుంచీ ఎన్నడూ విస్మరించలేదు. సకల జీవరాశులూ వాటి ధర్మాన్ని విధులను అవి నిర్వహిస్తూనే వున్నాయి. కానీ నేటి కలి మానవులు భౌతికంగా వాటికంటే ఎన్నోరెట్లు అన్ని విధాల ఉత్తములైననూ స్వధర్మాచరణ పట్ల మొగ్గు చూపక పరతంత్ర మోహితులై తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.
ఎంతకష్టమైన పనులైనా చేయగలిగే మానవుడు కొంచెం విజ్ఞత, సమయస్ఫూర్తి ప్రదర్శిస్తే తన లోపాన్ని తానే తెలుసుకోగలడు. ఇంక వేదాల విషయానికొస్తే మానవుని నిత్య జీవన ధర్మాలను చక్కగా నిర్వచించాయి. కర్మాచరణ గూడా స్పష్టంగా తెలుపబడినది.

- పి.వి.ఎస్. రామమూర్తి